Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ఎప్పుడు కావాలంటే అప్పుడు..ఎక్కడ కావలంటే అక్కడ...

అలాంటి వారికి ఓ ఉపాయం ఉంది వర్టికల్ పెరటి తోట. అరకిలో బరువుండే చిన్న చిన్న ప్లాస్టిక్ కుండీలు ఉంటాయి. వాటిని పట్టి ఉంచడానికి కొన్ని ప్లాస్టిక్ ఫ్రేమ్‌లు ఉంటాయి. వీటిని ఉపయోగించి ఎవరికి వారు ‘పెరటి మొక్కల పొద’ (బయో వాల్)లను, ‘పెరటి మొక్కల గోడ’ (గ్రీన్ వాల్)లను పదంటే పది నిమిషాల్లో సృష్టించుకోవచ్చు.
ఆకారం, ఎత్తు, పొడవు, వెడల్పు.. ఎలా కావాలంటే ఆ విధంగా కుండీలను అమర్చుకునే వీలుంది. గుండ్రంగా పొద మాదిరిగా ఫ్రేమ్స్‌ను కలిపి, చుట్టూ ప్లాస్టిక్ కుండీలు తగిలించవచ్చు. లేదంటే ప్లైవుడ్‌కు ఈ ఫ్రేమ్స్‌ను కోరిన వెడల్పు, ఎత్తు, పొడవులలో సులువుగా బిగించుకోవచ్చు. తర్వాత చిటికెలో కుండీలు తగిలించవచ్చు.
వారానికో, నెలకో.. మీకు తోచినప్పుడు ఈ ఫ్రేమ్స్‌ను మార్చి.. మీ అత్యాధునిక పెరటి తోటకు పది నిమిషాల్లో కొత్త రూపు దిద్దుకోవచ్చు. ఈ మార్పులన్నీ నిపుణులెవరో వచ్చి చెయ్యక్కర్లేదు. ఫ్రేమ్‌ల అమరికను ఒక్కసారి పరికించి చూస్తే చాలు.. ఎవరికివారే పెరటి తోటను బిగించుకోవచ్చు! అన్నిటికీ మించి.. ప్రస్తుతం కొద్ది రోజులు ఏ పెరటి తోటా వద్దు అనుకుంటే... ఫ్రేమ్‌లను, కుండీలను తీసేసి.. ప్యాక్‌చేసి అటకపై దాచిపెట్టుకోవచ్చు. మళ్లీ ఎప్పుడంటే అప్పుడు పది నిమిషాల్లో బిగించుకొని.. ఆకుకూరల విత్తనాలో, కూరగాయల విత్తనాలో చల్లుకోవచ్చు. మధ్యలో పూలమొక్కలూ పెట్టుకోవచ్చు.
సులువుగా మార్చుకోవచ్చు ఇంటి పెరటిలోనో, ఇంటి పైనో, అపార్ట్‌మెంట్ల బాల్కనీల్లో.. ఎక్కడ అవసరమైతే అక్కడ ఈ బయోవాల్స్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంటి హాల్‌లో (నీడ పట్టున) అందంగా ‘ఫ్రేమ్ గార్డెన్’ను గోడకు వేలాడదీయొచ్చు. అటువంటి ఫ్రేమ్‌లు మరి కొన్నిటిని ఆరుబయటో, బాల్కనీల్లోనో (ఎండ తగిలే చోట) ఏర్పాటు చేసుకోవచ్చు. మూడు రోజులు నీడ పట్టున ఫ్రేమ్‌లకు ఉన్న మొక్కల కుండీలను ఎండ తగిలే చోటుకు తరలించి.. ఎండ తగిలే చోట ఫ్రేమ్‌లకు ఉన్న మొక్కల కుండీలను నీడపట్టున ఫ్రేమ్‌లకు అతిసులువుగా తగిలించుకోవచ్చు.



Click it and Unblock the Notifications