Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
పూలమొక్కలు బాగా ఎదగాలంటే కుండీల ఎంపిక

సాధారణంగా మొక్కలను పెంచే కుండీలు మట్టితోగాని, సిమెంట్ తో గానీ తయారుచేస్తారు. పూల తొట్లకు అడుగు భాగాన మురికి నీరు కారిపోవడానికి రంధ్రాలు ఉండాలి. ఇవి పూడిపోకుండా వీటి పెంకు ముక్కలను బోర్లించి వాటిపై ఇటుక ముక్కలు, కొబ్బరిపీచు వేసి వాటిపైన ఒక అంగుళం మందం గరుకు ఇసుక పోసి తొట్లను ఎరువు మట్టితో నింపాలి. ఈ మట్టి మిశ్రమంలోని పదార్థాల పాళ్ళు మొక్కలను బట్టి మారుతుంది.
ఇంటి దగ్గర పెంచే పూల తొట్టేల మన్ను తయారు చేయడంలో బాగా వ్యర్థమైన ఆకుపొట్టు, పశువుల ఎరువు, ఎర్రమట్టి, ఇసుక సమ భాగాళ్ళలో తీసుకొని, ఎరువు మట్టిని తొట్లలో నింపాలి. మొక్కల వేర్లు మడత పడకుండా నాటాలి. నాటిన వెంటనే ఎక్కువగా నీరు పోయాలి. తొట్లు చిన్నవి అయితే దాన్ని నీటితో నిండి ఉన్న పెద్ద తొట్టిలో ముంచి గాలి బుడగలు అన్ని బయటకు వచ్చే వరకు అలాగే ఉంచాలి.
నాటిన మొక్క పొడవుగా ఉంటే పక్కకు వాలిపోకుండా ఒక కట్టె పుల్లను పక్కనే నాటి దానికి సపోర్ట్ గా కట్టాలి. మొక్కను కంపౌండు భూమిలో నాటుకోవాలంటే రెండు అడుగుల పొడవు, వెడల్పు గల గుంతను తవ్వి దానిలోని మట్టికి రెండింట ఒకబాగం పశువుల ఎరువును వేసి గోతిని నింపాలి. నేల బంకమట్టిది అయితే ఒకబాగం ఇసుక కూడా కలపాలి. తరువాత నీరుపోసి మొక్కను వారం, పది రోజుల్లో నాటుకోవచ్చు.



Click it and Unblock the Notifications
