Latest Updates
-
ఓంకారం జపిస్తే ఏమవుతుంది? శాస్త్రాలు చెప్పిన ఆశ్చరికకర విషయాలు -
Father's day 2026: ఈ ఫాదర్స్ డే నాడు పిల్లల నుండి తండ్రులు నేర్చుకోవాల్సిన విషయాలు.. -
ఖర్చు లేని హెల్త్ ఇన్స్యూరెన్స్..మీ బంధుమిత్రులకు ఇలా యోగా డే విషెస్ చెప్పండి -
Happy Father's Day 2026: కనిపించే దేవుడు నాన్న..హార్ట్ టచింగ్ ఫాదర్స్ డే విషెస్, కోట్స్, స్టేటస్ లు -
యోగా చేసిన తర్వాత తినాల్సిన హెల్తీ ఫుడ్స్..ఎలా చేసుకోవాలో చూడండి -
బాగా బిజీగా ఉండేవాళ్ల కోసం 5 బెస్ట్ యోగాసనాలు..తక్కువ టైంలో అద్భుత ప్రయోజనాలు -
వంద రకాల టమాటా చట్నీలలో ఆరోగ్యానికి, రుచికి బెస్ట్ ఇదే..టమాటా మిరియాల చట్నీ చేసుకోండిలా.. -
ఈరోజు సిద్ధి యోగం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం! -
స్లోవేకియా స్పీకర్ కు ప్రధాని మోదీ గిఫ్ట్ గా ఇచ్చిన బీహార్ స్పెషల్ థేకువా..మీ ఇంట్లోనే చేసుకోండిలా.. -
బుధాదిత్య యోగం: ఈ రాశుల వారికి జూన్ 22 వరకు తిరుగేలేదు, భారీ లాభాలు ఖాయం!
అధిక పరిమళం..ఎక్కువ పూలు...!

ఇంటి దగ్గర పెంచుకొనే పూల మొక్కలు చాలా ఉన్నా.. కుండీల్లో పెంచుకొనే మొక్కలు పెరిగే విధానం.. భూమిలో నాటినటువంటి మొక్కలు పెరిగే విధానంలో చాలా వత్యాసం వుంటుంది. ఏ మొక్కకు అయినా ప్రతి రోజూ నాలుగైదు గంట సేపు సూర్య రశ్మి అవసరం అవుతుంది. ముఖ్యంగా మొక్కలకు ఉదయం పడే ఎండ చాలా మంచిది. సాయంత్రం అయినా సరే. ముఖ్యంగా ఎండ తగలాల్సింది ఆకులకు, కాబట్టి ఇట్లో పెంచుకొనే సన్నజాజి వంటి తీగ మొక్కకు కుండీ ఎక్కడ పెట్టినా ఇబ్బంది ఉండదు.
సన్నజాజి తీగ పెంచడానికి పెద్దకుండీలో 10-15 కిలోల పాట్ మిక్చర్ (ఒక భాగం మట్టి, ఒక భాగం వర్మీ కంపోస్ట్ లేదా కంపోస్ట్ ఒక భాగం లీఫ్ మోల్డ్ మిశ్రమం) నింపి మొక్క నాటాలి. మొక్క ఎదిగే కొద్దీ పైకి అల్లుకోవడానికి వీలుగా చైన్ లింక్స్ కట్టాలి. తీగను గోడకు లేదా కిటికీకి అల్లించుకోవచ్చు. అల్లించాల్సిన చోట ఇనుప రాడ్ తో గట్టి ఫ్రేమ్ ఏర్పాటు చేసి చైన్ లింక్స్ లేదా జాలీ అమర్చాలి. దీనిని వర్టికల్ గార్డెన్ అంటారు. సాధారణంగా ఎండ దక్షిణం, పడమర దిక్కుల్లో పడుతుంది. కాబట్టి ఇంటికి ఈ దిక్కుల్లోనే ఇలాంటి తీగలను పెంచుకుంటే చెట్టు బాగా పెరుగుతుంది, ఇంటికి ఎండ తాకిడి తగ్గుతుంది కూడ.
మొక్కలను ఎంతగా కత్తిరించినా మొక్కకు నష్టం ఉండదు. అయితే కత్తిరించిన తర్వాత పేడ నీరు, ఆకుల కషాయం, వేపనూనె కలిపిన నీరు... వీటిలో ఏదో ఒక దానిని స్ప్రే చేయాలి. సాధారణంగా గులాబీ వంటి కాండం గట్టిగా ఉన్న మొక్కలకు ప్రూనింగ్(కత్తిరించడం) చేసినప్పుడు కత్తిరించిన చోట పేడనీటిని రాయడం లేదా చిన్న పేడ ముద్దను అద్దడం చేస్తాం. సన్నజాజి వంటి చెట్ల కొమ్మలు సన్నగా ఎక్కువ మోతాదులో ఉంటాయి కాబట్టి ప్రతి కొమ్మకూ పేడనీటిని రాయడం సాధ్యం కాదు. అందుకే మిశ్రమాన్ని స్ప్రేయర్‌లో పోసి స్ప్రే చేయాలి.
సన్నజాజికి సీజన్‌తో సంబంధం లేదు. ఎప్పుడైనా నాటవచ్చు. వారానికోసారి లేదా రెండు వారాలకోసారి మల్చింగ్(మల్చింగ్ అంటే మట్టిపై పొరను గుల్లబరచడం, ఈ క్రమంలో మట్టి గుల్లబారడం, పోషకాలు మొక్కకు బాగా పట్టడంతో పాటు కలుపు మొక్కలు నశిస్తాయి. సాధారణంగా కలుపుమొక్కలు మట్టిలోని పోషకాలను పీల్చుకుని పెరుగుతాయి. మట్టిని కలబెట్టినప్పుడు అవి మట్టిలో కలిసిపోయి తిరిగి మొక్కకు పోషకంగా మారుతాయి) చేస్తే మంచిది. ఎంతగా మల్చింగ్ చేస్తే మొక్క అంత ఆరోగ్యంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications