Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
మన ఇంటి ఆవరణలో మనోల్లాసాన్ని కలిగించే లాన్స్...!

కొద్దిపాటి ఖర్చుతో లాన్స్ అందంగాను, ఆరోగ్యంగాను ఉంచుకోవచ్చు. లాన్స్ వల్ల దుమ్ము, ధూళిని అరికట్టవచ్చు. లాన్స్ వల్ల వేడి, రేడియేషన్ తగ్గుతుంది. ఇంటి ఆవరణలో లాన్ వేసినట్టయితే వేడి తీవ్రత తగ్గుతుంది. ఆకుపచ్చని లాన్స్‌పై నడవటం ఆరోగ్యానికి మంచిది. లాన్స్ మనోల్లాసాన్ని కలిగిస్తాయి. దుమ్ము,ధూళి తగ్గుతుంది కాబట్టి కాలుష్యాన్ని అరికట్టి. ఉదరసంబధ వ్యాధులను తగ్గించవచ్చు.
లాన్‌లో రకాలు: ఇంటి ఆవరణలోని కొద్ది స్థలంలో కూడా కొన్ని రకాల లాన్ లను పెంచుకోవచ్చు అలాంటివి మీకోసం...
1. కలకత్తా దూబ్ గ్రాస్
2. కార్పేటర్ గ్రాస్
3. ఫిస్కో గ్రాస్
4. షెడ్ గ్రాస్
1. కలకత్తా దూబ్ గ్రాస్: దూబ్ గ్రాస్‌లో ఫిస్క్యూ, బర్ముడా, జి2 కలకత్తా దూబ్ అనే రకాలు ఇంచుమించు ఒకేరకంగా ఉంటాయి. ఇవి తక్కువ ఖర్చుతో కూడినవి. వీటి నిర్వహణ ఖర్చు తక్కువ. కాని వీటిని తరచుగా కత్తిరిస్తూ ఉండాలి. పెద్దపెద్ద ఆవరణలలో హోటల్స్, దాబా. పార్క్, ఫంక్షన్‌హాల్స్‌లో కనిపిస్తుంటాయి.
ఇంటి ముందర ఏ మాత్రం కొద్దిపాటి స్థలం ఉన్నా ఈ రకమైన దూబ్ గ్రాస్ ను పెంచుకోవచ్చు. పెంచుకొనేముందు ఎర్రమట్టిని ఆరడుగుల లోపల నుంచి నింపి, దిమ్మిసతో సమాంతరంగా ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత రెండు నెలలకు పెరుగుతుంది. దీనికి ఎక్కువగా నీటి అవసరం ఉండదు. చీడ, పీడలు కూడా పట్టవు. ఇది పురాతమైన గడ్డి. దీనికి ఓ ప్రాంతమంటూ పెంచాల్సిన అవసరం లేదు. ఎక్కడబడితే అక్కడ ఈ గ్రాసం మొలుస్తుంది. త్వరగా పెరుగుతుంది. కాబట్టి దీన్ని ఎక్కువ సార్లు కట్ చేయాల్సి ఉంటుంది..
2. కార్పేటర్ గ్రాస్: కార్పెట్ గ్రాస్‌లో చాలా రకాలు ఉన్నాయి. ప్రస్తుతం వాడుకలో కొరియన్ కార్పెట్ గ్రాస్, మెక్సికన్ కార్పెట్ గ్రాస్, జేడ్ వెల్‌వెట్, సెంట్‌పీడ్ గ్రాస్ ఉన్నాయి. కొరియన్ గ్రాస్‌కు నీరు తక్కువ ఉన్నా కాస్తంత నీడ ఉన్నా పెరుగుతుంది. సాయంకాలం లేదా సూర్యోదయానికి ముందు లాన్స్‌కు నీళ్లు పెట్టాలి. ఈ గడ్డి చాలా సున్నితమైన గడ్డి. దీన్ని ఎక్కువగా ఖరీదైన భవంతుల ముందు పెంచుతారు. ఇది ఖర్చుతో కూడుకున్నది. ప్రతి రోజూ పరిశీలిస్తూ ఉండాలి. ఈ గడ్డి నీడలో ఉండాలి. ఎక్కువగా ఎండ తగిలితే అంత బాగా పెరగదు. బండలు బండలుగా పెరుగుతుంది. దీన్ని ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకెళ్లడం తేలిక.
కార్పెట్ గ్రాస్‌తో వేసవిలో రూప్‌గార్డెన్ కూడా వేయవచ్చు. రూఫ్ గార్డెన్‌ను నిపుణులైనవారిచేత వేయించడం మంచిది. రూఫ్ గార్డెన్ చల్లదనాన్ని ఎసి ఫీలింగును కలిగిస్తుంది. సాయంకాలం లాన్‌లో కూర్చోడానికి ఉపయోగపడుతుంది. లాన్స్‌లో ఇతర కలుపుమొక్కలను ఎప్పటికప్పుడు తీసివేయాలి. కార్పెట్‌గ్రాస్‌కు పశువుల ఎరువు వాడరాదు. దీనివల్ల కలుపు అధికంగా వచ్చే అవకాశం ఉంది. పైపొరగా కాస్తంత నల్లమట్టి వాడటం మంచిది.
3. ఫిస్కో గ్రాస్: ఈ గ్రాసాన్నీ పెద్ద పెద్ద బంగ్లాల్లోనే పెంచుతారు. దీనికి ఎర్రమట్టి నేల. అనువైనది. దీని మెయింటెనెన్స్ కూడా ఖరీదుతో కూడుకున్నది. ప్రతి పదిహేను నుంచి ఇరవై రోజులకొకసారి నీరు పోయవలసి ఉంటుంది. ఎండాకాలంలో అయితే వారానికి రెండుసార్లు నీరు ఇవ్వాల్సి వస్తుంది. చెదలు, చీమలు పట్టకుండా సెవిడానిల్ పౌడర్‌ను ఒక గ్రాము లీటరు నీటిలో కలిపి చల్లాలి. ఇది కొద్దిగా సున్నితమైన గ్రాసం. దీనిపై కూర్చుంటే మొత్తగా, పరుపులాగా ఉంటుంది. వీటి ఆకులు గట్టిగా ఉంటాయి. ఒకసారి నాటుకుంటే మూడు నుంచి నాలుగు సంవత్సరాల వరకు ఉంటుంది. ఎక్కువ కోతలు కూడా అవసరం ఉండదు.
4. షెడ్ గ్రాస్: ఇది పూర్తిగా చెట్ల నీడ కింద మాత్రమే పెరుగుతుంది. ఓ సారి నాటితే ఐదు ఆరు సంవత్సరాల వరకు ఉంటుంది. దీన్ని పెంచడానికి పెద్దగా ఖర్చుచేయాల్సిన పనిలేదు. నీరూ అంతగా అవసరం ఉండదు. ప్రత్యేక మెయింటెనెన్సూ చేయనక్కర లేదు. చీడ, పీడల బెడద కూడా తక్కువే. కంపౌండ్‌లో గల చెట్ల మధ్య ఈ గ్రాసాన్ని పెంచుకోవచ్చు. ఇది చల్లగా, హాయిగా ఉంటుంది.
సూచనలు:
1. లాన్ ఏర్పాటు చేసుకోవాలంటే.. 80శాతం ఎర్రమట్టి, 20శాతం ఇసుక నేల అయి ఉండాలి.
2. దాని ఏర్పాటుకు నల్ల మట్టి నేలలు అనుకూలం కావు.
3. కొన్ని గ్రాసాలు వేర్లతో సహా తీసుకొచ్చి నాటుకోవాలి.
4. లాన్ ఏర్పాటు చేసుకొనే ముందు నేలను బాగా కలియదున్నాలి.
5. వేప పిండి, వర్మికాంపోస్ట్ తప్పకుండా వేయాలి.
6. లాన్ ఏర్పాటు చేసుకున్న తర్వాత వీలును బట్టి పెరుగుదల కోసం, పచ్చదనం కోసం యూరియాను చల్లాలి.
7. పెరుగుదలను బట్టి కలుపు మొక్కలను తీసేయాలి.
8. గడ్డి కుళ్లిపోతున్నట్లయితే ఒక గ్రాము కార్బండిజం పౌడర్‌ను లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి.



Click it and Unblock the Notifications