Latest Updates
-
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. !
సుగందాలకు..అలంకరణకు పెట్టింది పేరు గులాబీలు...

గులాబి: అన్ని కాలాలలో లభించే ఈ పూపొద లేదా తీగ రోసా జాతికి చెందినది. కాండంపై పదునైన ముళ్ళను కలిగి ఉండే ఈ జాతి తిన్నని పొదలు, పైకి లేదా నేలపై పాకే మొక్కల సముదాయంగా ఉంటుంది. గులాబీలను అంటు కట్టుట లేదా కొమ్మలను నాటుట ద్వారా వృద్ధి చేస్తారు. గులాబీలను పువ్వులకోసం మొక్కలను పెంచుకొంటారు. మారుతున్న కాలానుగుణాన్ని బట్టి గులాబీలకు ఒక రోజుకు 5 గంటల సూర్యరశ్మి అవసరమవుతుంది. వికసించి ఉన్నపుడు మరియు శీతాకాలంలో మంచు కురుస్తున్నపుడు గులాబీలు నిద్రాణ దశకు చేరుకుంటాయి. గులాబీలు తోట మొక్కలుగా మరియు పూల అలంకరణలో వీటికి ఉన్న ప్రాధాన్యతతో పాటు, పరిమళ ద్రవ్యాల పరిశ్రమలో కూడా ఇవి గొప్ప విలువ కలిగి ఉన్నాయి.
గులాబీలను నేలల్లో, తొట్లలో పెంచవచ్చు. వీటికి నీడ గిట్టదుగాని, వడగాలి తగలకుండా గాలి కట్టువలు మాత్రం కావాలి. బాగా చవికిన పశువుల ఎరువుగాని, కంపోస్టుగాని వేసిన ఎర్రనేలలో ఇవి బాగా పెరుగుతాయి. నేలపై 50 సెం.మీ కొలతల గుంతలను ఒకటి, ఒకటిన్నర మీటర్ల దూరంలో తీసి మంచి ఎర్రమట్టి అయితే అదే మన్నుకు రెండింటా ఒకపాలు చేర్చి నింపాలి. ఎర్రమన్ను మంచిది కాకపోతే ఎరువు ఇసుకలను మూడు, రెండు, ఒకటి నిష్పత్తుల్లో మన్నుతో నింపాలి. గులాబీ మొక్కలను పురుగు మందులను తరచుగా పిచికారీ చేయడం మంచిదే ఐనప్పటికీ ఉపయోగకరమైన కీటకాలు నాశనం కాకుండా జాగ్రత్త వహించాలి.



Click it and Unblock the Notifications
