కలర్ ఫుల్ పుట్టగొడుగులను చూసారా.?ఎంత అందంగా ఉన్నాయో...!

పుట్టగొడుగులను పెంచడం చాలా సులభం మరియు తక్కువ ధరతో కూడుకొన్న పని. సాధారణంగా ఇంటి ఆవరణంలో లేదా గార్డెన్ లో వివిధ రకాల పూల మొక్కలు, వెజిటేబుల్ మొక్కలు పెంచుకుంటారు. కానీ మష్రుమ్(పుట్టగొడుగులను ) పెంచుకోవడం చాలా అరుదు. కానీ వివిధ రంగులు, వివిధ ఆకారల్లో ఉండే పుట్టగొడుగులను పెంచుకోవడంపై కొంత అభిరుచి కలిగి ఉంటారు, ప్రయత్నిస్తే ఆ కోరికను కూడా తీర్చుకోవచ్చు. ఇంటి గార్డెన్ ను అందంగా ఆకర్షణీయంగా కలర్ ఫుల్ గామార్చుకోవచ్చు. పుట్టగొడుగులు పెంచడం అంత కష్టమైన పనేం కాదు. అదీని ఇవి చాలా వేగంగా పెరుగుతాయి. కష్టించాల్సిన పనిలేకుండానే మన గార్డెన్ లో అందంగా పెంచుకోవచ్చు.

ప్రకృతిలో సహజసిద్దంగా పెరిగే ఈ పుట్టగొడుగులకు నిర్వాహనకు అంత శ్రద్ద తీసుకోనవసరం లేదు. ఇవి ఎక్కువగా అడవి ప్రాంతంలో లేదా చాలా తేమగా ఉన్న భూముల్లో ఎక్కువగా పండుతాయి. అవి పెరగడానికి మంచి వాతావరణం కల్పిస్తే చాలు వాటంతటవే చాలా వేగంగా పెరిగిపోతాయి. మీ ఇంట్లో గార్డెన్ ఉన్నప్పుడు అందులో అతి వేగంగా పెరిగే ఈ పుట్టగొడుగులను పెంచుకోవడా చాలా అవసరం. ఎందుకంటే కొన్ని రకాల పుట్టగొడుగులు తినదగినవి. కాబట్టి మీరు తినేటటువంటి కూరగాయలు, హెర్బ్ మొక్కలతో పాటు మీ కిచెన్ గార్డెన్ లో పుట్టగొడుగులను పెంచుకోవడానికి ప్రయత్నించండి.

మష్రుమ్(పుట్టగొడుగులను)గార్డెన్ మొక్కలని పిలవలేము. ఎందుకంటే జీవశాస్త్రం ప్రకారం ఇవి శిలీంధ్రాలు. పుట్టగొడుగులు అన్ని రకాలు తినదగినవి కాదు, ఎందుకంటే కొన్ని విషపూరితమైనవి. ప్రస్తుత మార్కెట్లో మష్రుమ్(పుట్టగొడుగుల)వెల చాలా ఖరీదైనది. ఎందుకంటే కొన్ని రకాల పుట్టగొడుగుల్లో ఉండే ఆరోగ్యప్రయోజనాలను ఇటీవల కనుగొనబడినది. ఏదైతేనెం, ఒక సారి వీటిని మీరు కొన్నతర్వాత, అదనపు ఖర్చలేం ఉండవు. ఎందుకంటే వాటిని తీసుకొచ్చి తడిగా ఉన్న మీ గార్డెన్ ప్రదేశంలో నాటితే చాలు, బాగా, వేగంగా పెరుగుతాయి. వీటిని సూర్య రశ్మి అవసరం లేదు. నీడలో నాటినా సరే అతి వేగంగా పెరుగుతాయి.

ఆరోగ్యపరంగా కాకుండా మీ గార్డెన్ అలంకరణకోసం మాత్రమే పుట్టగొడుగులను పెంచుకోవాలనుకున్నప్పుడు, కలర్ ఫుల్ మష్రుమ్ ను ఎంపిక చేసుకోవడం మంచిది. ఈ కలర్ ఫుల్ మష్రుమ్ లను గార్డెన్ లో పెంచడం వల్ల అందంగా ప్రకాశవంతంగా రంగురుంగుల్లో ఆకర్షణీయంగా కనబడుతాయి. మరి అలాంటి కొన్ని మీకోసం...

కలర్ ఫుల్ పుట్టగొడుగులను చూసారా.?

మైసినా ఇంటర్ప్టా లేదా పిక్సీ పరాసోల్: బ్రిలియంట్ ఆక్వా బ్లూ కలర్ లో ఉండే ఈ పుట్టగొడుగులు అలంకరణకు అద్భుతంగా కనబడుతాయి. వీటిలో కొన్ని తినదగినవి ఉన్నాయి. కానీ విషపూరితమైనవి కాబట్టి వాటిని తినడం మంచిది కాదు.

కలర్ ఫుల్ పుట్టగొడుగులను చూసారా.?

ఫోలియోట ఎస్ పి: ఆస్ట్రేలియాలో విరివిగా పెరిగే ఈ ప్రత్యేకమైన ఆరెంజ్ కలర్ మష్రుమ్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ పుట్టగొడుగులు, నాచు లేదా చెట్టు బార్క్ మధ్య బాగా పెరుగుతాయి. మీ గార్డెన్ కళాత్మకంగా కనబడాలంటే ఈ పుట్టగొడుగులను పెంచుకోవచ్చు.

కలర్ ఫుల్ పుట్టగొడుగులను చూసారా.?

హైగ్రోసెబి కొక్కోనియా లేదా స్కార్లెట్ హుడ్: ఈ పుట్టగొడులకు చాలా సులభంగా గుర్తించవచ్చు. ఎందుకంటే వీటికున్నశక్తివంతమైన ఎరుపు రంగు ను బట్టి వీటిని గార్డెన్ అలంకరణకు.. సౌందర్య ప్రాయంగా పెంచుకోవచ్చు.

కలర్ ఫుల్ పుట్టగొడుగులను చూసారా.?

పింక్ మెసినా ఎస్ పి: మెసిన మష్రుమ్ వివిధ రంగుల్లో కనిపిస్తాయి. ఈ పింక్ మెసినా మీ లివింగ్ రూమ్ లో కనుక పెట్టుకొంటే చాలా అట్రాక్షన్ గా అలంకరణ ప్రాయంగా కనబడుతుంది.

కలర్ ఫుల్ పుట్టగొడుగులను చూసారా.?

మారస్పిస్ ఎస్ పి(Marasmius SP): Marasmius sp రకంలో చాలా రకాల పుట్టగొడుగులున్నాయి. ఇవి మీ కిచెన్ గార్డెన్ లో పెరుగుతాయి కుటుంబం తినదగినవిగా ఉంటాయి.

కలర్ ఫుల్ పుట్టగొడుగులను చూసారా.?

మెసినా పర్పరియోఫస్కా(Mycena purpureofusca):ఇవి పుస్తకపు పుట్టగొడుగులు. ఇవి చిన్న గొడుగులు మాదిరిగానే కన్పిస్తాయి. వీటి రంగు లెదర్ బ్రౌన్ కలర్ లో ఉంటాయి. మరియు హెర్బ్ గార్డ్ లో పెంచుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటాయి.

కలర్ ఫుల్ పుట్టగొడుగులను చూసారా.?

Phlogiotis helvelloides: ఇవి అసాధారణ పుట్టగొడుగులు. ఇవి రంగురంగుల పుష్పగుచ్చాలు మాదిరిగానే కన్పిస్తాయి.మీ తోట వాటిని పెంచుకోవాలనుకుంటే ఇవి అందమైన పువ్వులుగా పెరుగుతాయి. వాటిని ఎంపిక చేసుకోవాలి.

కలర్ ఫుల్ పుట్టగొడుగులను చూసారా.?

Ramaria sp: ఈ పుట్టగొడుగు గోల్డెన్ కోరల్ మష్రుమ్ అని పిలుస్తారు. ఎందుకంటే మనోహరమైన పసుపు రంగు కలిగి ఉండటం చేత. ఇది పగడపు ఒక భాగం వలె నిర్మించబడింది. వీటిలో 200 రకాల పుట్టగొడుగు ఉప జాతులు ఉన్నాయి వీటిలో చాలా రకాలు తినదగిని ఉన్నాయి.

కలర్ ఫుల్ పుట్టగొడుగులను చూసారా.?

Pleurocybella porrigens: ఈ పుట్టగొడుగులను పూర్తిగా ముత్యాలు లాంటి తెలుపు రంగులో డివైన్ ప్లవర్స్ లా మెరిసిపోతుంటాయి. వాటిని ముట్టుకుంటే చాలా సున్నితంగా ఉంటాయి. వీటిని చాలా మంది తింటారు.

కలర్ ఫుల్ పుట్టగొడుగులను చూసారా.?

Amanita virgineoides లేదా ఓగ్రే పుట్టగొడుగులు: సాంప్రదాయంగా, ఈ పుట్టగొడుగులు చూడటానికి చాలా అసహ్యంగా కనబడుతాయి ఎందుకంటే వీటి శరీరంలో ముళ్లలాంటి దిమ్మలను కలిగి ఉండం వల్ల. అయితే ఇవి మీ గార్డెన్ లో మాత్రం అద్భుతమైన అలంకరణను అందిస్తాయి.

Desktop Bottom Promotion