Latest Updates
-
అల్లుడిపై ఐదుగురు పిల్లల అత్త వ్యామోహం..కన్న కూతురికే సవతిలా మారి..చివరికి ఏమైందంటే.. -
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్.! -
ఎన్నడూ లేని విధంగా ప్రధాన గ్రహాల సంచారం, అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి సిరిసంపదల వరాలు.! -
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.!
ఇంట్లో ప్రతిరోజూ శుభ్రం చేయాల్సిన వస్తువులు!

1. సోఫా సెట్ దుమ్ము దులపటం - చాలామంది వారానికొకసారి దులుపుదామని అనుకుంటారు. కాని దుమ్ము కొట్టుకున్న సోఫాలు, టీపాయ్ వంటివి మన ఉపయోగానికే అసహ్యం పుట్టించేవిగా వుంటాయి. ప్రతిరోజూ వాడే వస్తువుల దుమ్ము దులపటమనేది అవసరంగా భావించండి.
2. ఎలక్ట్రానిక్ పరికరాలు - అతి ఖరీదైన డివిడి ప్లేయర్లు, టీ.వీలు, కంప్యూటర్లు మొదలైనవి ఫెదర్ డస్టర్ తో ప్రతిరోజూ వేగంగా శుభ్రపరిస్తే చూడటానికి బాగుంటాయి.
3. వంట గిన్నెలు - మీరు ఏ డిష్ చేసినప్పటికి, గిన్నెలను వీలైనంత త్వరగా అంటే కనీసం 10 లేదా 12 గంటలలోపు శుభ్రం చేసేయండి. లేదంటే, అవి వాసన కొట్టటమే కాక, అనారోగ్యాన్ని కూడా కలిగిస్తాయి.
4. డైనింగ్ టేబుల్ - మీరు దీనిపై తినటానికి కూర్చుంటారు. కనుక ఇది శుభ్రంగా వుండాలని చెప్పనవసరం లేదు. దీనిపై ఆహార పదార్ధాలు, మరకలు, ఎన్నో వుంటాయి. వారాంతంలో చేద్దామనుకుంటే చాలా అసహ్యంగా తయారవుతుంది. కనుక. ఒక తడి గుడ్డనను తీసుకొని వీలైనంత త్వరగా తుడిచేస్తే మరకలు మాయమై డైనింగ్ టేబుల్ బాగుంటుంది.
5. కిచెన్ సింక్ - దీనిలో వంట పాత్రలను శుభ్రం చేస్తాము. కనుక సింక్ కూడా శుభ్రంగా వుంటే పాత్రల శుభ్రత మరింత బాగుంటుంది. ప్రతిరోజూ శుభ్రం చేయవలసిన వాటిలో ఇది ప్రధానమైంది.
6. కిచెన్ స్లాబ్, మరియు దానిపైన వుండే స్టవ్ - వంట పూర్తయిన తర్వాత, గ్యాస్ స్టవ్, కిచెన్ స్లాబ్ తప్పక శుభ్రం చేయండి. అక్కడ ఏ మాత్రం మురికి లేదా పదార్ధాలు పడి వున్నా తినే ఆహారం సైతం అనారోగ్యకరంగా వుంటుంది.
7. బెడ్ - మీరు పడుకునే బెడ్స్ ప్రతిరోజూ శుభ్రం చేసుకోవాలి. బెడ్ షీట్ మార్చకపోయినప్పటికి దానిని దులపటం, ముడుతలు లేకుండా చేయటం, తలగడలు సరి చేయటం, రాత్రి వేళ కప్పుకున్న దుప్పటి మడత పెట్టటం వంటివి తప్పక చేయాలి. మరల పడుకునే సమయంలో శుభ్రపరచిన బెడ్ పై పడుకోవటం మానసికంగాను, శారీరకంగాను హాయి అనుభవించేలా చేస్తుంది.
ప్రతిరోజూ శుభ్రం చేసుకుంటూంటే, పండుగలపుడు, ఇంట్లో ఏదైనా సందర్భాలు వచ్చినపుడు పని కూడా తక్కువగా వుంటుంది.



Click it and Unblock the Notifications
