Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
కృత్రిమ జలపాతంలో మీ ఇంటికి మరింత శోభ..!!

అంతేకాదు ఇప్పుడి ప్రక్రియ ఫ్యాషన్ గా కూడా మారిపోయింది. మార్కెట్లో దొరుకుతున్న ఈ కృత్రిమ జలపాతాలు ఇంట్లో ఎలా అమర్చుకోవాలో ఇప్పుడు చూద్దాం. విశాలమైన బాల్కనీ ఉండేవారికి కృత్రిమ ఫైబర్ జలపాతం బాగా నప్పుతుంది. అలాగే బాల్కనీ చిన్నదిగా ఉండేవారికి వాల్ ఫౌంటేయిన్ సరిపోతుంది. ఇవి ఏ గదులకైనా అనువుగానే ఉంటాయి. బాల్కనీల సైజును బట్టి కనీసం నాలుగు అడుగుల ఫౌంటెయిన్ లు అమర్చుకోవచ్చు.
కొంత మంది ఇంటి ప్రవేశ ద్వారం వద్ద కృత్రిమ జలపాతాలను ఏర్పాటు చేసుకునేందుకు ఇష్టపడుతుంటారు. ఇంటికి వచ్చే అతిథులకు స్వాగతం పలికేలా వీటిని ఏర్పాటు చేస్తుంటారు. అయితే ఇలాంటివి ఎక్కువగా నేడు విగ్రహాల రూపంలోనే మార్కెట్లో లభిస్తున్నాయి. అయితే ఇవి ఎక్కువగా దృశ్యప్రధానంగా ఉంటేనే చూసేందుకు ఆకర్షణీయంగా ఉంటాయి.
లివింగ్ రూమ్ పరిమాణాన్ని బట్టి కొంత మంది కృత్రిమ జలపాతాలను ఏర్పాటు చేస్తుంటారు. ఇలాంటి వాటికి పువ్వులు, మొక్కలు ఉన్నవయితే బాగుంటాయి. పడక గదిలో అయితే ఉత్సాహం, మానసిక ప్రశాంతతను కలిగించేలా సూర్యోదయం, చంద్రోదయం లాంటి దృశ్యప్రధాన కృత్రిమ జలపాతాలు బాగా నప్పుతాయి.
పిల్లలు చదువుకునే గదిలో టేబుల్ టాప్ లైటింగ్, షేకింగ్ లైటింగ్ టేబుల్ టాప్ రకాలలో లభ్యమయ్యే కృత్రిమ జలపాతాలు సరిపోతాయి. వీటిలో ప్రకృతిని ప్రతిబింబించేలా ఉండేవి కూగా లబిస్తాయి. చదువుమీద ధ్యాస పట్టేందుకు, పిల్లల మనస్సు నిర్మలంగా ఉండేందుకు ఇవి బాగా సహకరిస్తాయి.
ఇక అతిథులకు చల్లగా స్వాతగం పలికేందుకు గెస్ట్ రూమ్ లలో దృశ్య ప్రధాన కృత్రిమ జలపాతాలను పెడితే చాలా బాగుంటాయి. గదిలో ప్రశాంత వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఉండే కృత్రిమ జలపాతాలు అతిథులను చక్కగా ఆకట్టకుంటాయి.



Click it and Unblock the Notifications