Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
కార్పెట్ పై మరకలు పోవాలంటే......

బ్లడ్: రక్తం మరక పడితే ముందు చల్లని నీటితో కడగండి. తర్వాత ఆ నీటిని వైట్ పేపర్ టవల్ తో అద్దండి. చల్లని నీటిలో కొద్ది చుక్కలు డిష్ వాషింగ్ సొల్యూషన్ వేసి మరకను తుడవండి. ఈ చర్యను బ్లాటింగ్ పేపరు రక్తాన్ని పూర్తిగా తీసుకొనేటంత వరకు రిపీట్ చేయండి. ఫ్యాన్ గాలికి ఆరపెట్టండి.
కెచ్అప్ లేదా కూల్ డ్రింకులు పడితే: ఒక గ్లాసెడు నీటిలో ఇంటికివాడే అమ్మోనియా ఒక టేబుల్ స్పూన్ వేసి ఈ ద్రావణాన్ని ఒక స్ప్రే బాటిల్ లో పోసి స్ప్రే చేస్తూ పైన చెప్పిన విధంగా బ్లాటింగ్ పేపర్ తో అద్దండి. మరక పోయేటంత వరకు దీనిని రిపీట్ చేయండి. మరక పోయిన తర్వాత నీటితో కడిగి ఫ్యాన్ గాలికి ఆరపెట్టండి.
కాఫీ మరకలు: కాఫీ పడితే, అది కార్పెట్ పై పూర్తిగా ఇంకిపోకుండా ముందుగా ఒక గుడ్డతో తీయండి. సున్నితమైన డిటర్జంట్ ను వేడి నీటిలో కలిపి స్ప్రే, బ్లాటింగ్ పద్ధతులననుసరిస్తూ క్లీన్ చేయండి. తర్వాత ఆరు భాగాల నీటిలో 3 భాగాలు వినేగర్ కలపండి. దీనిని మరక భాగంలో రుద్దండి. బ్లాటింగ్ పేపర్ పై మరక వదిలేటంత వరకు పేపర్ తో అద్దండి. కార్పెట్ మరకలు ఇంటిలో తీసివేయటానికి ఇది సాధారణమైన పద్ధతి.
తుప్పు మరకలు: కార్పెట్ పై తుప్పు మరకలు పడితే వాటిని నిమ్మరసంతో శుభ్రం చేయాలి. బ్లాటింగ్ పేపర్ తో అద్దాలి. మరక పోయేటంతవరకు ఈ చర్య చేయాలి. తర్వాత ఆ భాగాన్ని శుభ్రమైన నీటితో క్లీన్ చేయండి. మరకలు గాఢంగా వుంటే ప్రొఫెషనల్ క్లీనర్ సహాయం తీసుకోండి.
రంగుల మరకలు: నీటిలో కొద్దిపాటి సబ్బు కలిపి దానిని మరకపై రుద్ది బ్లాటింగ్ పేపర్ తో అద్దండి. ఈ చర్యను బ్లాటింగ్ పేపర్ పై రంగు కనపడకుండా పోయేటంతవరకు రిపీట్ చేయండి. తర్వాత దానిపై 3 శాతం హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసి ఒక 15 నిమిషాలపాటు వదిలేయండి. హైడ్రోజన్ పెరాక్సైడ్ కార్పెట్ అడుగు వరకు ఇంకకుండా చూడండి.
కార్పెట్ క్లీనింగ్ లో ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది, ఏది పడినప్పటికి దానిని వీలైనంత త్వరగా తీసి మరక పచ్చిగా వున్నపుడే శుభ్రం చేయాలి. అది ఎండితే శుభ్రం చేయటం కష్టమవుతుంది. ఎప్పటికపుడు మీరు శుభ్రం చేసుకోవడమే కాక, అప్పుడపుడూ నిపుణులైన పనివారలతో కూడా శుభ్రం చేయిస్తే కార్పెట్లు ఇంటికి ఎంతో అందాన్ని తెచ్చిపెడతాయి.



Click it and Unblock the Notifications
