Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఇంటి లోనే ల్యాంప్ షేడ్లను శుభ్రపరచుకోడమెలా?

ముందుగా కొన్ని సేఫ్టీ టిప్స్ చూద్దాం..... లైటు స్విచ్ ఆఫ్ చేసిన వెంటనే ల్యాంప్ షేడ్ తీయకండి. అందులోని బల్బు ఇంకా వేడిగానే వుండి చేతిని చురుక్కు మనిపిస్తుంది. బల్బును తడిగుడ్డతో వెంటనే తుడవకండి. అది వేడిగా వుంటే బల్బు పగలటమే కాక, గాయాలయ్యే ప్రమాదం వుంది. ల్యాంప్ షేడ్ తీసే ముందు దానికి వున్న వైర్లు డిస్ కనెక్ట్ చేయండి. లేకుంటే షార్ట్ సర్క్యూట్ కూడా అయ్యే ప్రమాదముంది. ల్యాంప్ షేడ్ ను తడి చేతులతో పట్టుకోకండి. నీరు విద్యత్తును ప్రవహింపజేస్తుంది.
ఇక ల్యాంప్ షేడ్ ను ఎలా శుభ్రపరచాలి?
సాధారణంగా ల్యాంప్ షేడ్లు తేలికగా తీసి పెట్టేవిగా వుంటాయి. కనుక బల్బు పైనుండి తీసి గుడ్డతో లేదా తడి గుడ్డతో వాటిని బాగా శుభ్రం చేయండి. ల్యాంప్ షేడ్లు చాలా డెలికేట్ గా వుంటాయి. కనుక జాగ్రత్త వహించండి. లేదంటే పగిలిపోతాయి. ల్యాంప్ షేడ్ కున్న గుడ్డభాగం మొదటగా దుమ్ము దులపండి. తర్వాత మాత్రమే నీటిని ఉపయోగించండి.
మీరు ఎలా తుడుస్తారనేది మీ ల్యాంప్ షేడ్ టైపును బట్టి వుంటుంది. గుడ్డ ల్యాంప్ షేడ్ అయితే శుభ్రపరచటం తేలిక. గుడ్డలు వాష్ చేసినట్లే సోప్, నీరు ఉపయోగించి వాష్ చేయవచ్చు. అయితే గుడ్డలను రుద్దినట్లు రుద్దకండి.
నేడు ఆదునికంగా వచ్చే ల్యాంప్ షేడ్లు నీటితో వాష్ చేసేవిగా లేవు అటువంటపుడు వాటిని దుమ్ము దులపటం వరకే చేయాలి. అవసరమనుకుంటే కొన్ని భాగాలకు తడిగుడ్డనుపయోగించి శుభ్రం చేయవచ్చు. వీటిని సాధ్యమైనంత వరకు ఒకటి లేదా రెండు వారాల కొకసారి శుభ్రం చేసి బాగా కాంతి ప్రసరించేలా చూడాలి. వీటిని శుభ్ర పరచేటపుడు చిన్నపాటి టూత్ బ్రష్ లేదా బూట్లు తుడుచుకునే షూ బ్రష్ వంటివి ఉపయోగిస్తే శుభ్రం చేయటం తేలిక అవుతుంది. శుభ్రపరచే ఈ చిట్కాలను పాటించి మీ ఇంటి దీపాలకు అందాన్నిస్తున్న ల్యాంప్ షేడ్లను కళ కళలాడేలా చేయండి.



Click it and Unblock the Notifications