రంగు పడితే...వ్యయం ఎక్కువ!

By B N Sharma

Paint
బాడుగల ఇళ్ళా? ఎపుడు ఖాళీ చేస్తారో తెలియదా? ! మరి ఇంటిలో వుండే వారికి ఇల్లు ఆకర్షణీయంగా వుండాలి. ఇంటికి గోడలే మంచి ఆకర్షణనిస్తాయి. అయితే, ఎప్పటికపుడు వాటికి రంగులు వేయించాలంటే...వ్యయంతో కూడిన పని. ఈ పరిస్ధితులలో కూడా మీరు అద్దె ఇంటిని ఎలా తీర్చి దిద్దాలో చూడండి.

1. గోడలకు వైట్ వాష్ చేయించేయండి. నాలుగేళ్ళకు, లేదా అయిదేళ్ళకు అధిక ధరతో కూడిన పెయింట్లు వేయించే కంటే ఇవి ఎప్పటికపుడు వైట్ వాష్ చేస్తే శుభ్రంగాను, ఆకర్షణీయంగాను వుంటాయి.
2. నేటి రోజుల్లో ఆకర్షణీయమైన రంగు రంగుల స్టికర్లు వివిధ సైజులలో వస్తున్నాయి. ఇంటి గోడల సైజును బట్టి, గదులలోని ఫర్నిచర్ రంగులను బట్టి, వీటిని ఎపిక చేసి గోడలకు అంటించేయండి. ఖర్చు తక్కువ. ఎపుడు కావాలంటే అపుడు తొలగించవచ్చు.
3. చెక్క, కేన్, ఫ్యాబ్రిక్ మొదలైన వాటితో మడత వేయదగిన స్క్రీన్ లు పెడితే బాగుంటుంది. అవసరమైనపుడు వాడుతూ, అవసరం లేనపుడు మడచి పక్కన పెట్టుకోవచ్చు.
4. గోడలు వాల్ పేపర్ అలంకరణ చేస్తే కూడా బాగుంటాయి. వీటిని తొలగించటం కూడా తేలిక. వాల్ పేపర్లలో కూడా వివిధ రంగులు, డిజైన్లు వస్తున్నాయి. మీ అభిరుచికి తగ్గట్లు వాటిని నేరుగా గోడలపై అంటించి గోడలు ఆకర్షణీయం చేయవచ్చు.

ఈ రకమైన ప్రత్యామ్నాయ గోడల పెయింటింగ్ వ్యయం తక్కువే కాకుండా, సమయం కూడా వృధా కాకుండా వుంటుంది.

Story first published: Monday, November 21, 2011, 16:14 [IST]
Desktop Bottom Promotion