Latest Updates
-
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.!
దసరా పండుగకు ఇంటి అలంకరణలో కర్టెన్లు!

సాంప్రదాయ కర్టెన్లకుగాను కొన్ని సూచనలు చూడండి -
మొదటగా, ఇప్పటివరకు వాడుతున్న లైట్ కలర్ కర్టెన్లు నుండి డార్క్ కలర్ కర్టెన్లకు మారండి. పండుగ సమయాలలో దట్టమైన రంగులు వేస్తే పండుగ వాతావరణం వచ్చినట్లు అనిపిస్తుంది. నవరాత్రి పూజలకు మీ రు వేసే దుస్తులు కూడా రంగురంగులుగా వుంటే బాగుంటుంది. ఇంటి అలంకరణకు బ్యాలన్స్ అయినట్లుగా కూడా వుంటుంది. దుకాణాలలో దొరికే కర్టెన్లు మీకు నచ్చలేదా? పరవాలేదు. ఖర్చులేని మరో ఐడియాగా దీనిని ఆలోచించండి. ఇంట్లోని మీ దుస్తులలో మరీ పాతపడని, మీరు ప్రస్తుతానికి వాడని చీరలు, ఓణీలు, దుప్పటాలు మొదలైన వాటిని ఎంపిక చేయండి. వాటిని కర్టెన్సుగా కుట్టి అలంకరించండి. ఇవి కూడా ఒకే రంగులో వుండాలని లేదు. రంగులు ఎంత ఎక్కువైతే అంత కర్టెన్ల అలంకరణ బాగుంటుంది. ఆయా రంగులను మీ అభిరుచికి తగినట్లుగా కూడా మీరు అమర్చుకోవచ్చు. లివింగ్ రూమ్ కర్టెన్లకు ఎరుపు రంగా వాడారా. అయితే, రంగు అదే అయినా వివిధ డిజైన్లలో ఇతర రూములకు కూడా అంకరించండి. హవేలిలుగా చెప్పే, పురాతన బంగళాలకు వేసిన కర్టెన్లు పరిశీలిస్తే, అవన్ని కల్తీలేని అచ్చమైన బెనారస్ చీరలని చెపుతారు.
సాధారణంగా ఇంట్లో ని మహిళలకు చీరల పెట్టెలు అధిక సంఖ్యలోనే వుంటాయి. ఇవన్నీ త్వరలో పెట్టెల్లోనే చిరిగిపోతుంటాయి. ధరించటానికి పాతవనిపిస్తూంటాయి. కనుక వీటిని గది కర్టెన్లుగా వాడుకోవటం మంచి ఐడియాగానే చెప్పవచ్చు. కొత్తగా ఇంటిని అలంకరించుకుంటున్నారా? పాత చీరలవంటివి లేవా? అయితే, కొద్దిపాటి చవక ధరలలో లభించే సిల్కు గుడ్డలు కర్టెన్లుగా కూడా నవరాత్రి ఇంటి అలంకరణకు వాడవచ్చు.



Click it and Unblock the Notifications
