Latest Updates
-
‘నాకే కనక కొడుకు పుడితే’.. హద్దు మీరుతున్న హాస్యం.. స్టాండప్ కమెడియన్ ఓల్డ్ వీడియోపై రచ్చ.! -
డేటింగ్లో పార్ట్నర్ గురించి ఎలా తెలుసుకోవాలి.. ఇంతవరకూ ఎవరూ చెప్పని సీక్రెట్స్.! -
యువకులను ఆకర్షిస్తున్న ‘లుక్స్మాక్సింగ్’ ట్రెండ్.. గాడి తప్పితే బాడీ షెడ్డుకే.! -
వారానికోసారైనా మునగాకు రసం తింటే.. మందుల ముచ్చటే ఉండదు.! -
ఉదయాన్నే కాఫీ, టీ తాగితే కానీ బాత్రూమ్కి వెళ్లలేకపోతున్నారా.. ఇక మీ బాడీ రిస్క్‌లో పడినట్లే.! -
జూన్ 16, 2026: ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తోంది.. ఆర్థికంగా ఊహించని లాభాలు మీ సొంతం! -
సంతానలేమి సమస్యలకు పరిష్కారం.. భార్యాభర్తలు తప్పక చేయాల్సిన యోగాసనాలివే.! -
గురు పుష్య అమృత యోగం: ఈ రోజు బంగారం కొంటే మీ జాతకం మారుతుందా? -
చెఫ్ రణ్వీర్ స్పెషల్ ధన్ సాక్ మసాలా.. మీ వంటల రుచిని రెట్టింపు, ఆరోగ్యానికి మేలు! -
ఎముకలను ఉక్కుగా మార్చే రాగులతో రవ్వ దోశ.. ఈ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌లో వీటిని కలిపితే తిరుగే ఉండదు.!
సురక్షితమైన ఇంటి మెట్ల నిర్మాణం...!

ఇంటీరియర్ లో ప్రతీదీ ముఖ్యమే. దేన్ని తక్కువ చేయకూడదు. ఇంటి కళాకృతుల్లో మెట్లు కూడా ఓ భాగం. ఇంటి బయట మెట్లు ఉంటే పట్టించుకోనవసరం లేదు. కానీ అదే డూప్లెక్స్ ప్లాన్ చేస్తే మాత్రం తప్పకుండా కాస్త వెరైటీగా ప్లాన్ చేయాలి. ఒక వేళ ఇంట్లో కనుక హైపరాక్టివ్ పిల్లలు, లేదా వృద్దులు ఉన్నట్లైతే అప్పుడు ఇంట్లో కట్టించుకునే మెట్ల గురించి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చిన్ని పాటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మెట్ల ద్వారా విషాద ప్రమాదాలను అరకట్ట వచ్చు.
1. మొట్ల నిర్మాణం: స్వంతగా ఇల్లు కట్టుకొనే వారు, మీ ఆర్కిటెక్ సలహా మేరకు చిన్న మెట్లను నిర్మించుకోవాడానికి సలహాతీసుకోవచ్చు. అప్పుడు ఇట్లో వారు ఎక్కడానికి సులభ తరం అవుతుంది. ముఖ్యంగా మెట్లు కనుక పరిశుభ్రంగా ఉన్నట్లైతే ఎవరైనా సరే సులభంగా ఎక్కేయెచ్చు. ఒక వేళ అనుకోకుండా ఒక స్టెప్ మిస్ అయినా పెద్ద ప్రమాదం జరగకుండా వెంటనే నెక్ట్స్ స్టెమీద కాలు పెట్టేయొచ్చు. లెగ్త్ వైస్ చిన్న మెట్లు ఉన్నప్పుడే ఇది సాధ్యం అవుతుంది. ప్రమాదం జరగకుండా బ్యాన్డ్స్ గా మరో స్టెప్ మీద కాలు పెట్టే విధంగా నిర్మించుకోవచ్చు.
2. మెట్ల అమరిక ఎలా ఉండాలి: మీరు సొంతంగా నిర్మించుకునే ఇంటికి మెట్ల అమరిక ఎలా ఉండాలంటే ప్రతి మెట్టు సమాన దూరంలో ఉండాలి. అంటే మెట్టు మెట్టుకీ ఒకే అంతరం కలిగి ఉండాలని అర్థం. ఒక అడుగు చిన్నగా మరియొక్క అడుగు పెద్దగా వుంటే స్టెప్స్ ఎక్కేటప్పుడు వాటి మధ్య వ్యత్యాసం తెలుసుకొనుట చాలా సులభం. కాబట్టి భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా నివారించాలంటే కరెక్ట్ కొలతలతోనే మెట్ల నిర్మాణం జరగాలి.
3. మెట్ల మీద కార్పెట్: చాలా మంది ఇంటి అందం కోసం..మెట్ల అందం కోసం కార్పెట్లను అమర్చుతుంటారు. అయితే మెట్ల భద్రతకోసం కూడా కార్పెట్లను వినియోగించుకోవచ్చు. మెట్ల మీద కార్పెట్ అమర్చేటప్పుడు అది గరుకుగా మొద్దుబారినదిగా ఉండాలి. అప్పుడే ఆ కార్పెట్ జారకుండా ఉంటుంది. ఒకే వేళ అనుకోకుండా జారిపడ్డా పెద్ద ప్రమాదం లేకుండా కార్పెట్ రక్షణ కవచంగా ఉపయోగపడుతుంది. అయితే కార్పెట్ అమరికలో జాగ్రత్త వహించాలి. కార్పెట్ మెట్లకు కరెక్ట్ గా ఫిక్స్ అయ్యే విధంగా చూసుకోవాలి. అలాకాకుండా జారే విధంగా సెట్ చేసినట్లైతే పెద్ద విపత్తే సంభవించవచ్చు.
4. మెట్ల ఫ్లోరింగ్: సున్నితమైనటువంటి ప్లోరింగ్ వేసుకోవడం వల్ల భద్రతా సమస్యలకు దారితీస్తుంది. మెట్ల నిర్మాణంలో మరింత జాగ్రత వహించాలి. ముఖ్యంగా మెట్లకు ఏవిధమైనటువంటి టైల్స్ వేయకపోవడమే నూటికి నూరుశాతం మంచిది. మెట్ల నిర్మాణానికి వుడ్ చాలా సేఫ్. ఇది మంచి పట్టును కలిగి ఉంటుంది. కాబట్టి ఉడ్ తో తయారు చేసిన మెట్లకే ప్రాధాన్యత ఇవ్వండి.
5. మెట్లకు ఇరుప్రక్కల రైలింగ్ ను ధృఢనిర్మాణంగల ఇనుప కంచె నిర్మించడం చాలా మంచిది. ఇది సపోర్ట్ కు బాగా ఉపయోగపడుతుంది. ఐరన్ తో చేసినటువంటి, ధృఢమైన రైలింగ్ ను అమర్చడం వల్ల మంచి గ్రిఫ్ ఉంటుంది. ప్రాణాపాయా ప్రమాదాలు నిరోధించవచ్చు. కాబట్టి ఈ చిన్న చిట్కాలను గుర్తుంచుకొని మెట్ల నిర్మాణంలో మెలకువలు పాటించినట్లైతే ఇంటిల్లి పాది సురక్షితంగా ఉండవచ్చు.



Click it and Unblock the Notifications