Latest Updates
-
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.!
ఖాళీ సీసాలు..జార్లతో మీ సృజనాత్మకత వెల్లడి...!

సుగంద ధ్రవ్యాలను నింపుకొనుటకు: మన ఇల్లలో తరచుగా జామ్ బాటిల్స్ తెచ్చుకొని ఖాలీ అవ్వగాని పక్కన పడేస్తుంటాం. అలా కాకుండా ఖాళీ అవ్వగానే వాటిని బాగా శుభ్రం చేసి అందులో సుగంధ ద్రవ్యాలు, మూలికలు నింపుకొని వంటింట్లో వినియోగించుకోవచ్చు. అలాగే పెద్ద పెద్ద బాటిల్స్ లో ను ఊరగాయలు, పచ్చల్లు నిలువ చేసుకోవచ్చు.
కొన్న కంటైనర్స్(డబ్బాలు)మొక్కలు కోసం: ఇల్లు ఆకుపచ్చదనం వుంటే ఆ ఇంట్లో ఆహ్లాదంగా కనిపిస్తుంటుంది. నిరుపయోగంగా పక్కన పడేసిన పెద్ద పెద్ద కంటైనర్స్ లో చిన్న చిన్న మొక్కలను పెంచుకోవచ్చు. అలాగే ఖాళీ అయిన సీసాల్లో కూడా హెయిర్ ప్లాంట్స్ వంటివి పెంటుకొని బాల్కానీ, ఇంటిలోపల షోకేష్ గా అలంకరించుకోవచ్చు.
సీసాలో గులకరాళ్ళు: ఇంటి అలంకరణలో గులకరాళ్ళు సీసాలో వేసి అక్కడక్కడా పెట్టుకొన్నట్లైతే చూడటానికి అందంగా కనిపిస్తాయి. ఇంకా వాటి పెయింటింగ్స్ వేసి అలంకరించుకొంటి మరింత అందం చేకూరుతుంది. మీరు కూడా మీ సృజనాత్మకతతో ఒక ఖాళీ కూజా సీసాలు, గాజు సీసాల్లో వివిధ ఆకారాలు, రంగులు కల గులకరాళ్ళు వేసి ఇంట్లో అమర్చుకొన్నట్లైతే ఇంటి వచ్చిన అతిథులకు మీ అభిరుచి తెల్పుతుంది.
ఫిష్ టాంక్: కొంత మందికి ఫిష్ టాంక్ ఇంట్లో పెంటుకోవాలంటే చాలా ఇష్టం. అయితే వారికి స్థలం సరిపోకనో, మెయింటైన్ చేయ్యలేకనో నిరాశచెందుతుంటారు. అలాంటి వారు పెద్ద పెద్ద అక్వేరియం పెట్టుకోలేకపోయినా, ఒక చిన్న ఖాళీ గాజు సీసాలో ఒక చేప పిల్లను వదిలి. దానికి తగినటు వంటి ఆహారం వేస్తుండండి మీరు, మీ ఇంట్లో అక్వేరియం ఉన్నంత అనుభూతిని పొందుతారు.
పెన్ హోల్డర్: ఇంట్లో గనుక చదువుకొనే పిల్లలుంటే వారికి అందుబాటులో పెన్నులు, పెన్సి లు లాంటివి అమర్చడానికి ఒక ఖాళీ కూజా సీసాలు ఉపయోగపడుతాయి. ఖాళీ కూజా సీసాలకు రంగు రంగుల స్టిక్కర్లు చుట్టూ అతికించి అందులో మీకు ఇష్టమైన పెన్నులను భద్రపరుచుకోవచ్చు.
కాయిన్స్: ఒక ఖాళీ కూజాలో కాయిన్స్ వేసుకొని నింపుకొన్నట్లైతే స్వేవ్ చేసినట్లు అవుతుంది. అలంకరణగాను ఉపయోగపడుతుంది. ఖాళీ కూజాలో గోల్డ్ కలర్ లో ఉన్న ఫైరూపీ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్...స్టోర్ చేసుకొంటే అందంగా కనబడుతుంది. ఇది పిల్లలకు కూడా అలవాటు చేస్తే చాలా ఇష్టంగా మొదలు పెడతారు.
ఇలా ఖాళీ అయిన బాటిల్స్, జార్లు రకరకాలుగా ఉపయోగపడుతాయి. అయితే బాటిల్స్, ప్లాస్టిక్స్ వస్తువులు ఎప్పుడూ శుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలి. అప్పుడప్పుడు బాటిల్స్ ను వేడి నీళ్ళు, సోప్ తో శుభ్రం చేసుకుంటే ఎప్పుడు కొత్త వాటిలా కనిపిస్తుంటాయి. కాబట్టి మీరు కూడా ఇలా చేసి మీలో దాగున్న సృజనాత్మకతను వెలికితీయండి, అందరి ప్రసంశలు పొందండి.....



Click it and Unblock the Notifications
