Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
వేసవిలో గ్యాస్ సిలిండర్ తో జాగ్రత్త...

1. గ్యాస్ స్టౌను, సిలిండర్ ను సొంతంగా మరమ్మతు, మార్పిడి చేయకూడదు. మంచి మెకానిక్ చేత ప్రతి రెండేళ్లకోసారి గ్యాస్ స్టౌను, సిలిండర్ ను పరీక్షించుకోవాలి.
2. సిలిండర్ ను తీసుకునే సమయంలో డెలివరి మనిషి చేత సిలిండర్ ను పరీక్ష చేయించాలి.
3. గ్యాస్ స్టౌవ్ ను నేలమీద పెట్టవద్దు. ఏస్ బెస్టాస్ షీట్ లేకుండా చెక్క టేబుల్ మీద పెట్టవద్దు. సరైన గాలి ప్రసరణ లేని గదిలో గ్యాస్ ను వాడకూడదు
4. సిలిండర్ ను భవనంలోని బేస్ మెంట్ మీద, అంతస్తు కిందిస్థాయిలో ఎప్పుడు పెట్టవద్దు. గ్యాస్ స్టౌవ్ కు దగ్గరలో ఎలక్ట్రిక్, ఓపెన్ కిరోసిన్ స్టౌలాంటివి, అగరబత్తీలు పెట్టకూడదు.
5. గ్యాస్ పై వంట చేస్తున్నప్పుడు నైలాన్ బట్టలు ధరించకూడదు. కాటన్ వస్త్రాలు ధరించడం శ్రేయస్కరం. వంట పూర్తయ్యేదాకా వంటింట్లోనే ఉండాలి.
6. స్టౌ ను వెలిగించడానికి ముందు గ్యాస్ దుర్వాసన వస్తుందేమో ఒక్కసారి చెక్ చేసిన తర్వాత వెలిగించాలి.
7. పాతబడిన లేక విరగిపోయిన గ్యాస్ పైప్ లను(రబ్బర్ ట్యూబ్ లను) వాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రెండు సంవత్సరాలకు మించి రబ్బర్ ట్యూబ్ ను వాడకూడదు
8. వంట చేయడం పూర్తయ్యాక, రాత్రి సమయంలో గ్యాస్ రెగ్యులేటర్ నాబ్ ను ఆఫ్ చేయడం మర్చిపోవద్దు.
9. సిలిండర్ ఎప్పుడు నిలువుగా ఉంచాలి. స్టౌ ను ఎల్లప్పుడు సిలిండర్ కంటే ఎత్తులో ఉంచాలి.
10. సిలిండర్ ను కప్ బోర్డ్స్, లేదా అలమరాల్లో ఉంచినట్లయితే తగినంత గాలి ప్రసరణ ఉండేలాగా చూసుకోవాలి.



Click it and Unblock the Notifications
