Latest Updates
-
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్ -
మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం గుమ్మడికాయ దప్పళం.. వారానికోసారి తింటే సర్వరోగాలు మాయం.! -
కేవలం 10 నిమిషాల్లో స్వర్గాన్ని చూపించే వెల్లుల్లి కారం ఆమ్లెట్..ఎలా చేసుకోవాలంటే..
పండుగ అలంకరణ ఎలా ఉన్న ఏకాగ్రత ప్రధానం...

పెద్ద స్థలం ఉన్నవారైతే ఇంటి మధ్యలో పూజ గదిని ఏర్పాటు చేసుకోవచ్చు. ఎందుకంటే పెద్ద ఇల్లు ఉన్నప్పుడు ఆ ఇంటి మధ్య భాగాన్ని గాలి, వెలుతురు సవ్యంగా పారేందుకు ఖా ళీగా ఉంచాలి. ఆ మధ్య ప్రదేశంలో పూజ గది ఏర్పాటు చేసుకోవచ్చు.
దేవుడి గది నేలకు ఆనేలా కాకుండా మనము దేవుడికి మొక్కేటప్పుడు ఉండే భంగిమలో మన ముకుళిత చేతులకు ఎదురుగా ఉండేలా ఏర్పాటు చేసుకోవడం సరియైన పద్దతి. రెండు దీపాలలో రెండేసి వత్తులను వేసి వెలిగించడం ఉత్తమం. ఒక వత్తి మంచిది కాదు. దీపాలకు నువ్వుల నూనె గాని కుసుమ నూనె కానీ వాడటం శ్రేయష్కరం
ఎన్ని అగరుబత్తులను వెలిగించారన్నది ముఖ్యం కాదు! నిక్కమైన నీలము ఒక్కటున్న చాలు.. అన్నట్లు ఒకటి వెలిగించినా కాస్త సువాసనాభరితముగా ఉంటే చాలు! ఈ అగరువత్తీ నుండి వచ్చే పరిమళాలు మన చుట్టూ ఉన్న ప్రదేశాన్ని శుద్ధిచేస్తుంది. ఎంత ఖర్చు పెట్టి పూలు పెట్టారు, ఇంతలావు పూలదండ వేసారు అన్నది ముఖ్యం కాదు. ఎంత ఆడంబరముగా పూజ చేసారు - అన్నది పాయింటు కాదు. ఎంత భక్తితో చేసాము అన్నది ముఖ్యం.
దేవుడి విగ్రహాలు సాధారణముగా కాగితము, రాయి, లోహము, ప్లాస్టిక్, సిమెంట్, గాజు వంటి వివిధరకాల పదార్థాలతో తయారుచేసినవి ఉంటాయిగా! వీటిలో మంచియైనవి అంటే రాయితోగాని, లోహముతో చేసినవి. రాయితో తయారయిన చిన్న చిన్న సైజులోని విగ్రహాలు దొరకడం కష్టం! ఇక లోహం విషయంకి వస్తే ఉత్తమమైనది బంగారం. సాధకులు ఎవరికి తోచినట్లుగా, వారి వారి శక్తి మేరకు విగ్రహాలు చేసుకొని వాడగలరు. మిగితా లోహాలు, పదార్థాలతో చేసిన విగ్రహాలు వాడకపోవడమే ఉత్తమం!



Click it and Unblock the Notifications
