Latest Updates
-
Father's Day 2026: చాలా మంది తండ్రులు 60 ఏళ్లు దాటాక పశ్చాత్తాపపడే ఒక్క విషయం అదే! -
జుట్టు చివర్లు దారుణంగా చిట్లిపోతున్నాయా.. మీరు చేస్తున్న తప్పులివే.! -
Success Story : ఇదిరా సక్సెస్ అంటే..పేదరికరంలో పుట్టాడు, ఆటో డ్రైవర్ నుంచి ఎయిర్ లైన్ ఓనర్ అయ్యాడు.. -
పెళ్లయింది తర్వాతేంటి.. అమ్మాయిలు గూగుల్ని అడుగుతున్న సలహాలు ఇవేనట.! -
పోషకాల పవర్ హౌస్..ఇంట్లోనే రాగి మాల్ట్ పౌడర్ ఎలా చేసుకోవాలంటే.. -
ఆర్థరైటిస్ పేషెంట్లకు అలర్ట్.. ఏసీలో ఎక్కువసేపు ఉంటున్నారా.? -
నేటి రాత్రి ఆకాశంలో అద్భుతం.. శుక్రుడి సంచారంతో ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తట్టబోతోంది! -
జూన్ 19 నుంచి ధన రాజయోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
పొగాకు నమిలితే క్యాన్సర్, గుండెపోటు మాత్రమే కాదు.. మరో ప్రమాదం ఉందని తెలుసా.? -
ఎక్కువ కాలం బతకాలా? ఈ వ్యాయామాలు చేస్తే మరణ ప్రమాదం తగ్గుతుంది..
కూరగాయలలో పోషకవిలువలు పోకుండా ఉండాలంటే...?
Improvement
oi-Saraswathi
By Sindhu

2. గులాబ్ జామ్ తయారు చేసే సమయంలో ఆ పిండిలో కాస్త పన్నీరు కలిపారంటే..గులాబ్ జామ్ లు మృ దువుగా దూది ఉండల్లా మెత్తగా ఉంటాయి.
3. చపాతీలు ఎక్కువ కాలం మృ దువుగా ఉండాలంటే అవి ఉంచిన కంటైనర్ లో ఓ అల్లం ముక్క ఉంచండి చాలు
4. వంట చేసే సమయంలో వంట పాత్రలు తగిలి చేయికాలితే వెంటనే కాలిన చోట చల్లని నీరుపోయండి. ఆ తర్వాత సబ్బుతో ఆ ప్రాంతం రబ్ చేయండి. ఇలా చేస్తే కాలిన చోట బొబ్బలు రావు.
5. వెల్లుల్లి వలిచినప్పుడు..చేతులకు అంటుకున్న వెల్లుల్లి వాసన పోవాలంటే..కాస్త ఉప్పు చేతిలో వేసుకుని ఉప్పుతో చేతులు కడిగేసుకుని తర్వాత సోప్ తో కడుక్కోండి.
6. చాలమంది గృహినులకు కాయగూరల్ని తరిగాక కడిగే అలవాటు ఉంటుంది. ఇది మంచి పద్దతి కాదు. ఇలా చేస్తే, ఆకు కూరలు, కూరగాయల్లో పోషక విలువలు తగ్గిపోతాయి. కాయగూరలను ముందుగానే బాగా కడిగి తర్వాత కట్ చేసుకోవాలి.
7. ఆకు కూరలను కొంచెం పంచదార కల్పిన నీటిలో నాననిచ్చి ఆ తర్వాత వండితే చాలా రుచిగా ఉంటాయి.
8. చేతులకు నూనె రాసుకుని కూరలు తరిగితే...జిగట అంటుకోదు.
9. బంగాళా దుంపలు మెత్తబడ్డాయా? వాటిని తరగటానికి ముందు ఓ అరగంటసేపు చల్లని నీటిలో ఉంచండి చాలు. అవి గట్టి పడుతాయి.
10. కోడిగుడ్డును పగలకొట్టి అల్యూమినియం, సిల్వర్ పాత్రలలో సొనవేయకూడదు. గుడ్డులో ఉండే సల్ఫర్ కారణంగా ఆ పాత్రలు లోపల నల్లని మచ్చలు ఏర్పడతాయి. అలాగే బాయిల్డ్ ఎగ్ ను కోసే ముందు..కత్తని నీటిలో ముంచి కోస్తే చక్కగా కట్ అవుతుంది.
Comments
English summary
Why should you not wash Vegetables after Cutting...? | కూరగాయలలో పోషకవిలువలు పోకుండా ఉండాలంటే...?
Story first published: Saturday, February 4, 2012, 15:48 [IST]
Other articles published on Feb 4, 2012



Click it and Unblock the Notifications