Latest Updates
-
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.!
వంటగదిలోని కత్తిని శుభ్రపరిచే సులభ చిట్కాలు
సాధారణంగా ప్రతి ఇంట్లోను కత్తివాడని వారుండరంటే అతిశయోత్తి కాదేమో. కత్తి, కూరగాయలను తరగడానికి మాత్రమే కాదు, వివిధరకాలుగా కూడా ఉపయోగిస్తుంటారు. బాటిల్ ఓపెనర్ గా, స్క్రూడ్రైవర్ గా, పెన్సిల్ చెక్కడానికి,ప్యాకెట్స్ ఓపెన్ చేయడానికి, టేప్ కట్టింగా మొదలగునవి. ఇలా ఒక్కవిధంగా కాదు అనేక రకాలుగా ఉపయోగించే చాకు అతి త్వరగా బ్యాక్టీరి చేరుతుంది. ఇంకా తుప్పు పడుతుంటుండి. పాతబడిన కత్తులు తుప్పు పట్టడాన్ని సాధారణంగా గమనిస్తుంటాం.
కొద్ది రోజులుగా వాడకుండా కత్తులను అలాగే వదిలేయడం వల్ల తుప్పు పడుతుంటాయి. కాబట్టి, కత్తులను తరచూ శుభ్రం చేయడం చాలా ముఖ్యం. ముఖ్యంగా కత్తి షార్ప్ గా ఉండేలా చూసుకోవాలి. మెద్దుబారిన కత్తులను ఉపయోగించకూడదు. చాకును ఉపయోగించిన ప్రతి సారి, వాటి శుభ్రం చేయాలి, కానీ వాడిన కత్తులను అలాగే పెట్టేయడం వల్ల వాటి మీద, కార్నర్స్ లో బ్యాక్టీరియ మరియు జర్మ్ చేరుతాయని చాలా మందికి తెలిసుండకపోవచ్చు . కాబట్టి, కత్తిని ఉపయోగించిన తర్వాత వాటిని శుభ్రం చేయడం, బ్యాక్టీరియా లేకుండా చేయడం ఆరోగ్యకరమైన వంటగది వాతావరణం కల్పించడం ముఖ్యం. కత్తిని శుభ్రం పరచడానికి సులభ చిట్కాలు...

సోప్: కత్తిను వాడిన తర్వాత డిష్ వాష్ సోప్ ను కత్తిమీద రుద్ది, వేడినీళ్ళతో కడిగి శుభ్రం చేయాలి. వేడినీళ్ళు బాగా పనిచేస్తాయి. వీటి వల్ల క్రిములు చాలా త్వరగా నశిస్తాయి . మరియు కత్తి మీద మరకలను నివారిస్తుంది . చల్లటి నీళ్ళు వల్ల మంచి ఫలితం ఉండదు.
2. లెమన్: బాగా మురికి పట్టిన కత్తిని నిమ్మరసంతో శుభ్రం చేయాలి. నిమ్మ ఒక సిట్రస్ పండు, ఒక ఉత్తమ క్లీనింగ్ ఏజెంట్, మరియు స్ట్రాంగ్ ఆరోమా వాసన కలిగి ఉంటుంది. కత్తి కార్నర్స్ లో మురికిని తొలగించడాని బాగా సహాయపడుతుంది. అయితే నిమ్మతో ఎక్కువ సేపు కత్తిని రుద్దకండి. తర్వాత చల్లటి నీటితో కడగండి. మీరు కూడా కొన్ని చుక్కల నిమ్మరసంను నీటిలో వేసి మరిగించి తర్వాత శుభ్రం చేయాలి.
3. వెనిగర్: వంటగది వస్తువైన కత్తిని శుభ్రం చేయడానికి ఇదొక ఉత్తమ చిట్కా. వేడి నీళ్ళలో కొన్ని చుక్కల వెనిగర్ వేసి, కొద్ది సేపు నానబెట్టాలి. తర్వాత పాత టూత్ బ్రెష్ తో బాగా రుద్ది, తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.
4. ఉడికించాలి: ప్లాస్టిక్ హ్యాండిల్ లేకుండా ఉంటే, వేడినీళ్ళలో వేసి, ఒక నిముషం ఉడికించాలి. వేడినీళ్ళు బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది మరియు మరకలను వదలగొడుతుంది . వేడినీళ్ళతో రుద్ది కడగడం వల్ల కత్తికి ఉన్న ఆయిల్ , జిడ్డు మరకలు తొలగిపోతాయి.



Click it and Unblock the Notifications
