Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
ఖర్చులేకుండా మీఇంటిని సువాసనలతో నింపండి..
ఇంటి విషయంలో ఎంత అందంగా పెట్టుకొంటే అన్ని ప్రశంసలు పొందుతారు. మన ఇంట్లో ఎంత కొత్తగా చేసినా, ఎంత అందంగా అలంకరించినా పక్కఇంట్లోనో..లేదా ఎదురింట్లోనో, లేదా బందువుల ఇల్లలోనూ ఏదైన కొత్తదనాన్ని చూస్తే అలా మన ఇల్లు కూడా ఉంటే బాగుండనిపిస్తుంది. అయితే, కొంత మంది అన్ని కోరుకుంటారు, కానీ డబ్బు మాత్రం ఖర్చుచేయలేరు. ఇంటిని ఎంత అందంగా అలంకరించినా, ఎన్ని డెకరేషన్ వస్తువులు తీసుకొచ్చిన ఇంట్లో సుచి, శుభ్రత చాలా ముఖ్యం.
ఇంట్లో అన్ని వస్తువుల ఉన్నా, చూడటానికి శుభ్రంగా కనబడ్డా, కొందరి ఇల్లలో దుర్గంద వాసన వస్తుంటుంది. ఇంటి అలంకరణతో పాటు, ఇంట్లో మంచి సువాసన వెలువడితే ఆ ఇంటికి మరింత ఆకర్షణ కలుగుతుంది. గార్డెన్లో మొక్కలన్నీంటిని చక్కగా ఒక ప్రక్కు అమర్చిఉంటాము. దానికితోడు గార్డెన్ లోని సెంట్ జాజులు, గుండు మల్లె, లేదా గులాబీలు గుభాళిస్తుంటే ఆ గార్డెన్ కు ఎంత ఆకర్షణ. మరికొంత సేపు అక్కడే కూర్చొని సేదతీరాలనిపిస్తుంది. అదే విధంగా ఇల్లు కూడా, ఎకోఫ్రెండ్లీ హోంలో మీరు ఎక్కువ సమయం గడపాలనుకొనే వారికి ఈ కథనం బాగా సహాయపడుతుంది. ఎకో ఫ్రెండ్లీ హోంకు స్పెషల్ గా సువాసనలు వస్తుంటాయి. కానీ అవి ఎక్కువ సమయం ఉండకపోవుచ్చు. కాబట్టి మీరు ఈ క్రింది పద్దతులను ఉపయోగించి మీ ఇంటిని సువాసనభరితం చేసుకోవచ్చు.
ఇంట్లో మంచి సువాసన ఉండాలంటే కొన్ని నేచురల్ పద్దతులు ఉపయోగించాలి. అయితే ఈ పద్దతుల్లో ఉపయోగించే వస్తువులు కొంచెం ఖర్చుతో కూడుకొన్నవి. అయితే, ఇవి ఖర్చుకు తగ్గవిధంగానే ఫలితాలను కూడా అంధిస్తాయి. కానీ అన్ని వేళలు మీరు డబ్బు ఖర్చు చేయాల్సిన పనిలేదు. కొన్ని నేచురల్ పద్దతులను కూడా ఉపయోగించి మీ ఇంటిని సువాసనభరితంగా ఉంచుకోవచ్చు.

వెనిగర్:
ఆపిల్ సైడర్ వెనిగర్-నీళ్ళు సరిసమానంగా తీసుకొని, బాగా మిక్స్ చేసి, ఇంట్లో డైరెక్ట్ గా స్ప్రే చేయాలి. లేదా ఫ్యాన్ మీద లేదా ఏయిర్ కండీషనర్ మీద కూడా స్ప్రే చేయవచ్చు. ఇది మీకు తాజా సువాసనను అందంగా అంధిస్తుంది.

నిమ్మకాయలు:
నిమ్మ మంచి సువాసనను అంధించడమే కాకుండా, ఒత్తిడిని నుండి మీకు ఉపశమనం కలిగిస్తుంది. నిమ్మకాయను రెండు సమభాగాలుగా కట్ చేసి ఇంట్లో డోర్ వద్ద అర గంట నుండి ఒక గంట వరకూ పెట్టండి. అంతే మీ ఇంటి నిండా నిమ్మరసం వాసనతో గుభాళిస్తుంటుంది.

పైనాపిల్:
మీకు పైనాపిల్ వాసన అంటే ఇష్టమైతే, మీ ఇంటి సువాసనకు పైనాపిల్ కూడా ఉపయోగించవచ్చు. ఒక కప్పు పైనాపిల్ గుజ్జుకు కొద్దిగా టీట్రీ ఆయిల్ మిక్స్ం చేసి , కిటికీలు, తలపుల చివర్లలో ఈ మిశ్రమాన్ని రుద్ది చూడండి. ఇంట్లోకి గాలి వీచినప్పుడల్లా ఇల్లంతా పైనాపిల్ వాసనతో ఘుమఘుమలాడిపోతుంది.

రెడ్ ఆనియన్:
ఎర్ర ఉల్లిపాయలు: ఎర్రని ఉల్లిపాయలు ఇంట్లోని చెడు వాసనను దూరం చేస్తుంది. మీ వంట గదిలో ఎర్రని ఉల్లిపాయలను వలిచి పెట్టండి, చెడు వాసన దూరం అవుతుంది.

చెక్క:
దాల్చిన చెక్క వల్ల మీ ఇంట్లో ఒక అందమైన సహజమైన ప్రక్రుతి సిద్దమైన వాసన వెదజల్లుతుంది. మరి ఈ వాసన మీ ఇంట్లో నిండిపోవాలంటే, దాల్చిన చెక్క పొడి కానీ, లేదా దాల్చిన చెక్కను కానీ ఇంట్లో విండో దగ్గర లేదా డోర్ దగ్గర పెట్టాలి.

మూలికలు:
కొన్ని ప్రత్యేకమైన మూలికలను ఇండోర్ మొక్కలుగా పెంచుకోవచ్చు. తులసి, మరువం, పుదీనా, కొత్తిమీర, వంటి మొక్కలను ఇండోర్లో పెంచుకోవడం వల్ల మంచి సువాసన అందిస్తుంది.

తాజా పువ్వులు:
ఇంట్లో ప్రతి గదిలో ఫ్లవర్ వాజులు వాటిలో తాజా పువ్వులు ఉంచడం వల్ల ఇళ్ళంతా గుభాళిస్తుంటుంది. ప్రత్యేకంగా మల్లెపువ్వులు, గులాభీలు వంటి వాటిని ఎంపిక చేసుకోవాలి.

బేకింగ్ సోడా:
బేకింగ్ సోడా వాసన బాగానే ఉంటుంది. కానీ ఈ వాసన చాలా కొద్ది మందికి మాత్రమే నచ్చుతుంది. కాబట్టి నచ్చిన వారు బేకింగ్ సోడాను విండో గ్రిల్స్, డోర్ గ్రిల్స్ కు రాసి పెట్టడం వల్ల గాలి వీచినప్పుడు మంచి వాసన వస్తుంది.

లెమన్ గ్రాస్:
మట్టి కుంపటిలో లెమన్ గ్రాస్ ను నాటి పెట్టుకోవచ్చు. దీన్ని డోర్ ముఖద్వారం వద్ద వుంచడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దాంతో ఇంట్లో ఒక మంచి సువాసన నేచురల్ గా ఉంటుంది.

ఆరెంజ్:
సిట్రస్ జాతికి చెందిన ఏరకం పండ్లైనా సరే మీ ఇంట్లో సువాసనలు వెదజల్లాల్సిందే. ఎందుకంటే వాటి స్వభావమే అంత. ఆరెంజ్ లేదా నిమ్మను ఒక గుండు సూదితో కాయ మొత్తం అక్కడక్కడ గుచ్చి వంటగదిలో ఉంచండి . అంతే ఇళ్ళంతా మంచి వాసన రావాల్సిందే..



Click it and Unblock the Notifications