Latest Updates
-
వర్షాకాలంలో జుట్టు విపరీతంగా రాలిపోతోందా? ఇలా చేస్తే నో టెన్షన్ -
చిల్ అవ్వడానికి చోటు ఏదైతేనేం.. భారీ వర్షంలోనూ ‘సిట్టింగ్’.. మందుబాబుల వైరల్ వీడియో.! -
పైన కరకర.. లోపల కరిగే చీజ్.. ఆహా అనిపించే పొటాటో చీజ్ బాల్స్..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
మీతో ఇతరులు హ్యాపీగా ఉండాలంటే.. ఈ 5 విలువైన సలహాలు పాటించాల్సిందే.! -
ఫౌండేషన్ తర్వాత ముఖం ఎందుకు నల్లగా మారుతుంది.. తెలిసీతెలియక చేసే పొరపాట్లు ఇవే.! -
ఇలా చేస్తే కుండపోత వర్షం కూడా ఆగిపోతుందట.. మన పల్లెల్లో చేసే 7 వింత ప్రయోగాలు! -
రోజూ వీటిని ఎలా తీసుకుంటున్నారు.?.. ఆరోగ్యం విషయంలో నేటికీ మారని కొన్ని అపోహలు.! -
ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లు రాకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్స్ పాటిస్తే చాలు.! -
రెస్టారెంట్ స్టైల్ స్వీట్ కార్న్ సూప్.. ఇప్పుడు మీ ఇంట్లోనే నిమిషాల్లో రెడీ! -
పెళ్లయ్యాక భార్య కంటే తల్లికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారా.. అందుకు కారణాలివే.?
ఐస్ క్యూబ్ ట్రే వల్ల 10 క్రియేటివ్ ఉపయోగాలు
సాధారణంగా ఐస్ ట్రేలను ఎక్కువగా వేసవికాలంలోనే ఉపయోగిస్తుంటారు. అది కూడా కేవలం ఐస్ క్యూబ్స్ తయారుచేసుకోవడానికి మాత్రమే వినియోగిస్తాం. అయితే ఐస్ ట్రేలతో కేవలం ఐస్ క్యూబ్స్ చేసుకోవడమే కాకుండా ఇతరత్రా ప్రయోజనాలు చాలానే ఉన్నాయి...అవేంటో తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే...
1. మనం ఇంట్లో తయారుచేసుకునే లస్సీ, బటర్ మిల్క్...మొదలైన పానీయాలు ఏవైనా సరే ట్రేలో వేసి ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు. కాసేపటికి గడ్డకట్టిన ఆ క్యూబ్స్ ని కావాలంటే ఉపయోగించుకోవచ్చు లేదా నిల్వచేసుకోవచ్చు.
2. చిరుతిళ్లంటే ఇష్టపడని పిల్లలు ఎవరుంటారు చెప్పండి? బయట దొరికే పదార్ధాలు ఆరోగ్యానికి మంచివి కావు..అందుకే మనం స్వయంగా ఇంట్లోనే తయారుచేస్తే బాగుంటుంది. ఐస్ ట్రేలో పీనట్ బటర్, చాక్లెట్ సిరఫ్ లు వేసి ఫ్రీజ్ చేస్తే రుచికరమైన క్యాండీ తయారవుతుంది. ఇది క్రిస్మస్ సీజన్ కాబట్టి ఇంటికొచ్చిన అతిథులకు ఇవ్వడానికి కూడా ఇవి బాగుంటాయి.అయితే వీటికి ప్లాస్టిక్ ట్రేలకు బదులు స్టీల్ ట్రేలను వినియోగించాలి. ప్లాస్టిక్ ట్రేలకు చాక్లెట్ సిరఫ్ అతుక్కుంటుంది. కాబట్టి వాటిని ఉపయోగించకపోవడం మంచిది.
3. ఐస్ ట్రేల్లో చాక్లెట్లు మాత్రమే కాదు...పండ్ల సలాడ్స్ ని కూడా వేసి ఫ్రీజ్ చేసుకోవచ్చు. క్రీమ్, చెర్రీలు, వివిధ రకాల పళ్ల ముక్కలు..అన్నీ వేసి గడ్డకట్టిస్తే నోరూరించే ఫ్రూట్ పేస్ట్రీ రెడీ...
4. చెత్త నుండి దుర్వాసన వస్తోంది? అయితే ట్రేలో కొద్దిగా నీరు తీసుకుని అందులో నిమ్మకాయను ముక్కలుగా కోసి వేయాలి. దీన్ని ఫ్రిజ్ లో పెడితే కాసేపటికి గడ్డకట్టేస్తాయి. అలా ఫ్రీజ్ అయిన క్యూబ్స్ ని చెత్తడబ్బాలో వేయడం వల్ల దుర్గంధం రాకుండా ఉంటుంది.
5. పిల్లలు పళ్ళరసాలను తాగమంటే ఏవేవో సాకులు చెప్పి మారం చేస్తుంటారు. మీ పిల్లలు కూడా అంతేనా? అయితే ఐస్ ట్రేల్లో ఫ్రూట్ జ్యూస్ వేసి గడ్డకట్టించండి. వీటిని పిల్లలు స్నాక్స్ తిన్నప్పుడు ఇస్తే చాల ఇష్టంగా ఆరగిస్తారు.

6. కోల్డ్ కాఫీ అంటే ఇష్టపడే వాళ్లు ఐస్ ట్రేల్లో కాఫీ డికాషన్ వేసి ఫ్రీజ్ చేసుకోవచ్చు. కాఫీ తాగేటప్పుడు వీటిని అందులో వేసుకుంటే చాలా రుచికరంగా ఉంటాయి. అయితే ఈ పద్థతి అనుసరించేటప్పుడు కాఫీలో విడిగా నీళ్ళు పోసుకోకూడదు సుమా! కాఫీ క్యూబ్స్ లో ఉన్న నీటి శాతం సరిపోతుంది.
7. కొన్ని కొన్ని వంటకాల్లో వైన్ కూడా ఉపయోగించాల్సి ఉంటుంది. అందుకే వైన్ ని ఐస్ ట్రేల్లో వేసి గడ్డకట్టిస్తే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటిని ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంటుంది.
8. చిన్న చిన్న చెవిదిద్దులు, రింగులు..అన్నీ ఒకే చోట ఉంటే కలిసిపోయి ఉంటాయి. వాటి నుంచి ఒక జతని విడిగా తీసుకోవాలంటే బాగా వెతుక్కుంటే కానీ దొరకవు. సమయం కూడా వృధా అవుతుంది. అందుకే వాడని ఐస్ ట్రేల్లో ఏ జతకి ఆ జత విడివిడిగా పెట్టుకుంటే వెతుక్కోవాల్సిన శ్రమ ఉండదు. సమయం కూడా ఆదా అవుతుంది.
9. మనం ఇంట్లో వివిధ హస్తకళాకృతులు చేయడానికి ఉపయోగించే రంగురంగుల కుందన్స్, బటన్స్, స్టోన్స్, బీడ్స్..మొదలైనవన్నీ విడిగా జాగ్రత్తగా ట్రేల్లో భద్రపరచుకోవచ్చు.
10. ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వేసే అలవాటు ఉన్నవాళ్ళు ట్రేని ప్యాలెట్ గా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ఐస్ ట్రేల వల్ల ఉండే ప్రయోజనాలు ఎన్నో..మీకున్న సృజనాత్మకతను ఉపయోగిస్తే ఇంకా అనేక రకాలుగా కూడా దీన్ని వినియోగించవచ్చు.



Click it and Unblock the Notifications