Latest Updates
-
Vellulli Maramaralu Recipe: కరకరలాడే స్పైసీ వెల్లుల్లి మరమరాలు..ఇలా చేసుకుంటే దీన్ని మించిన స్నాక్ ఉండదు! -
ఘుమఘుమలాడే కేరళ స్టైల్ పొటాటో ఫ్రై..సాంబార్, రసంతో నంజుకుని తింటుంటే మస్త్ మజా -
నానా పటేకర్ ప్రాణం తీసింది అదే..చాలామందికి తెలియని విషయం! -
జస్ట్ 10 నిమిషాల్లో పూరీ కర్రీ..ఇలా చేశారంటే ఎన్ని పూరీలైనా అలా తినేస్తుంటారు! -
నవరాత్రి మొదటి రోజే ప్రమాదకర వైధృతి యోగం.. ఈ 3 రాశుల వారికి బ్యాడ్ టైమ్ షురూ! -
శవాల ముక్కు, చెవుల్లో దూది ఎందుకు పెడతారో తెలుసా? గరుడ పురాణం ఏం చెబుతోంది? -
ఆరోగ్యానికి మేలు చేసే మునగకాయ పచ్చడి ..ఇలా చేస్తే ఏడాది అయినా అస్సలు పాడవదు! -
అక్టోబర్ 11న చిత్త నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 3 రాశుల వారు జర భద్రం! -
బిర్యానీ కూడా దీని ముందు బలాదూర్.. తెలంగాణ స్టైల్ బగారా రైస్, పనీర్ కర్రీ ఇలా చేసి తింటుంటే స్వర్గమే! -
ఉద్యోగులూ అలర్ట్..మెడ, వెన్ను నొప్పులతో నరకం చూస్తున్నారా? విముక్తి కోసం ఏం చేయాలంటే?
ప్రియుడితో పారిపోయిందని.. భార్యను చెట్టుకు కట్టేసి గ్యాంగ్ రేప్ చేయించిన భర్త, బంధువులు..
శుద్దీకరణ ఆచారం అంటూ ఓ మహిళపై కొందరు గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డారు. భర్త, అతని బంధువులే దగ్గరుండి ఈ దారుణం చేయించారు. అంతేకాకుండా ఇదంతా వీడియోలు, ఫొటోలు తీసి పైశాచిక ఆనందం పొందారు. సోషల్ మీడియాలో కూడా వాటిని పోస్ట్ చేయడంతో పోలీసుల వరకు విషయం చేరింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. అయితే ఇదంతా ఎక్కడ జరిగింది? పూర్తి వివరాలను ఇక్కడ చూడండి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గుజరాత్ రాష్ట్రంలోని సురేంద్రనగర్ జిల్లాలోని ఒక గ్రామంలో నివసించే ఒక వివాహిత మహిళను భర్త ఎప్పుడూ ఇంట్లోనే బంధించేవాడు.. టార్చర్ పెట్టేవాడు. అయితే ఆ మహిళకు కూడా వేరే వ్యక్తితో ఎఫైర్ ఉండేది. ఈ క్రమంలో ఆ మహిళ ఎలాగోలా అక్కడి నుంచి బయటపడి తన లవర్ తో కలిసి ఊరు వదిలి పారిపోయింది.

అయితే భర్త, ఇతర కుటుంబసభ్యులు ఆమె ఎక్కడ ఉందో కనిపెట్టి గ్రామానికి తీసుకొచ్చి తాళ్లతో చెట్టుకు కట్టేశారు. వివాహేతర సంబంధం పెట్టుకుందని, ఆమెను శుద్ది చేయాలంటూ భర్త, బంధువులు ఆమెను చెట్టుకి కట్టేసి కొట్టి, అసభ్య పదజాతంలో దూషిస్తూ గ్యాంగ్ రేప్ చేయించారు. ఆమె లవర్ తో కూడా అత్యాచారం చేయించారు.

ఇదంతా వీడియోలు, ఫొటోలు తీశారు. అక్రమ సంబంధాలు పెట్టుకున్నవాళ్లకు ఇదొక గుణపాఠంలా ఉంటదంటూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఇంత జరిగినా బాధితురాలు పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేయలేదు. వీడియోలు వైరల్ అయ్యాక పోలీసులకు విషయం తెలిసింది.దీంతో రంగంలోకి దిగి బాధిత మహిళ ఎక్కడుందో కనిపెట్టి, ఆమె స్టేట్మెంట్ తీసుకున్నారు. దీంతో అధికారికంగా కంప్లెయింట్ రిజిస్టర్ చేసిన పోలీసులు మొత్తం 9 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. నిందితులకు వీళ్లు సాయం చేసినట్లు సమాచారం. ఇక బాధితురాలిని షెల్టర్ హోమ్ కి తరలించారు.
కాగా, బాధితురాలు ఒక అట్టడుగు వర్గానికి చెందినది.. ఈ వర్గంలో వివాహేతర సంబంధాలు కలిగి ఉన్నారని, ఇంటి నుంచి పారిపోయారని లేదా ఇతర ఆరోపిత తప్పిదాలకు పాల్పడ్డారని అనుమానించబడే మహిళలపై ఇటువంటి శుద్ధి ఆచారాలను నిర్వహిస్తుంటారని సమాచారం.



Click it and Unblock the Notifications
