Latest Updates
-
ఉప్పు, చక్కెర.. ఈ రెండింటిలో గుండెకు ఏది ఎక్కువ డేంజర్? -
రెస్టారెంట్ స్టైల్ ఉప్మా.. ఈ ఒక్కటి కలిపారంటే వద్దు అన్న వాళ్లు కూడా ఆవురావురుమంటూ తినడం పక్కా.! -
కుజ, గురు గ్రహాల అరుదైన కలయిక.. 3 రాశుల వారికి ఈ అడ్డంకుల నుంచి ఉపశమనం -
వెజిటేబుల్ కుర్మా ఇలా చేశారంటే..గిన్నెలు గిన్నెలు తినేస్తారు! -
బ్యాచ్లర్స్ మీకోసమే.. కూరగాయలు లేవని కంగారొద్దు, ముక్క తిన్నంత మజా ఇచ్చే బిర్యానీ.! -
ప్రధాని మోదీ బర్త్డే: ‘76’లోనూ తగ్గని ఫిట్నెస్.. బిజీ షెడ్యూల్లోనూ పొద్దున్నే ఇది తప్పనిసరి.! -
తలనొప్పి, కీళ్లనొప్పులు, షుగర్.. అన్నింటికీ చెక్ పెట్టే అడవి బాదం! -
వెజ్ మంచూరియా చేసేటప్పుడు ఈ తప్పులు వద్దు.. స్ట్రీట్ స్టైల్ మాదిరి రావాలంటే ఇలా చేయండి.! -
అచ్చం హైవే ధాబా రుచితో గుమగుమలాడే దాల్ ఫ్రై.. ఇంట్లోనే చాలా ఈజీగా! -
పాత కాలం నాటి నెల్లూరు స్టైల్ మినుముల పచ్చడి.. అసలుసిసలైన రుచి అంటే ఇదే.!
దుస్తులపై పడ్డ మైనపుమరకలు తొలంచే సులభ చిట్కాలు
సాధారణంగా క్యాండిలైట్స్ చూడటానికి చాలా రొమాంటిక్ గా ఉంటుంది. అందుకే చాలా మంది, సాఫ్ట్ మ్యూజిక్ తో క్యాండిలైట్ డిన్నర్ ను ప్రత్యేకంగా ఏర్పటు చేసుకుంటుంటారు. అంత వరకూ బాగానే ఉంది కానీ, క్యాండిలైట్ డిన్నర్ లో చల్లగా వీచే గాలి, క్యాండిల్ నుండి మైనం క్రిందికి మీ దుస్తుల మీద లేదా డైనింగ్ టేబుల్ క్లాత్ మీద పడితే ఇక అంతే సంగతు, అది తొలగించడానికి నానా కష్టలు పడాల్సిందే అని ఆలోచిస్తారు. మైనంను వ్యాక్ అని కూడా అంటారు. దుస్తుల మీద లేదా డైనింగ్ టేబుల్ కవర్ మీద పడ్డ వ్యాక్స్ ను తొలగించడానికి కొన్ని సందర్భల్లో కష్టం అవుతుంది . మైన దుస్తులకు చాలా గట్టగా అతుక్కుపోవడం వల్ల ఈ మైనపు మరకలు తొలగించడం చాలా కష్టం అవుతుంది.
అయితే, దుస్తుల మీద పడ్డ క్యాండిల్ వ్యాక్స్ ను వెంటనే తొలగించాలి. అలా తొలగించలేని సందర్భంలో దుస్తుల మీద పడ్డ క్యాండిల్ వ్యాక్స్ ను తొలగించడానికి కొన్ని హోం రెమడీస్ ఉన్నాయి. దుస్తుల మీద పడ్డ మైనపు మరకలను తొలగించడానికి ఇక్కడ కొన్ని సులభ చిట్కాలు మీకోసం...

1. అరటి తొక్క: క్యాండిల్ నుండి దుస్తుల మీద పడ్డ మైనపు మరకల మీద అరటితొక్కతో రుద్దాలి. మైనపు మరకల మీద అరటితొక్క లోపలవైపునుండి సర్కులర్ మోషన్ లో రుద్దుతాలి. అరటితొక్కతో రుద్దేటప్పుడు, మైనం దుస్తుల నుండి ఊడిరావడాన్ని మీరు గమనించవచ్చు. ఈ హోం రెమెడీ, దుస్తుల మీద పడ్డ మైనపు మరకలు వేడిగా ఉన్నప్పుడు మాత్రం వెంటనే తొలగించడానికి సులభంగా ఉంటుంది. మరియు ఎఫెక్టివ్ గా తొలగిపోతుంది.
2. మైనపు మరకల మీద ఐరన్ చేయాలి: దుస్తుల మీద పడ్డ మైనపు మరకలను తొలగించడానికి ఇది ఒక సాధరణ మార్గం. ఐరన్నింగ్ బోర్డ్ మీద రెండు పేపర్ టవల్స్ ను అమర్చాలి. తర్వాత మైనపు మరకలున్న దుస్తులను దాని మీద పరిచి, తిరగి క్లాత్ మీద పేపర్ టవల్ ను అమర్చాలి. ఇప్పుడు, ఐరన్ బాక్స్ తో ఐరన్ చేయడం వల్ల పేపర్ టవల్ కు వ్యాక్స్ అంటుకొని ఊడి వచ్చేస్తుంది. దుస్తుల మీద పడ్డ క్యాండిల్ వ్యాక్స్ ను తొలగించడానికి ఇది ఒక ఉత్తమ మరియు సులభమైన మార్గం.
3. ఫ్రీజింగ్ : దుస్తుల మీద గడ్డకట్టిన మైనపు మరకను తొలగించడానికి మరో సులభ మార్గం, 5డిగ్రీల సెల్సియస్ లో క్లాత్ ను ఫ్రీజర్ లోపెట్టాలి. అదంతట అదే తొలగిపోతుంది. మరింత గట్టగా ఉంటే, షార్ప్ గా ఉన్న కత్తితో తొలగించవచ్చు.
4. వెజిటేబుల్ ఆయిల్: దుస్తుల మీద పడ్డ చిన్నచిన్న క్యాండిల్ వ్యాక్స్ ను వెజిటేబుల్ ఆయిల్ ఉపయోగించి తొలగించడం చాలా సులభం. క్యాండిల్ వ్యాక్స్ పడిన దుస్తుల మీద మైనపు మరక మీద కొద్దిగా వెజిటేబుల్ ఆయిల్ వేస్తే చాలా సులభంగా తొలగించవచ్చు.



Click it and Unblock the Notifications
