Latest Updates
-
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.!
దీని ధర.... చుక్కల్లో చూడాల్సిందే!

మాస్తిఫ్ జాతి కుక్కకు ఇంత డిమాండు రావటానికిగల కారణమేమిటి? అది ఎక్కడనుండి పుట్టింది?
అధిక బొచ్చు కల ఈ కుక్కలు టిబెట్ పర్వత దేశంలో పుట్టాయి. చప్పిడి ముక్కు పొడవుగా వుండే నోరు. వీటికిగల అధికమైన బొచ్చుతో ఇవి కూడా మూసుకుపోతాయి. టిబెట్ దేశాన్ని ఇతరులు ఆక్రమించకుండా కాపాడుతున్నవి ఈ కుక్కలేట. ఆ దేశంలో వుండే మత సన్యాసుల వెంట కాపలాగా ఇవి తిరుగుతాయి. వారికి పూర్తి రక్షణ కల్పిస్తాయి. వీటి బలం పరిశీలిస్తే...చాలా ఎక్కువ. అమోఘంగా ప్రత్యర్ధులను ఎదుర్కొంటాయి.
ప్రపంచంలోనే అత్యధిక ఖరీదుగా ఎందుకు చెప్పాలంటే..... ఈ జాతి కుక్కలను పెంచటం కష్టమేమీకాదు. తేలిక. ఎంతోక్రూరంగా కనపడేటటువంటి పర్వత ప్రాంత కుక్క. బాగా ఎత్తుగా వున్న ప్రదేశాలలో జీవించగలవు. అలాగే సాధారణ మైదాన ప్రాంతాలలో కూడా జీవించే సామర్ధ్యం వీటికి వుంది. టిబెట్ దేశంతో సరైన సంబంధాలు చైనీయులకు లేనప్పటికి, వీరు టిబెట్ దేశపు మాస్తిఫ్ జాతి కుక్కను ఎంతో అభిమానిస్తారు. దీనిని వారి ఫెంగ్ షూయి శాస్త్రంలో ఇంటికి మంచి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే కుక్కగా భావిస్తారు. ఇంటి యజమానికి సంపదను, ఐశ్వర్యాన్ని కలుగజేస్తాయని నమ్ముతారు. చైనా దేశంలో మధ్య తరగతి, ఉన్నత తరగతి కుటుంబాలు ఈ జాతి కుక్కను చాలావరకు ఒక సాంప్రదాయంగా పెంచుతూంటాయి. బాగా ధనవంతులైనవారి ఇండ్లలో ఇంటికి కనీసం 20 కుక్కలు కూడా వుంటాయి.
టిబెటన్ మాస్తిఫ్ కుక్క ధర ఎంత? ప్రపంచంలోనే ఖరీదైన కుక్క అని ఊహించి చెప్పటంలేదు సుమా! బాగా బలిసిన చిన్న కుక్క పిల్లే.... సుమారుగా పదివేల డాలర్లపైన పలుకుతోంది. ఇక పెరిగి పెద్దదైనదంటే...దీని ధర చుక్కల్లో చూడాల్సిందే! ఉత్తర చైనా బొగ్గు గనుల ఆసామీ యాంగ్ ఈ కుక్కను అక్షరాలా 945,000 పౌండ్లు పోసి ఈ సంవత్సరం మార్చి నెలలో అత్యధిక రేటు తో కొనుగోలు చేశాడట. బలంగా వున్న ఈ కుక్క ఎర్రని ఎరుపుతో చూపరులకు భయాన్ని అదే సమయంలో ఒక వింత కుక్కను చూశామన్న అనుభూతిని కలిగిస్తోందట.
మనిషికి మంచి స్నేహితుడుగా చెపుతున్న శునకం నిస్సందేహంగా విలువ కట్టదగినదే! అది కూడా ఏ రకంగా చూసినా ఆకాశాన్నంటే రేటే సుమా!



Click it and Unblock the Notifications
