Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
మీ పెంపుడు కుక్కలకు చలికాలం జాగ్రత్తలు!

కుక్కను వుంచే కేబిన్ ఇంటిబయట వుంటే, దానిని తక్షణమే ఇంటిలోకి మార్చండి. ఆధునిక ఇండ్లలో ఇది కొద్ది సమస్య గావచ్చు. మీవలే మీ కుక్క కూడా రాత్రుళ్ళు చలి భావిస్తుంది. వచ్చి ఇంట్లో పడుకోటానికి కూడా ప్రయత్నిస్తుంది. సాధారణంగా కుక్కలు మిమ్మల్ని ఆనుకునే కూచుంటానికి ఇష్టపడుతూంటాయి. అవి మీ పక్కలో పడుకోటానికి కూడా సందేహించవు. కనుక మీ పక్క వాటికి ఇవ్వకూడదనుకుంటే వాటికి కొంత సౌకర్యం చేయండి. వయసులో వున్న కుక్కలకంటే కూడా ముసలి లేదా చిన్న కుక్కలు చలికి తట్టుకోలేవు.
గోల్డెన్ రిట్రీవర్ కుక్కలకు బొచ్చు అధికం కనుక వాటికి కొంత రక్షణ వుంటుంది. అయినప్పటికి దాని బొచ్చును కనుక కత్తిరించినట్లయితే లేదా బొచ్చు లేని కుక్క అయితే చలి కాలంలో వాటిపై కొంత శ్రద్ధ చూపటం మంచిది. ఉదయం వేళ లేదా రాత్రివేళ మీ కుక్క షికారుకు బయలుదేరితే దానికి దుస్తులు తొడగండి. ఉన్ని దుస్తులను పగ్ జాతి కుక్కలు ఇష్టపడతాయి. చలికాలంలో కుక్కకు స్నానం చేయిస్తే వెంటనే బ్లోయర్ తో నీటిని తుడిచేసి బాగా ఆరబెట్టి దాని శరీరానికి కొద్దిపాటి వేడిని కలిగించండి. కుక్కలకు తేమ శరీరంలో వ్యాధులు కలిగిస్తుంది. బ్లోయర్ కు భయపడే కుక్క అయితే మందపాటి టవల్ ఉపయోగించి బాగా తుడిచి, కొంత సేపటివరకు దానిని బయటకు వదలకండి.
మీ కుక్క బయటకు వెళ్ళి ఎక్కువ సేపు వుండటానికి ఇష్టపడితే దాని ఆహారాన్ని మార్చండి. దానికి అదనంగా శరీరంలో కేలరీలను ఇచ్చే ఆహారాన్నివ్వండి. అధిక మాంసాన్ని పెట్టండి. వాటికి వేడిపాలు ఇవ్వండి. చల్లనైన ఐస్ క్రీములు అవి అడిగినా పెట్టకండి. చలికాలం జాగ్రత్తలు అన్ని జాతుల కుక్కలకు అవసరం లేదు. అనవసరంగా కోటు లేదా దుప్పటి వేసి చలి అంటూ వాటిని బాధించకండి. కొన్ని జాతి కుక్కలకు మాత్రమే ఈ రకమైన జాగ్రత్తలు అవసరం అని గ్రహించండి.



Click it and Unblock the Notifications
