For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెంపుడుకుక్క గుంతలు,రంధ్రాలు త్రవ్వడం ఆపు చేయడమెలా

By Super
|

ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తమ సొంత సంరక్షణ కోరుకుంటారు. ఇది మానవులకు మరియు జంతువులకు ఇద్దరికీ వర్తిస్తుంది. మానవులు తమ వస్తువులు మరియు తమ అవసరాలకు కావల్సిన వాటని సుక్షితంగా నిల్వచేసుకుంటారు, జంతువులను కూడా నిల్వ చేసుకొనే విషయాలు కొన్ని కలిగి ఉన్నాయి . ఉదా: పక్షులు వాటిని గూళ్ళను తయారుచేసుకుంటాయి మరియు వాటి ఆహారాన్ని , చిట్టెలుకలు ఆహారాన్ని నిల్వచేసుకుంటాయి. అదేవిదంగా కుక్కలు కూడా ఈ అలవాటు ఉంది. అవి నివసించే చుట్టు ప్రక్కల ప్రదేశంలో బూమిలోకి చిన్న చిన్న రంద్రాలను త్రవ్వి అక్కడ వస్తువులను నిల్వ చేసుకుంటాయి. మరియు వాటికి సౌకర్యవంతమైన ప్రదేశంలో నివసించడానికి ఒక స్థాలన్ని ఎంపికచేసుకుంటాయి. కుక్కలు రంధ్రాలు కాళ్ళతో మట్టిని తోడి రంధ్రాలు చేస్తాయి. ఇలా చేయడం వాటికి ఒక మంచి వ్యాయామం మరియు వినోదం కూడా.

వీధి కుక్కలు పబ్లిక్ గార్డెన్స్ లో రంధ్రాలు త్రవ్వుతుంటాయి. అవి మనకు అంత ఇబ్బంది కలిగించవు. అయితే మీ పెంపుడు కుక్క మీ పెరుడు మరియు మీ తోటలో అలా గుంతలు త్రవ్వడం మొదలుపెడుతుంది మరియు అది బయట ఒక నరకం చేస్తుంది. అందంగా పునరుద్ధించిన మరియు అలంకరించిన పచ్చిక పూర్తిగా నాశనం చేస్తుంది మరియు ప్రతి చోటా త్రవ్విన రంధ్రాలతో అసహ్యంగా మార్చుతుంది. కాబట్టి మీ పెంపుడు కుక్కు అలా చేస్తున్నప్పుడు మీరు నిజంగా అది అలా చేయడం నిపివేయించాల్సి ఉంటుంది.

How to stop dogs from digging

కుక్కలు చలా త్వరగా నేర్చుకుంటాయి మరియు ఏదైనా నేర్చుకొన్న విషయాలు అంత త్వరగా, సులభంగా మర్చిపోవు. కాబట్టి, మీ పెంపుడు కుక్క లాన్ లో అలా రంధ్రాలు మరియు గుంటలు చేయకుండా ఆపడానికి కొన్ని విషయాలను జాబితా తయారుచేసుకోండి.

1. ప్రొఫిషినల్ గా వెళ్ళండి : మీ పెంపుడు కుక్క మీ తోటలో ఉన్నప్పుడు మంచిగా ప్రవర్తించాలనుకుంటే, మీరు ఖచ్ఛితంగా కొన్ని వృత్తిపరమైన శిక్షణ అంధివ్వడానికి ప్రయత్నించాలి. వాటిని ట్రైనింగ్ సెంటర్ లో చేర్పించండి మరియు మీరు నిజంగానే తేడాను చూడగలరు . ప్రొఫిషనల్ గా శిక్షణ పొందిన కుక్కలు చాలా ఖచ్చితంమైనవిగా మరియు సమర్థవంతమైనవిగా ఉంటాయి. శిక్షణ పొందిన తర్వాత అటువంటి పనులు చేయడానికి తిరిగి యత్నించవు.

2. మీ పెంపుడు కుక్క గురించి పరిశోధన: మీరు మీ పెంపుడు కుక్క లను పెట్స్ గా తీసుకొనే ముందు వాటి యొక్క అలవాట్లను ఎల్లప్పుడు తెలుసుకొని ఉండాలి. అందుకోసం, వాటి అలవాట్లు, వాటి అవసరాలు మరియు వాటికి ఏం అవసరం అవుతాయిని పరిశధన చేయాలి. కొన్ని జాతుల కుక్కలు గుంతలు తవ్వడం మరియు రంధ్రాలు చేయడం వాటికి ఇష్టమైన కాలక్షేపం వంటిది. కొన్ని జాతుల పెంపుడు కుక్కలు వాతావరణ ఉష్ణోగ్రతకు చాలా సున్నిత స్వభావాన్ని కలిగి ఉంటాయి. వాటికి గుంటలు త్రవ్వి వాటిలో వెచ్చగా కూర్చోవడానికిఇష్టపడుతాయి.కాబట్టి మీ పెంపుడు కుక్కకు అవసరం అయ్యే సరైన చర్యలు తీసుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

3. పెంపుడు కుక్కలకు వినధం కలిగించాలి: చాలా జాతుల పెంపుడు కుక్కలు గుంతలు త్రవ్వడం, రంధ్రాలు చేయడం వంటి అవి విసుగు చెందినప్పుడు అలా చేస్తుంటాయి. అటువంటప్పుడు మీ పెంపుడు కుక్కలను వినోధంతో మరియు ఇతరపనులతో వాటిని బిజీగా ఉండేట్లు చూడం ఒక ఉత్తమమైన మార్గం. వాటితో మీరు ఫెచ్ గేమ్ ఆరడటం మరియు కుడ్లింగ్, మీతోపాటు నడకకు తీసుకుపోవడం వాటికి ఇష్టమైన బొమ్మలతో ఆడించడం ద్వారా, రంధ్రాలు పెట్టకుండా వాటిని దారి మళ్లించవచ్చు. ఒకసారి వాటి మనస్సు ఇతర చర్యలతో బిజీ చేస్తే తప్పకుండా రంధ్రాలు త్రవ్వకుండా ఆపవచ్చు.

4. కఠినంగా ఉండాలి: కొన్ని సార్లు వాటికి ఎంత శిక్షణ ఇచ్చినప్పటికి మరియు ఎంత వినోధాన్ని కలిగించనప్పటికి, కుక్కబుద్ది పోనించ్చుకోవు. కుక్కతోక ఎప్పటిక స్ట్రెయిట్ గా మారదు. అందువల్ల వాటితో కొంత కఠినంగా ఉండటం మంచిది. అవి గ్రౌండ్ అరుస్తూ పరుగెడుతున్నప్పుడు వాటిని బిగర్గరగా అరచండి. దాని వల్ల అవి తిరిగి తప్పులు చేకూడదని తెలుసుకోవటం చేస్తుంది.

5. లగ్జరీ లైఫ్: మీ పెంపుడు కుక్క చెడు అలవాట్లైన రంధ్రాలు తవ్వడం వంటి చెడు అలవాట్లు చేస్తుంటే వాటిని ఆ లైఫ్ నుండి దూరంగా దూరం చేయాలి. వాటికి ఒక ప్రత్యేకమైన ప్రదేశం సౌకర్యం మరియు వెచ్చని బెడ్ మరియు వాటికి బొమ్మలు వంటివి అలవాటు చేయడం వల్ల చెడు అలవాట్లకు దూరంగా ఉంటుంది. వాటిని గ్రౌండ్ లోకి వెళ్ళకుండా చూసుకోవాలి.

English summary

How to stop dogs from digging

Every being in this world wants to safeguard their belongings. This applies to both humans and animals. As humans have storage appliances to keep their objects and necessities safe, animals also have a way to store things. 
Desktop Bottom Promotion