For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీకు ఇష్టమైన మీ పెట్స్ ఆరోగ్యం కోసం 8 హెల్తీ ఫుడ్స్

By Super
|

విశ్వాసానికి మరో పేరుగా నిలిచే కుక్కల పెంపకంపై ప్రజల ఆసక్తి పెరిగింది. వృద్దులు , జీవితంలో ఒంటరి వారు జీవితంలో ఓ తోడుగా శునకాలను పెంచుతుండగా మరి కొందరు శునకాల పెంపకాన్ని ఇంటి రక్షణకే కాకుండా అరుదైన జాతి శునకాన్ని పెంచడం గౌరవంగా భావిస్తున్నారు. అన్ని తరగతుల వారు వీటి కొనుగోలు , పెంపకానికి వెనుకాడడం లేదు. వాటికైయే ఖర్చుకు వెనుకాడటం లేదు. ఏదైనా అనారోగ్యం కలిగితే ఎంతో హైరానా పడిపోతున్నారు. శునక పెంపకానికి అలవాటు పడ్డ ప్రజలు అవి లేకుండా జీవించటమే కష్టతరంగా భావిస్తుంటారు.

రకరకాల జాతి కుక్కపిల్లలను పెంచుకోవడానికి పట్టణ ప్రజలే కాకుండా, పల్లె ప్రజలు సైతం ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇంటిల్లిపాది వారి శ్రేయస్సును కుక్క కోరుకుంటుందనేది అందరికీ తెలిసి విషయమే. అయితే కుక్కలను పెంచుకోవడంలో సరైన అవగాహాన ఉండటం లేదు. శునకాల పెంపకంలో ప్రత్యేక శ్రద్ధ, ఆహారం, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కొందరిలో సైతం ఉండటంలేదు. దీంతో కుక్కలు పెంచుతున్నామని ఆనందమే తప్ప, వాటి పరిరక్షణలో విఫలమవుతున్నారు.

కాబట్టి, పెంపుడు కుక్కులు, సంతోషం, ఆనందంగా మరియు ఆరోగ్యంగా పెరగడానికి వాటి ఎలాంటి ఆహారాలు అవసరం అవుతాయో తెలుసుకోవాలి. మనుష్యులకే కాదు, పెంపుడు కుక్కలకు కూడా రెడీమేడ్ ఫుడ్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఎలాంటి సందేహం లేకుండా ఇవి పెంపుడు కుక్కలకు ఆరోగ్యకరమైనవే చెప్పవచ్చు . అయితే వాటి రెగ్యులర్ డైట్ లోకి వెరైటీ ఆహారాలు తీసుకురావడం వాటి ఆరోగ్యానికి అంత మంచిది కాదు.

నిజానికి ఇంట్లో పంెచుకొనే పెంపుడుకుక్కల కోసం కొన్ని హెల్తీ ఫుడ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిని ప్రతి ఒక్కరి వంటగదిలోనూ చూడగలం . ఇవి నేచురల్ ఫుడ్స్ మాత్రమే కాదు, ఫ్యూర్ ఫుడ్స్ కూడా. కాబట్టి ఇలాంటి నేచురల్ ఫుడ్స్ ను తప్పనిసరిగా వాటికి అందిస్తుండాలి. ఇక అకేషనల్ గా మాత్రమే బయట నుండి డాగ్ ఫుడ్స్ ను తీసుకొచ్చి పెట్టాలి. అంతే కాదు ఇంట్లో తయారుచేసి ఈ క్రింది లిస్ట్ ఆఫ్ ఫుడ్స్ కూడా మీ పెంపుడు కుక్కలు ఇష్టంగా తినవచ్చు...

 ఓట్ మీల్ :

ఓట్ మీల్ :

ఓట్ మీల్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఓట్ మీల్ పెంపుడుకుక్కకు కావల్సిన ఎనర్జీని అందిస్తుంది. మరియు గోధుమలు అలర్జీకి గురౌతుంటే వీటికి ప్రత్యామ్నాయంగా ఓట్ మీల్ ను అందివ్వొచ్చు . అయితే ఎల్లప్పుడూ ఉడికించిన వాటికే ప్రాధాన్యత ఇవ్వాలి .

 పెరుగు:

పెరుగు:

మిల్క్ ప్రొడక్ట్స్, కానీ కొద్దిగా డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఇది. మనుషులకే కాదు, కుక్కలకు కూడా పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా మరియు క్యాల్షియం, ప్రోటీన్లు అధికంగా అవసరం అవుతాయి . వేసవిలో ఫ్రోజోన్ పెరుగు మంచింది. అయితే ఫ్లేవరింగ్ ఫుడ్స్ ను నివారించాలి.

చికెన్:

చికెన్:

బాగా ఉడికించిన చికెన్, కుక్క ఆరోగ్యంగా ఉండటానికి గ్రేట్ గా సహాయపడుతుంది . అంతే కాదు చికెన్ లో ఉండే ఫైబర్ కూడా, క్యాల్షియం, ప్రోటీన్లు కూడా ఇందులకు గ్రేట్ గా అవసరం అవుతాయి.

 ఫ్లాక్స్ సీడ్స్:

ఫ్లాక్స్ సీడ్స్:

ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మనుషుల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అదే విధంగా కుక్కలకు కూడా ఆరోగ్యకరమే. ఇది కుక్క ఆరోగ్యంగా పెరగడానికి రక్షక కవచంగా డాగ్ స్కిన్ ఏర్పరచడానికి సహాయపడుతుంది. అంతే కాదు ఫైబర్ కూడా అందిస్తుంది.

సాల్మన్:

సాల్మన్:

సాల్మన్ లో ప్రోటీన్స్ అధికంగా ఉన్నాయి. కుక్కలకు కూడా ఇవి అందివ్వొచ్చు . కుక్కలకు అందించే హెల్తీ ఫుడ్స్ లిస్ట్ లో సాల్మన్ కూడా ఒకటి. అదే విధంగా., ఫ్యాటీ ఫిస్ ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉంటాయి, ఇవి కుక్కలకు స్కిన్ కోట్ గా గ్రేట్ గా సహాయపడుతాయి.

గుమ్మడి:

గుమ్మడి:

ఎల్లో కలర్ వెజిటేబుల్స్ లో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది . ఇంకా ఇందులో ఫైబర్ కూడా ఎక్కువే . ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది . కుక్కల పెట్టే ఆహారాల్లో గుమ్మడి చేర్చడం వల్ల విటమిన్స్ అందివ్వడంతో పాటు బౌల్ మూమెంట్ ను హెల్తీగా ఉంచుంతుంది.

గ్రీన్ బీన్స్ :

గ్రీన్ బీన్స్ :

గ్రీన్ బీన్స్ డాగ్ హెల్త్ కూడా మంచిదే. చాలా వరకూ కుక్కలు ఫ్రోజోన్ బీన్స్ ను ఎక్కువగా ఇష్టపడుతాయి . వీటిలో విటమిన్ కె మరియు విటమిన్ సి, మెగ్నీషియంలు అధికంగా ఉన్నాయి.గ్రీన్ బీన్స్ వాటి పొట్టను నిండుగా ఉంచడం మాత్రమే కాదు , వాటి బరువును కంట్రోల్ చేయడానికి గ్రేట్ గా సహాయపడుతాయి.

గుడ్లు:

గుడ్లు:

మాంసాహారంతో పాటు గుడ్డు కూడా మంచిదే . పెంపుడు కుక్కలకు జీర్ణశక్తిని పెంచే డైజెస్టబుల్ ప్రోటీన్స్, రిబో ఫ్లెవనాయిడ్స్ మరియు సెలీనియం ఇందులో అధికంగా ఉన్నాయి . అయితే బాగా ఉడికించిన వాటిని మాత్రమే వీటికి అందివ్వాలి . హెల్తీగా కూడా ఉంటాయి .

English summary

Healthy Foods For Your Dog

Of all the animals kept as pets, dogs are undoubtedly the most popular. And when you own a dog, you will not disagree with the fact that there is no other best friend than a pet dog. It is equal to a family member and gets due care from you. In return, the dog too expresses its whole-hearted dedication to you and the members of your family.
Story first published: Monday, January 18, 2016, 15:04 [IST]