For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీకు నచ్చే టాప్ 10 పెంపుడు కుక్కలు

|

పెంపుడు కుక్కలని పెంచుకోవడమనేది చాలా మందికి ఇష్టమైన కాలక్షేపం. పెంపుడు కుక్కలతో టైం స్పెండ్ చేయడాన్ని చాలా మంది ఇష్టపడతారు. పెంపుడు కుక్కలు చిన్నవిగా, ముద్దుగా ఉంటాయి.
వీటిలో ఎక్కువశాతం రష్యన్, మెక్సికన్ రకాలే ఉంటాయి. చిన్ని కాళ్ళు, పెద్ద తలతో ఇవి చాలా క్యూట్ గా ఉంటాయి. వీటి చెవులు మడతపడినట్లుగా ఉంటాయి.
ఈ రకం కుక్కపిల్లలలో కొన్ని చిన్నపిల్లల లక్షణాలుంటాయి. వీటిని కొంతమంది సొంత పిల్లల్లా చూసుకోవడానికి ఇష్టపడతారు కూడా. సరోగేట్ బేబీస్ లా పెంపుడు కుక్కలని ఆదరించేవాళ్ళు కూడా ఉన్నరంటే అతిశయోక్తి లేదు. కుక్కలను పెంచడాన్ని స్టేటస్ సింబల్ లా భావిస్తారు. ఈ రకం కుక్కలు తమను పెంచుకునేవారిపై అమితమైన ప్రేమను కురిపిస్తాయి.
కొన్ని రకాల పెంపుడు కుక్కల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కవలియర్ కింగ్ చార్లెస్ స్పేనియల్

ఈ రకంవి అచ్చు బొమ్మ కుక్కలా కనిపిస్తాయి. సిల్కీగా ఉంటాయి. మృదువైన బొచ్చుతో ముచ్చటైన తోకతో అందంగా ఉంటాయి. పిల్లలతో, పెద్దలతో తోటి జంతువులతో ప్రేమగా, స్నేహపూర్వకంగా ఉండటం వీటి లక్షణం.

హవనీస్

హవనీస్

హవనీస్ కుక్కలని పరిపూర్ణ పెంపుడు కుక్కలని చెప్పుకోవచ్చు. క్యూబా నేషనల్ డాగ్ ఇది. వీటి బొచ్చు కొంచెం ఎక్కువే. దీని బొచ్చు పొడవుగా, సిల్కీగా ఎక్కువగా ఉంటుంది. ఈ రకం కుక్కలను ఐడీల్ ఫ్యామిలీ పెట్ గా చెప్పుకోవచ్చు.

మాల్టీస్

మాల్టీస్

ఇవి కుక్కల్లో చిన్న జాతికి చెందినవి. పొడవైన, సిల్కీ బొచ్చు వీటి సొంతం. వీటికి అండర్ కోట్ ఉండదు. హై ఎనర్జీ లెవెల్స్ తో చుట్టూ ఉండే వారికి ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఈ రకం కుక్కపిల్లల బొచ్చు ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పడిపోదు.

షీహ్ త్జూ

షీహ్ త్జూ

పెద్ద కళ్ళు, నల్లని కళ్ళు కలిగిన ఈ రకం కుక్కలు బుల్లి బుల్లిగా, ముద్దు ముద్దుగా ఉంటాయి. ఇవి చాలా విశ్వాసం కలిగినవి. అత్యంత ప్రేమ కురిపిస్తాయి. అప్రమత్తంగా ఉంటాయి. వీటి బొచ్చు కూడా ఊడిపోదు. మంచి పెర్సనాలిటీ కలిగిన ఈ రకం కుక్కపిల్లలతో ఎక్కువ సేపు ఆడుకోవాలని అనిపిస్తుంది.

ఫ్రెంచ్ బుల్ డాగ్

ఫ్రెంచ్ బుల్ డాగ్

ఫ్రెంచ్ బుల్ డాగ్ అనేవి ఒకరకమైన పెంపుడు కుక్కలు. ఇవి చాలా ఉత్సాహంగా ఉంటాయి. వీటిని ఎక్కువమంది ఇష్టపడతారు. దురదృష్టవశాత్తు, ఇవి కొంచెం మొండివి. నచ్చితే ఒకలా,నచ్చకపోతే ఒకలా ప్రవర్తిస్తాయి.

 పెకింగీస్

పెకింగీస్

చైనాలో ఆవిర్భవించిన అతి పురాతనమైన జాతికి చెందినవివి. వీటిని ఎక్కువగా కంపానియన్ గా వాడతారు. అన్ని రకాల కలర్ కాంబినేషన్స్ లో ఇవి లభిస్తాయి. ఈ రకం జాతి బొచ్చు ఊరికే ఊడుతూ యజమానికి కొంచెం ఇబ్బందిని కలిగిస్తాయి.

టిబెటన్ స్పేనియాల్

టిబెటన్ స్పేనియాల్

టిబెట్ లోని హిమాలయ పర్వతాలలో ఈ జాతివి ఉద్భవించాయి. ఈ రకం కుక్కలు చూడడానికి చిన్నవే అయినా తెలివితేటలు కలిగినవి. ఇవి చాలా యాక్టివ్ గా ఉంటాయి. వీటి ముక్కు కొంచెం పొడవుగా ఉంటుంది.

పగ్

పగ్

ఈ రకం కుక్కలకు కంపెనీని ఎంజాయ్ చేస్తాయి. ఇవి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉంటాయి. వీటి ముఖంలో ఆధిపత్య ధోరణి కనిపిస్తుంది. వీటి తోక కర్లీ గా ఉంటుంది. నిగనిగలాడే బొచ్చు వీటి సొంతం. ఇవి వివిధ రంగులలో లభిస్తాయి.

 ఇటాలియన్ గ్రే హౌండ్

ఇటాలియన్ గ్రే హౌండ్

పెంపుడు కుక్కలా గురించి చెప్పుకునేటప్పుడు ఇటాలియన్ గ్రే హౌండ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వీటిని చిన్నపాటి వేటకుక్కలుగా పరిగణించవచ్చు. వీటి పొట్ట తీర్చిదిద్దినట్టుగానుంటుంది. వీటి కళ్ళు సన్నగా, పొడవుగా ఉంటాయి.

బోస్టన్ టేరియర్

బోస్టన్ టేరియర్

వీటిని ఎక్కువగా అమెరికన్ జెంటిల్ మెన్ అని అంటారు. ఇవి స్నేహపూర్వకంగా ఉంటాయి. అప్పుడప్పుడూ మొండితనాన్ని కూడా ప్రదర్శిస్తాయి. వీటి చెవులు నిటారుగా ఉంటాయి. పొట్టి తోకలు కలిగి ఉంటాయి. వీటి సావాసాన్ని ఇష్టపడనివారుండరంటే అతిశయోక్తి కాదు.

English summary

Top 10 Lapdog Breeds

Lapdog breeds are a type of dogs that you will enjoy to cuddle, something that is willing to stay on your lap most of the time. These types of dogs are small in size and of course cute.
Story first published: Monday, December 8, 2014, 14:36 [IST]
Desktop Bottom Promotion