For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పిల్లి కంటే కక్కులే మేలు ఎందుకంటారూ...?

By Super
|

శునకాలు పిల్లుల కంటే మేలా లేక పిల్లులు శునకాల కంటే మేలా??ఈ చర్చ చాలాకాలం గా కొనసాగుతూనే ఉంది ,ఇకపై కూడా కొనసాగుతుంది.మనుష్యులందరి ఆలోచనలూ ఒకేలాగ ఉండకపోవడం వల్ల ఈ చర్చ కి అంతం ఉండదు.వీటిల్లో దేనిని పెంచుకోవాలనుకున్నా మనము ఎందుకు పెంచుకోవాలనుకుంటున్నాము, మన అవసరాలు, ఆలోచనలని బట్టి ఒక నిర్ణయానికి రావచ్చు.

కానీ కొన్ని కారణాలవల్ల పిల్లూ కంటే కుక్కలే ఒక మెట్టు ఎక్కువ.ఇలా ఎందుకు అన్నామో, కుక్కలు పిల్లుల కంటే మేలు అనడానికి గల వింత కారణాలు చూడండి.

అలా అని పిల్లులని తక్కువ చెయ్యడం మా ఉద్దేశ్యం కాదు.మీరు పెంచుకునే జంతువులో కొన్ని లక్షణాలు ఉండాలనుకుంటే మీరు ఒక నిర్ణాయానికొచ్చి, పిల్లుల కంటే కుక్కలు ఎందుకు మేలో చెప్తారు.

ఇంతకీ పిల్లుల కంటే కుక్కలే ఎందుకు నయం??మేము కింద పేర్కొన్న కారణాలు పిల్లులని ప్రేమించేవారికి వింతగా అనిపించవచ్చు. కానీ అవే కారణాల వల్ల శునక ప్రేమికులకి తమ శునకాలు మరింత ఆరాధ్యనీయం గా అనిపిస్తాయి.

ఆడుకోవడానికి తోడు:
మీరు పెంచుకునే జంతువుతో మీరు కనుక ఆడుకోవాలనుకుంటే పిల్లుల కంటే కుక్కలదే పై చేయి. ఎప్పుడైనా పిల్లులు తమ యజమానితో క్యాచింగ్ ఆడటం చూసారా?? కానీ కుక్కలు ఆడతాయి, యజమాని వాటితో ఆడుకోవడాన్ని ఆస్వాదిస్తాడు.పెద్దవారికైనా, పిల్లలకైనా శునకం ఒక మంచి నేస్తం.

నడకలో తోడు:

మీరు వాకింగ్ కి వెళ్ళాలనుకుంటున్నారు కానీ తోడు దొరకట్లేదా??మీ దగ్గర ఒక శునకం ఉంటే మీకు ఎవ్వరూ తోడు లేరు అన్న భావనే రాదు.శునకాలని రోజూ కాసేపు అలా బయట తిప్పడం అవసరం.మీరు కాసేపు అలా తిరిగొద్దామనుకుటే కూడా కుక్కలు సంతోషంగా అనుసరిస్తాయి.

వ్యాయామం:
పిల్లుల కంటే కుక్కలే మేలు అనడానికి ఇది ఒక వింత కారణం లా అనిపించినా కూడా ఇది నిజం.మీరు కనుక కుక్కని పెంచుకుంటోంటే దానిని రోజూ మీరు కాసేపు అలా బయటకి తీసుకెళ్ళాలి.అలా చెయ్యడం వల్ల మీకు కూడా వ్యాయామం అవుతుంది.కుక్కతో పాటు పరిగెత్తడం మాటలు కాదు. దాని వెనకాల పరిగెత్తడం వల్ల మీ ఆరోగ్యం మెరుగు పడటమే కాకుండా మీ సామర్ధ్యం కూడా పెరుగుతంది.

ముద్దాడటం:
పిల్లుల కంటే కుక్కలు మేలు అనడానికి గల వింత కారణాల్లో ఇదీ ఒకటి . తమ జంతువులని ముద్దు చేయాలి అనుకునే వారికి కుక్క ఒక మంచి ఎంపిక.శునకాల లాగ పిల్లులకి దగ్గరకి తీసి ముద్దాడటం, ప్రేమగా నిమరడం లాంటివి నచ్చవు.కానీ శునకాలు మాత్రం ఎప్పుడు ముద్దు చేద్దామన్నా తయారుగా ఉంటాయి.

రక్షణ:
మీ దగ్గర ఒక శునకం ఉంటే ఆటోమేటిక్ గా మీరు రక్షణలో ఉన్నారు అని మీకనిపిస్తుంది.ఏది ఏమైనా కానీ తన యజమానికి విశ్వాస పాత్రం గా ఉండి, యజమానిని రక్షిస్తూ ఉండే జంతువు ఏదంటే అది శునకమే.నిజం చెప్పాలంటే, చాలా మంది తల్లి తండ్రులు తమ పిల్లలకి ఇంట్లో శునకాన్ని తోడుగా ఉంచి వెళ్తుంటారు.శునకం కాపలా ఉంటే తమ పిల్లలకి రక్షణ అని వారికి తెలుసు.

విశ్వాసం:
ఏదైనా ఆపద వస్తే పిల్లి అయితే యజమానిని వదిలి ముందు తన రక్షణ చూసుకుంటుంది.కానీ శునకాలు అలా కాదు.ఎంత ఇబ్బంది లో నైనా అవి మీతోనే ఉండి అవసరమయితే సహాయపడతాయి కూడా.

కాపలాదారు
శునక యజమానులని అడగండి పిల్లుల కంటే శునకాలు ఎందుకు మేలు అని.వాళ్ళు చెప్పే సమాధానాలలో కుక్కలు కాపలాగా ఉంటాయి అని కూడా ఉంటుంది.మీరున్నా లేకపోయినా శునకం ఎప్పుడూ పహరా కాస్తూనే ఉంటుంది.మీకు సంబంధించిన వస్తువులన్నింటికీ సర్వకాల సర్వావస్థలలో

శునకం కాపలాగా ఉంటుంది
పైన చెప్పిన కారణాలు వింతగా అనిపించవచ్చు కానీ పిల్లు మేలా కుక్కలు మేలా అన్న చర్చ కి మాత్రం అంతం ఉండదు.ఇవే కారణాల వల్ల మార్జాల ప్రేమికులకి శునకాలు నచ్చకపోవచ్చు.పిల్లిని పెంచుకోవాలా లేక కుక్కనా శునకాన్న అనేది వ్యక్తిగత ఇష్టాన్ని బట్టి ఉంటుంది.

English summary

Strange Reasons Why Dogs Are Better Than Cats

Are dogs better than cats or is it vice versa? The debate has always been going on will continue to do so. There will never be an end to this because not all people think alike. It all depends upon the requirements and thoughts of a person and depending upon each one, the conclusion is drawn.
Story first published: Friday, October 16, 2015, 14:45 [IST]