For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గాయపడ్డ మీ కుక్క కోసం వెంటనే మీరు తీసుకోవల్సిన జాగ్రత్తలు

|

మనిషి లేదా జంతువుకు గాయం తగిలినప్పుడు రెండింటికి నొప్పి పుడుతుంది. గాయపడిన రెండింటిని నిర్వహించే పద్దతిలో తేడా ఉంటుంది. మనిషి మాటల్లో పరిస్థితిని వ్యక్తం చేస్తాడు. నొప్పి ప్రాంతం గురించి చెప్పుతాడు. ఒక జంతువు అలా కాదు. అందువల్ల రికవరీ అవటం కష్టం. ఒక జంతువును శిశువు వలె సంరక్షణ తీసుకోవాలి. మీరు ఒక పెంపుడు జంతువు కలిగి ఉన్నా లేదా గాయపడిన జంతువును చూసినా, అప్పుడు పరిస్థితిని అర్ధం చేసుకొని దాని ప్రకారం నడుచుకోవాలి.

చాలా మంది కుక్కను ఒక మంచి స్నేహితునిగా భావిస్తారు. దీనిని పెంచుకోవటానికి ఒక ఇష్టమైన ఎంపికగా ఉంటుంది. ఇంటిలో కుక్క ఉన్నప్పుడు కుక్క గాయపడితే ఎలా చూసుకోవాలో తెలుసుకోవాలి. కుక్క గాయం విషయంలో లేదా ఏ జంతువు గురించి అయినా, అన్ని భద్రతా చర్యలు కొనసాగిస్తూ జాగ్రత్త తీసుకోవలసిన అవసరం ఉందని గుర్తుంచుకోవాలి. గాయపడిన జంతువును సమీపించే సమయంలో అత్యంత ప్రాధమిక పెంపుడు సంరక్షణ చిట్కాలను చాలా ఖచ్చితమైన జాగ్రత్తతో తీసుకోవాలి. ఇక్కడ ఉన్న కొన్ని సాధారణ మరియు ప్రాథమిక పెంపుడు సంరక్షణ చిట్కాలను అనుసరించండి. మీరు పశువైద్యుడుని సందర్శించడానికి ముందు మీకు సహాయకారిగా ఉంటాయి.

Simple Pet Care Tips For An Injured Dog


మీ పశువైద్యుడుకి కాల్ చేయండి

మొట్టమొదట మీ పశువైద్యుడునికి కాల్ చేయండి. మీరు పరిస్థితిని వివరించడానికి మరియు వెంటనే తీసుకోవలసిన చర్యల మార్గదర్శకత్వం పొందవచ్చు. పశువైద్యుడు రావటానికి కొంత సమయం పట్టవచ్చు. ఆ సమయంలో దానిని అవసరమైన ప్రథమ చికిత్సను అందించటం అవసరం.

జాగ్రత్తగా అప్రోచ్ అవాలి

మీకు మీ పెంపుడు జంతువు మీద ఎంత ప్రేమ ఉన్నా మరియు ఒక జంతువు అని మర్చిపోకుండా ఎప్పటికి శ్రద్ద చూపాలి. ఈ నొప్పి సమయంలో జంతు ప్రవృత్తులు బయటకు వస్తాయి. మిమ్మల్ని గాయపరచే అవకాశం ఉంది. కాబట్టి సంరక్షణ విషయంలో చాలా జాగ్రత్తగా అప్రోచ్ అవాలి.

మీ పెంపుడు జంతువు మూతికి చిక్కము వేయుట
మీ కుక్కకు వాంతులు అవకపోతే, దాని మూతికి చిక్కము వేయుట అనేది ఒక తెలివైన ఎత్తుగడ అవుతుంది. ఒక జంతువు తన రక్షణ కోసం దాడి చేయటానికి సిద్దంగా ఉంటుంది. మీకు గాయం కాకుండా ఉండాలంటే, కుక్క మూతికి చిక్కము వేయాలి.

పెంపుడు జంతువును కౌగింలించకోకూడదు
మీకు మీ పెంపుడు జంతువు మీద ప్రేమ ఉంటుంది. కానీ అది గాయపడినప్పుడు కౌగింలించకోకూడదు.కుక్క గాయపడినప్పుడు, ఆ సమయంలో కొంత దూరంగా ఉండటం మంచిది. చాలా ముఖ్యంగా, పిల్లలను పెంపుడు జంతువులకు దూరంగా ఉంచాలి.

నెమ్మదిగా పరిశీలించాలి
ప్రారంభ జాగ్రత్తలు తీసుకున్న తరువాత గాయంను పరిశీలించాలి. మీకు చాలా ఓపిక మరియు జాగ్రత్త ఉండాలి. గాయపడిన ప్రాంతంను చాలా నెమ్మదిగా పరిశీలించాలి. మీరు మీ పెంపుడు జంతువు ఫీలింగ్ ను బట్టి పరీక్షలో పెరిగిన నొప్పిని కనుగొనవచ్చు. అలాంటి సమయాల్లో ఒక సహాయకుడు ఉండటం చాలా ఉత్తమం.

ఒక పెంపుడు క్యారియర్ కి అధిక ప్రాధాన్యతనివ్వండి
మీ పెంపుడు జంతువుకు గాయం ఎక్కువగా ఉన్నప్పుడు పశువైద్యుని దగ్గరకు తీసుకువెళ్ళటానికి క్యారియర్ ని ఉపయోగించండి. పెంపుడు జంతువుకు అసౌకర్యంగా ఉన్నా సరే జంతువుల కదలికలను నివారించేందుకు సహాయపడుతుంది.

చేతిలో మెడికల్ రికార్డులు ఉండాలి
సాదారణంగా పెంపుడు జంతువు యజమాని చేకప్స్ కొరకు పశువైద్యుని దగ్గరకు వెళ్ళవలసి ఉంటుంది. అన్ని మెడికల్ రికార్డులను ఒక చోట ఉంచితే తీసుకువెళ్లటం సులభం అవుతుంది. పశువైద్యుని వద్ద చెకప్ మరియు చికిత్స పూర్తి అయిన తర్వాత పెంపుడు జంతువును ఇంటికి తీసుకువచ్చిన తర్వాత మీరు సాధారణంగా కంటే కొద్దిగా ఎక్కువ కేర్ తీసుకోవాలి.

తగినంత ఆహారం ఇవ్వాలి
గాయపడిన కుక్కను చూసుకోవటానికి మీ పశువైద్యుడు చెప్పిన విధంగా ఆహారం ఇవ్వాలి. ఒక సమతుల్య ఆహారం సత్వర రికవరీ మరియు గాయపడిన కణాల వైద్యంలో బాగా సహాయపడుతుంది.

తగినంత ద్రవాలను ఇవ్వాలి
మూత్రపిండాలు సాధారణ కార్యాచరణ నిర్వహించడానికి ద్రవాలు తగినంత మొత్తంలో ఇవ్వటం ముఖ్యం. కుక్క యొక్క పరిమాణంను బట్టి అవసరమైన మొత్తం మారుతుంది. ఈ విషయంలో మీకు మీ పశువైద్యుడు మార్గనిర్దేశం చేస్తారు.

పూర్తిగా మెడిసిన్ కోర్సు ఇవ్వండి
డాక్టర్ ఇచ్చిన మోతాదు ప్రకారం మందులను పూర్తిగా ఇవ్వాలి. కోర్సు పూర్తి అయినదని నిర్ధారించుకోండి. కుక్క బాగుందని మధ్యలో మందులను ఆపకూడదు.

మీ పెంపుడు జంతువు యొక్క సంరక్షణ అనేది ఒక శిశువు వలే జాగ్రత్తగా ఉండాలి. మీరు అలవాట్లను మరియు సభ్యత ఏటువంటి చిన్న మార్పులు అయిన చాలా జాగ్రత్తగా మరియు అప్రమత్తంగా ఉండాలి. గాయపడిన కుక్క విషయంలో స్వల్ప ప్రావీణ్యంతో జాగ్రత్తగా చూసుకోవటానికి ప్రయత్నించాలి.

English summary

Simple Pet Care Tips For An Injured Dog

Be it man or animal, an injury causes pain to both. The difference lies in the manner in which both can manage that injured state. While man can express the condition in words, point out the areas of pain and understand that medicine is the means to recovery an animal cannot do so. An animal is like a baby that needs to be taken care of.
Story first published: Friday, January 16, 2015, 17:25 [IST]
Desktop Bottom Promotion