Latest Updates
-
జీర్ణ సమస్యలకు చెక్ పెట్టే సంజీవని..100% కల్తీ లేని త్రిఫల చూర్ణం ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
మీ ఇంట్లో బొద్దింకలు పదే పదే కనిపిస్తున్నాయా? అయితే ఈ దోషం ఉన్నట్లే! -
జంక్ ఫుడ్ వద్దు.. సాయంత్రం వేళ పిల్లల ఆరోగ్యానికి మేలు చేసే వేడివేడి సూప్ ఇదే! -
గ్రైండర్ అక్కర్లేదు..మిక్సీలో రుబ్బిన పిండితోనే పర్ఫెక్ట్ హోటల్ స్టైల్ మినప వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు వెనక నుంచి పిలిస్తే అపశకునమా? -
నీరసాన్ని తరిమికొట్టే పవర్ స్నాక్..పిల్లల జ్ఞాపకశక్తిని పెంచే డ్రై ఫ్రూట్ చిక్కీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
మేక పాలలోని ఈ రహస్యం మీకు తెలుసా? ఆ సమస్యకు ఇదే బెస్ట్! -
బరువు తగ్గాలా? షుగర్ కంట్రోల్ అవ్వాలా? ప్రోటీన్,ఐరన్ పుష్కలంగా ఉండే ఈ దోసె బ్రేక్ ఫాస్ట్ కి బెస్ట్! -
కర్కాటకంలో గురు సంచారం.. అక్టోబర్ వరకు స్టడీస్, కెరీర్లో ఈ రాశుల వారికి ఎనలేని భాగ్యం.! -
లంచ్ బాక్స్‌లోకి క్విక్‌గా చేసుకునేలా ‘గీ రైస్’.. ముస్లిం వెడ్డింగ్ స్టైల్లో ఇలా చేసేయండి.!
ఇంట్లో వాస్తు దోషం ఉంటే ఏం చేయాలి? దోషం పోవాలంటే ఏ దేవతను పూజించాలి?
హిందూ మతంలో వాస్తుశాస్త్రానికి చాలా ప్రాముఖ్యతను ఇస్తారు. అందుకు జ్యోతిష్యం కూడా చాలా ముఖ్యమైది. ఆవిధంగా మన దైనందిన జీవితంలో వివిధ దిశల్లో వాస్తు దోషాలు కూడా ఉన్నాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇంట్లో వాస్తు దోషం ఉంటే ఆ ఇంట్లో మనష్యులు అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటారు. వీటనినుండి బయటపడానికి ఏవేవో చేస్తుంటారు. కానీ ఇంట్లో వాస్తుదోషం ఉంటే జోతిష్యుల సహాయంతో ఆ ఇంట్లో ఏమూలలో ఏముంది,ఇల్లు కట్టేటప్పుడు సక్రమంగా కట్టారా లేదా అని తెలుసుకోవాలి. తర్వాత ఏదైనా దిశలో దోషం ఉంటే దాన్ని అధిగమించడానికి దిశను అనుసరించి వివిధ దేవుళ్లను పూజించాలనే నియమం ఉంది. ఆ దిశలో ఇలా పూజ చేయడం వల్ల దోషాలు తొలగిపోయి జీవితంలోని కష్టాలు తొలగిపోతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోండి.
జ్యోతిషశాస్త్రంలో వాస్తు శాస్త్రం ఒక ముఖ్యమైన శాఖగా పరిగణిస్తారు. ఈ వాస్తు శాస్త్రం భూమి, దిశలు మరియు శక్తి సూత్రాల ఆధారంగా పనిచేస్తుంది.ఒక ఇల్లు కట్టాలంటే దానికి సంబంధించిన అనేక విషయాలు శుభ మరియు అశుభ ఫలితాలు (ఆధ్యాత్మికం) గురించి తెలియజేస్తాయి.
ఇక వాస్తు శాస్త్రం ప్రకారం, ఏ ఇంట్లో వాస్తు దోషం ఉంటుందో, ఆ ఇంట్లో ప్రతికూల శక్తులు ఉంటాయని నమ్ముతారు. ఆ పరిస్థితిలో ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు జరగవు. పనిలో కార్యాలయాలలో అనవసర ఆటంకాలు ఎదురవుతాయి. వాస్తు శాస్త్రంలో, వివిధ దిశల వాస్తు దోషాలను తొలగించడానికి ఆయా వాస్తు ప్రకారం ఏఏ దేవుళ్ళను పూజించాలో ఇక్కడ తెలుసుకుందాం

తూర్పు దిశ: హిందూ మతంలో సూర్యుడు ఒక ప్రత్యేక దేవుడు, తూర్పు దిశకు అధిపతిగా పరిగణించబడ్డాడు. ఈ దిశలో వాస్తు దోషం ఉంటే ఉద్యోగ సమస్యలు, సమాజంలో గౌరవం పోతుంది. తండ్రికొడుకుల మధ్య విభేదాలు ఉంటాకి. కాబట్టి తూర్పు దిశలో వాస్తు దోషంను తొలగిలించుకోవడానికి, మీరు క్రమం తప్పకుండా సూర్యునికి అర్ఘ్యాన్ని సమర్పించాలి. అలాగే ఆదిత్య హృదయం స్తోత్రాన్ని పఠించాలి. అలాగే గాయత్రీ మంత్రాన్ని పఠించడం కూడా శ్రేయస్కరం.
పశ్చిమ దిశ: పశ్చిమ దిశకు శని అధిపతి. వాస్తు దోషం ఈ దిశలో ఉంటే, శని దేవుడు ఆ ఇంట్లో వారికి కష్టలు పెడతాడు. నిరంతరం ఇబ్బందులకు గురిచేస్తాడు. పచ్చిమ దిశలో దోషం తొలగిపోవాలంటే తొమ్మిది శనివారాలు శనీశ్వరుడిని పూజించాలి. ప్రతి శనివారం శనీశ్వరాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపారాదన చేయాలి. అలాగే రోజూ శని చాలీసా పఠించండి. త్వరలో ఉపమశనం పొందుతారు.
ఉత్తర దిశ: బుధుడిని ఉత్తర దిశకు అధిపతిగా పరిగణిస్తారు. ఈ దిశలో దోషం ఉన్నట్లైతే.. ఆర్థిక సమస్యలు, పనుల్లో ఆటంకాలు, పనులు వాయిదాలు వంటివి జరగుతుంటాయి. వీటిని పోగొట్టుకోవడానికి ఇంట్లో బుధ యంత్రాన్ని ఏర్పాటుచేసుకుని పూజించాలి.అలాగో రోజూ లేదా బుధవారం నాడు వినాయకుడిని ఎర్రమందార పువ్వులతో పూజించండి.
దక్షిణ దశ: ఈ దిశకు అంగారకుడు అధిపతి. ఈ దిశకు అంగారకుడిని గ్రహాల యమరాజుగా భావిస్తారు. దక్షిణ దిశలో దోషం ఉన్నట్లయితే, ఇంట్లో వారికి శాస్తి, ఆనందం, సంతోషం అనేవి ఉండవు. ఎప్పుడూ రుసరుసలాడుతూ కోపతాపాలతో ఉంటారు. కుటుంబంలో ఎప్పుడూ సభ్యుల మధ్య పరస్పర వివాదాలు తలెత్తుతాయి. దక్షిణ దిశలో వాస్తు దోషం పోగొట్టుకోవడానికి హనుమంతుడిని క్రమం తప్పకుండా పూజించండి.

ఈశాన్య దిశ: వాస్తు శాస్త్రంలో ఈ దిశ చాలా ముఖ్యమైనది. ఈశాన్య పాలించే గ్రహం బృహస్పతి, శివుడు అధిష్టానం.తూర్పు మరియు ఉత్తరం మధ్య దిశ ఈశాన్య దిశ ఉంటుంది. ఈ దిశలో వాస్తు దోషాలు ఉంటే వైవాహిక జీవితంలో సమస్యలు ఏర్పడతాయి. దంపతుల మధ్య గొడవలు, పెళ్లికానివారికి ఆలస్యం. ప్రేమలో బ్రేకప్ లు ఉంటాయి. అటువంటి పరిస్థితిలో శివుడు పార్వతిని పూజించాలి. ఈశాన్య దిశను శుభ్రంగా ఉంచుకోవాలి.
ఆగ్నేయ దిశ: తూర్పు మరియు దక్షిణం మధ్య దిశ ఆగ్నేయ దిశ. ఈ దిశకు శుక్రుడు దేవుడు. ఆగ్నేయం అగ్నికి మూలం. ఈ దిశలో వాస్తు దోషాలు ఇంట్లో సుఖశాంతలు ఉండవు, ప్రేమ సంబంధాలు వంటి సమస్యలు వస్తాయి. లక్ష్మీదేవిని పూజిస్తే ఆ దోషాలు తొలగిపోతాయి.
నైరుతి దిశ: పశ్చిమం మరియు దక్షిణం మధ్య ఉండే దిశను నైరుతి దిశ అంటారు. ఈ దిశకు అధిపతి నివృత్తి అనే రాక్షసుడు. అంటే రాహువు మరియు కేతువులకు సంబంధించినది. ఈ దిశలో దోషాలు ఉంటే ఆర్థిక, వ్యాపార సమస్యలు, ధనసమస్యలు ఉంటాయి. దోషాన్ని పోగొట్టుకోవడానికి, ప్రతిరోజూ శివునికి నీటిని సమర్పించండి మరియు రాహు-కేతు దోషాలను తొలగించడానికి నవాధ్యాలతో నవగ్రాలను పూజించండి. అలాగే నవ ధాన్యంను దానం చేయండి.
వాయువ్య దిశ: ఉత్తరం మరియు పడమర దిశల మధ్య ఉండే దిశను వాయువ్య దిశ అంటారు. చంద్రుడు ఈ దిశకు అధిపతి. ఈ దిశలో వాస్తు దోషాలు ఉంటే ఆ ఇంట్లో వారికి ఒత్తిడి, జలుబు, మానసిక సమస్యలు, పునరుత్పత్తి సమస్యలను కలిగిస్తాయి. దీని నుండి విముక్తి పొందడానికి చంద్ర మంత్రాన్ని జపించి, శ్రీమహా విష్ణువు, శివుడిని పూజించండి.



Click it and Unblock the Notifications