కర్కాటకంలో గురు సంచారం.. అక్టోబర్‌ వరకు స్టడీస్‌, కెరీర్‌లో ఈ రాశుల వారికి ఎనలేని భాగ్యం.!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అదృష్టం, జ్ఞానం, విజయం, పురోగతికి గురుగ్రహం అధిపతి. అందుకే వృత్తిపరంగా మీరు సాధించే విజయాల్లో ఈ గ్రహ ప్రభావం ఉంటుంది. గురు సంచారం పలు రాశుల వారి జీవితాల్లో కీలక రంగాలపై ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రస్తుతం ఈ గ్రహం కర్కాటక రాశిలో ఉండగా.. ఈ పరిణామమం మరింత శక్తివంతంగా, శుభప్రదమైనదిగా పండితులు చెబుతున్నారు. ఈ రాశిలోనే అక్టోబర్‌ 31 వరకు దేవ గ్రహం కొనసాగుతుండటంతో పలు రాశుల వారికి కొత్త అవకాశాలను ఇవ్వడంతో పాటు అదృష్టం కూడా మరింత బలపడేలా చేస్తుంది. మరి ఇంతటి భాగ్యం ఏ రాశుల వారిని వరించనుంది.. తెలుసుకుందాం..

Jupiter in Cancer good time to these zodiac signs careers until October 31st

కర్కాటక రాశి

కర్కాటక రాశిలోనే గురు గ్రహం ఉండటంతో ఈ రాశిచక్రం వారిపై అక్టోబర్‌ వరకు మరింత ప్రభావవంతంగా, ప్రయోజనకరంగా ఉండనుంది. ఆర్థికంగా పుంజుకునే అవకాశాలు వస్తాయి. మీరు కోరుకున్న రంగంలో ఉద్యోగం సాధించే సూచనలు ఉన్నాయి. అంతేకాకుండా మానసికంగా ఉన్న ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. కీలకమైన ప్రాజెక్టులో విజయం సాధిస్తారు. విద్యార్థులు తమ ప్రతిభతో మంచి ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగంలో మీ కష్టానికి తగిన ప్రతిఫలంతో పాటు ప్రమోషన్లు పొందే అవకాశం ఉంది.

Jupiter in Cancer good time to these zodiac signs careers until October 31st

ధనుస్సు రాశి

కర్కాటక రాశిలో గురు గ్రహ సంచారం.. ధనుస్సు రాశి వారిపై మంచి ప్రభావం చూపించనుంది. సమాజంలో గౌరవం, ప్రతిష్ఠ పెరుగుతాయి. చేస్తున్న పనిలో మీ శ్రమకి తగిన ప్రతిఫలం అంటే విజయం అందుకుంటారు. ఉద్యోగంలో, వ్యాపారంలో ఉన్నవారు మీ కష్టానికి తగిన గుర్తింపు, లాభాలు అందుకుంటారు. పని చేస్తున్న చోట మీ ప్రతిభకు ప్రశంసలు అందుతాయి. వృత్తిపరంగా పురోగతి పొందే అవకాశాలు ఉన్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు, విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదువుతూ కష్టపడినట్లయితే ఉత్తమ ఫలితాలు అందుకోవచ్చు.

మీన రాశి

అక్టోబర్‌ 31 వరకు మీన రాశి వారికి అన్ని విధాలుగా, అన్ని రంగాల్లో శుభప్రదంగా ఉండనుంది. ఆర్థికంగా ఆశాజనకమైన లాభాలు అందుకుంటారు. ప్రత్యేక బహుమతితో కుటుంబీకులకు సర్‌ప్రైజ్‌ అందించే అవకాశం ఉంది. దీంతో ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నిండిపోతుంది. మీరు చేస్తున్న ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాల్లో అదృష్టం మీకు కలిసి రానుంది. ఫలితంగా విజయం మిమ్మల్ని వరించే సూచనలు ఉన్నాయి. ఆర్థికపరమైన విషయాలు మెరుగుపడటంతో మనశ్శాంతిగా ఉంటారు. ఉద్యోగం చేస్తున్న అందుకు సంబంధించి ప్రమోషన్‌ లేదా అదనపు బాధ్యతల పరంగా గుడ్‌న్యూస్‌ అందుకోవచ్చు. వృత్తిపరంగా సానుకూల మార్పులతో కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయ అవకాశాలు అందుకుంటారు. చేస్తున్న ఉద్యోగంలో జీతం పెంపుదల ఉండొచ్చు.

Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.

Story first published: Saturday, August 22, 2026, 5:31 [IST]
Desktop Bottom Promotion