Latest Updates
-
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.!
గ్యాస్ లీకయితే ఏమి చేయాలి..? సిలిండకు మంట అంటుకుంటే చేయాల్సిన పని..!
ఇంట్లో గ్యాస్ లీకయితే చాలా ప్రమాదం. గ్యాస్ లీకయినా పట్టించుకోకపోతే సిలిండర్ పేలి తీవ్ర ప్రాణనష్టం జరిగే అవకాశం వుంది. ఎప్పుడూ అప్రమత్తంగా వుంటే గ్యాస్ లీకయినా సరే పెద్ద ప్రమాదం నుంచి సులభంగా తప్పించుకోవచ్చు. గ్యాస్ లీకయిందని ఎలా తెలుసుకోవాలి ? గ్యాస్ లీకయితే ఏమి చేయాలి ? లీకయిన గ్యాస్ బ్లాస్ట్ కాకుండా వుండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విషయాలన్నింటినీ మీకు తెలియజేస్తున్నాం.
బాత్ రూంలో గీజర్ ఆన్ వుండడం అప్పుడే గ్యాస్ లీకవడంతో ఒక దుర్ఘటనలో భార్యా భర్తలిద్దరూ మరణించారు. కాబట్టి చాలా అప్రమత్తంగా వుండాలి.

గ్యాస్ లీకయిందని ఇలా తెలుసుకోండి
గ్యాస్ లీకయిందని మీరు తెలుసుకోవాలంటే మీకు గ్యాస్ లీకవుతున్న శబ్దం వస్తుంది. పాము బుస్ మని ఎలాగైతే శబ్దం చేస్తుదో మీకు కూడా అలాంటి శబ్దమే వినబడుతుంది.
గ్యాస్ బాగా లీకయితే గుడ్లు కుల్లిపోయినట్లుగా వాసన వస్తుంది. ఇంట్లో మొక్కలు వుంటే అవి వాడిపోయవడం, వంగిపోవడాన్ని చూస్తాము. కొంతమందిలో తలనొప్పి, వికారం, ఊపిరి ఆడకపోవడం, వాంతులు కూడా అవుతాయ్. గ్యాస్ లీకయితే ముందుగా చేయవలసిన పనులేంటో తెలుసుకుందాం.
గ్యాస్ లీకయితే వెంటనే ఇలా చేయండి
గ్యాస్ లీకయినట్టు మీకనిపిస్తే గ్యాస్‌కు వున్న రెగులేటర్‌ను ఆఫ్ చేయాలి. ఇంట్లో వున్న అన్ని కిటికీలను, డోర్లను తెరిచిపెట్టాలి. వెంటనే గ్యాస్‌కు సంబంధించిన వారిని, ఫైర్ సిబ్బందిని కాల్ చేసి పిలవాలి. మీరు, మీ తోటి వారు ఇంట్లోంచి వెళ్లిపోవడం కూడా చాలా అత్యవసరం, ముఖ్యం కూడా.
గ్యాస్ లీకయితే ఈ పనులను అస్సలు చేయవద్దు
గ్యాస్ లీక్ కాగానే గ్యాస్ ఎక్కడి నుంచి లీకవుతుందో తెలుసుకొనే ప్రయత్నం చేయవద్దు, ఒక వేల తెలిసినా దానిని రిపేర్ చేసే ప్రయత్నం చేయవద్దు. గ్యాస్ లీకయిందని తెలియగానే ఇంట్లో లైట్లు, ఫ్యాన్లు ఇతర ఏ ఎలక్ట్రిక్‌కు సంబంధించినవి కూడా ఆన్, ఆఫ్ చేయవద్దు.
ఇంట్లో మొబైల్ ఫోన్‌ను కూడా ఉపయోగించవద్దు. ఎందకంటే మొబైల్‌లో కూడా కరెంట్ వుంటుంది. గ్యాస్ మొబైల్ ద్వారా బ్లాస్ట్ అయ్యే అవకాశం వుంది. ఎమర్జెన్సీకి కాల్ చేయవలసిన అవసరం వస్తే, ఇంటి బయటికి వెళ్లి కాల్ చేయాలి. అగ్గిపెట్టతో వెలిగించడం, లైటర్లను ఉపయోగించడం అస్సలు చేయకూడదు. ఈ నియమాలను తప్పితే చాలా ప్రమాదం.
గ్యాస్ సిలిండర్‌కు మంటలు అంటుకుంటే ఇలా చేయండి
గ్యాస్ సిలిండర్‌కు మంటలు అంటుకుంటే మీరు చేయగలరని అనిపిస్తేనే ఈ చిట్కాను ఫాలో అవ్వాలి. లేదంటే వెంటనే ఇంట్లో వాళ్లను వెంటతీసుకొని బయటకు వెళ్లిపోయి ఎమర్జెన్సీకి కాల్ చేయాలి. ఒక వేల మీరు చేయగలరని అనుకుంటే మీ వెంట వున్నవారికి బయటకు వెళ్లమని చెప్పి, ఇంట్లో వున్న బ్లాంకెట్‌ను నీళ్లల్లో ముంచాలి. ముంచి దాన్ని గ్యాస్ నాబ్‌కు మొత్తం చుట్టేసేయాలి. ఇలా చేసినప్పుడు గ్యాస్ నుంచి మంటలు వెంటనే ఆగిపోతయ్. తరువాత వెంటనే గ్యాస్ నాబ్‌ను ఆఫ్ చేయాలి.

ప్రమాదవశాత్తు ఇంట్లో మంటలను ఆర్పడానికి ఒక కార్బన్‌డైఆక్సైడ్ సిలిండర్‌ను పెట్టుకుంటే గ్యాస్ సిలిండర్‌కు మంటలను వచ్చినప్పుడు ఇది ఆన్ చేస్తే వెంటనే మంటలు ఆరిపోతయ్. మంటలు ఆరిపోయినా వెంటనే గ్యాస్ నాబ్‌ను ఆఫ్ చేయడం మరిచిపోవద్దు.



Click it and Unblock the Notifications
