Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి!
కష్టాలను ఎదిరించి విజయం సాధించడమంటే ఇదే..ఈ మహిళా క్యాబ్ డ్రైవర్ ఎందరికో ఆదర్శం
ఆమె పేరు ధనలక్ష్మీ. నల్గొండ జిల్లా నుంచి బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చారు. భర్త, ముగ్గురు పిల్లలలో హాయిగా సాగిపోతున్న కాపురంలో పెద్ద కష్టం వచ్చింది. కుమారుడికి హెల్త్ ప్రాబ్లమ్ ఉందని డాక్టర్లు చెప్పిన మాట ధనలక్ష్మీ కుటుంబాన్ని తీవ్రంగా బాధించింది. అంతేకాకుండా తన కుమారుడి సమస్య తీరిపోవాలంటే ట్రీట్మెంట్ కు భారీగా ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పిన మాటతో ధనలక్ష్మీ దంపతుల్లో భయం మొదలైంది. అయితే మెల్లగా ఆలోచన తోడైంది. కుటుంబం కోసం, కుమారుడి ఆరోగ్యం కోసం ఆమె చేస్తున్న పని ఇప్పుడు ప్రశంసలందుకోవడమే కాకుండా కొన్ని లక్షల మంది మహిళలకు ప్రేరణగా నిలిచింది. కష్టాలను ఎదిరించి విజయం సాధించడమంటే ఇదా కాక ఇంకేముంటదని అని అందరూ ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
ప్రతి ఏటా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రంగం ఆ రంగం అని తేడా లేకుండా అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారు. అయితే ఈ ఏడాది అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా క్యాబ్ డ్రైవర్ గా,బిజినెస్ ఉమెన్ గా రాణిస్తున్న ధనలక్ష్మీ మహిళలకు ప్రేరణగా నిలిచే అనేక విషయాలను బోల్డ్ స్కై తెలుగుతో పంచుకున్నారు. ఆమె ఏం చెప్పిందో ఇక్కడ చూడండి.

సెక్యూరిటీ గార్డుగా మొదలుపెట్టి క్యాబ్ డ్రైవర్ గా
హైదరాబాద్ లో ధనలక్ష్మీ అనే మహిళ క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తోంది. ధనలక్ష్మీ సొంతూరూ నల్లొండ జిల్లాలోని జూముకుల గ్రామం. ఊర్లో సరిగ్గా పనులు లేకపోవడంతో బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చినట్లు చెప్పిన ధనలక్ష్మీ..మొదట్లో తాను రెయిన్ బో హాస్పిటల్ లో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేసినట్లు చెప్పింది. అయితే తనకు అప్పటికే ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారని చెప్పిన ధనలక్ష్మీ..సెక్యూరిటీ గార్డుగా 12 గంటల డ్యూటీ ఉండటంతో పిల్లలను చూసుకోవడం ఇబ్బందిగా మారి ఆ జాబ్ వదిలేసి మోటర్ పీల్డ్ లోకి వచ్చినట్లు చెప్పింది. తన భర్త సహకారంతో డ్రైవింగ్ నేర్చుకున్నట్లు చెప్పింది.
లాంగ్ డ్రైవ్ లు, లేట్ నైట్స్
డ్రైవింగ్ ఫీల్డ్ అన్నాక లేట్ నైట్ లు, లాంగ్ డ్రైవ్ లు అన్నీ ఉంటాయని తనకు ముందే తెలుసని, అయితే భయపడుతూ కూర్చుంటే సమాజంలో బతకలేమని ధనలక్ష్మీ చెప్పింది. కష్టమొస్తో ఆదుకోడానికి ఎవరూ ఉండరని, కాబట్టి మనకు మనమే కష్టపడి సంపాదించుకోవాలని ఆమె అన్నారు. కేవలం తన కుటుంబ కష్టాలు, కుమారుడి ట్రీట్మెంట్ ఖర్చుల కోసమే 2010లోనే కారు డ్రైవింగ్ నేర్చుకుని, అయితే క్యాబ్ డ్రైవర్ గా ఈ ఫీల్డ్ లోకి వచ్చి ఐదేళ్లు అవుతుందని చెప్పింది.
లాక్ డౌన్ కష్టాల్లో ఆమె దేవతలా
తాము కొత్తగా కారు కొన్ని నెల రోజులకే కరోనా వచ్చి లాక్ డౌన్ అయిందని ధనలక్ష్మీ చెప్పారు. ఆ సమయంలో ఈఎంఐలు కట్టలేక ఇబ్బందులు పడుతుంటే దివ్య అనే ఓ ప్రభుత్వ అధికారిణి తమకు సహాయం చేశారని, ఆ మేడం ఆఫీసులోనే తమ కారుని హైయర్ వెహికల్ కింద పెట్టి తమకు ఉపాధి కూడా కల్పించినట్లు ధనలక్ష్మీ చెప్పారు.
ఓ రాత్రి బాగా ఇబ్బంది
తన మోటర్ ఫీల్డ్ కెరీర్ లో ఒక్కసారి మాత్రం ఇబ్బంది ఎదుర్కొన్నానని, ఒక రోజు రాత్రి 9: 30 గంటల సమయంలో ఓ వ్యక్తి తాగి తన కారులో ముందు సీట్లో ఎక్కి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, తనపై చేతులు వేస్తూ,బూతులు మాట్లాడటం స్టార్ట్ చేశాడని చెప్పింది. అయితే మొదట్లోనే అతడిని దించేద్దాం అనుకున్నప్పటికీ అతనితో పాటు ఓ బాబు, మహిళ కూడా కారు ఎక్కారని,రాత్రి పూట ఫ్యామిలీతో ఇబ్బంది పడతాడేమో అని జాలితో అతడు తాగి ఉన్నాడని తెలిసినా కారు ఎక్కించుకున్నట్లు ధనలక్ష్మీ చెప్పింది. అతడు చెప్పినా తన ప్రవర్తన మార్చుకోకపోవడంతో పోలీసులకు కాల్ చేసి అతడిని పట్టించానని,అతడి మీద కేసు కూడా పెట్టినట్లు ధనలక్ష్మీ తెలిపింది.
హాస్టల్ కూడా
తాను, తన భర్త కలిసి ఓ హాస్టల్ కూడా రన్ చేస్తున్నట్లు ధనలక్ష్మీ చెప్పింది. తమ హాస్టల్ లో 50 మంది పిల్లలు ఉన్నారని, వారికి బ్రేక్ ఫాస్ట్,లంచ్, డిన్నర్ కూడా అన్నీ తానే రెడీ చేస్తానని, గ్యాప్ దొరకగానే క్యాబ్ డ్రైవర్ గా మారిపోతానని ధనలక్ష్మీ చెప్పింది. తన భర్త తనకు చాలా అండగా ఉంటాడని, ఆయన లేకుంటే ఇదంతా అసాధ్యమని ధనలక్ష్మీ చెప్పింది. తన కుటుంబ కష్టాలు తీరాలంటే నాలుగు పైసలు సంపాదించుకోవాలని, అందుకోసమే ఇంత కష్టపడుతున్నట్లు చెప్పింది.
కుటుంబసభ్యులు కూడా
తన తల్లి,భర్త, పిల్లలు,ఇతర కుటుంబ సభ్యులందరూ తనకు ఫుల్ సపోర్ట్ చేస్తారని, నీ ధైర్యానికి మెచ్చుకోవాలి,మొగోడి కంటే ఎక్కువ కష్టపడతావ్ అంటూ తనతో అంటారని ధనలక్ష్మీ చెప్పింది. తన భర్త కూడా ఎవరి మాటలను పట్టించుకోడని, తనకే ఫుల్ సపోర్ట్ గా ఉంటాడని చెప్పింది.
ధనలక్ష్మీ సందేశం ఇదే
క్యాబ్ డ్రైవర్ గా పనిచేయాలంటే చాలామంది మహిళలు భయపడుతుంటారని, అయితే భయపడుతూ ఉంటే వంటింటికే అంకితం అవ్వాల్సి వస్తుందని, ఉన్నతశిఖరాలకు చేరుకోలేమని ధనలక్ష్మీ మహిళలకు సందేశమిచ్చారు. ఇప్పుడు మహిళలు రాత్రిపూట కూడా స్వేఛ్చగా తిరిగే పరిస్థితులు ఉన్నాయని,మనసు మంచిగా ఉంటే ఏ పని చేసినా సంతోషాన్నిస్తుందని ఆమె చెప్పారు. తనను ప్రేరణగా తీసుకొని మరో అమ్మాయి కూడా క్యాబ్ నడిపిస్తుందని, ఇంకా ఎవరైనా ఈ ఫీల్డ్ మీద ఇష్టం ఉంది రావాలనుకుంటే సంతోషంగా రావచ్చని, వారికి ఏవైనా సలహాలు,సూచనలు కావాలంటే చేస్తానని ధనలక్ష్మీ చెప్పారు.



Click it and Unblock the Notifications











