Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
హాః హాః హాః అంటూ నవ్వండి ఆరోగ్యంగా ఉండండి..!
నవ్వు నాలుగు విధాల మేలు అనేది నాటి మాటయితే, నవ్వు నలభై విధాల గ్రేటు అనేది నేటి నినాదం. రోజు హాయిగా నవ్వే వారు రోగాలకు బారిన పడకుండా ఉంటారనేది జగమెరిగిన సత్యం. మనసారా నవ్వుకునే వారికి వైద్యుడికి దగ్గర వెళ్ళాల్సిన సందర్భాలు తక్కువగా వస్తాయి. అన్నింటా వేగమే చెలామణి అవుతున్న గ్లోబల్ ప్రపంచంలో మనిషి దరహాసానికి దూరమవుతున్నాడు. చిరునవ్వుకు కూడా సమయం చిక్కనంత బిజీగా గడుపుతున్నాడు. ముఖ్యంగా నగరజీవులు నవ్వడమే మర్చిపోతున్నారు.
హాస్యయోగా, నవ్వు, లాఫింగ్ క్లబ్, లాఫింగ్ ఎక్సర్ సైజ్ యోగా బ్రీతింగ్, ఇటువంటి వారి కోసం నగరాల్లో లాఫీంగ్ క్లబ్సులు వెలిశాయి. మొదట నవ్వు కోవడానికే పరిమితమయిన ఈ క్లబ్బులు కాలానుగుణం మార్పులు చెందాలయి. ఇప్పుడు ఎక్కువగా హాస్య యోగా చేస్తున్నారు. ఇందులో జోక్స్ వేసి నవ్వించడం ఉండదు. యోగా బ్రీతింగ్ తో పాటు లాఫింగ్ ఎక్సర్ సైజ్ చేయడం దీని ప్రత్యేకత. మనదేశంలోని ప్రధాన నగరాల్లో ఇప్పుడు హాస్య యోగా బాగా ప్రాచుర్యం పొందింది. రోజుకు కనీసం 15 నుండి 20నిముషాలు హాస్య యోగా చేస్తే అనారోగ్యం దూరమవడమే కాకుండా మానసిక స్వాంతన కలుగుతుందంటున్నారు నిపుణులు.

మెట్రో నగరాల్లో జీవించే వారిలో అత్యధిక శాతం మందికి ఒత్తిడితో కూడిన జీవితం గడుపుతున్నారు. ఉద్యోగ జీవితం పోటీ వాతావరణం, ట్రాఫిక్ రద్దీ వంటి సమస్యలతో నగర ప్రజలు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇలా పరిస్థితుల్లో మనుషులు నవ్వుకు దూరమవుతున్నారు. నవ్వు కూడా ఒక వ్యాయామమే అన్న సంగతి మర్చిపోతున్నారు. అసలు చిన్న పిల్లల్లా మనసారా నవ్వుకుంటే ఒత్తిడి దూది పింజల ఎగిరిపోతుందని నిపుణులు సలహాఇస్తున్నారు. ఇలా నవ్వలేని వారు హాస్య యోగాను ఆశ్రయిస్తున్నారు.
హాస్య యోగాతో మానసిక ఒత్తిడి దూరమవడమే కాకుండా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని హాస్య యోగా నిపుణులు తెలుపుతున్నారు. మనసారా నవ్వితే ముఖ కండరాలకు వ్యాయామం అవుతుందిని, దీంతో ముఖవర్చసు ద్విగుణీకృతం అవుతందంటున్నారు. ముఖ్యంగా అందరితో కలిసి హాస్య యోగా చేయడం వల్ల దేహం నుంచి కొన్ని రకాల రసాయనాలు విడుదలయి ఒత్తిడి తొలగిపోతుందని వివరించారు. నవ్వుతో మానసిక ఒత్తిడి తగ్గడమే కాకుండా, రోగాలు నయమవుతాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా కూడా హాస్య యోగాకు ఆదరణ పెరుగుతోంది. అయితే, హాస్య యోగాతో వ్యాధులు పూర్తిగా నయమైపోవని, తగిన వైద్య చికిత్స కూడా అవసరం. హాయిగా నవ్వే వారికిలో ఆరోగ్య సమస్యలు తక్కువగా ఉంటాయి. మరి ఇంకేందుకు ఆలస్యం. హా హా హా అంటూ నవ్వండి ఆరోగ్యంగా ఉండండి...



Click it and Unblock the Notifications