Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
అంతరాత్మ వెలుగు నమ్మండి!

ఒక చీకటి రోజున, ప్రమాదకరమైన ఒక పర్వత మార్గంలో వెలుగు ఆధారం లేకుండా తన శిష్యుడిని ప్రయాణించమంటాడు. నీలో వున్న మార్గదర్శిపై నీకు నమ్మకం వుంటే, ప్రయాణించు అని ఆదేశిస్తాడు. అది ఒక పర్వత ప్రాంతం. ఎన్నో చెట్లు, పొదలు, ఎత్తుపల్లాలు వున్నాయి. శిష్యుడు ఎక్కడైనా సరే దోవలో పడిపోవచ్చు. అపాయానికి గురికావచ్చు. ఆ మార్గంలో పగటి పూటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మరి చీకటి రాత్రిలో మరింత కష్టం. అతని కంటికి ఏమీ కనిపించటంలేదు. కాని తన మాస్టర్ ఆదోవలో నడవటం కాదు...పరుగెత్తు అని ఆదేశించాడు. శిష్యుడికి భయం వేసింది.
కాని మాస్టర్ పరుగుపెట్టాడు. ఒక క్రూర మృగం వలే పరుగు పెట్టాడు. అంతేకాదు పరుగెట్టుకుంటూ వెనక్కు కూడా వచ్చేశాడు. కాని శిష్యుడు కాస్టనేడాకు తన గురువు ఎలా చేశాడీ చర్య అనేది అర్ధం కాలేదు. చీకటిలో పరుగు పెట్టటమే కాదు మరల సరిగ్గా తన వద్దకే ఎలా రాగలిగాడు? మెల్లగా కేస్టనేడా ధైర్యం కూడగట్టుకున్నాడు. అంత ముసలి గురువే చేసినపుడు తాను చేయలేనా అనుకున్నాడు. పరుగు పెట్టటం ప్రయత్నించాడు. క్రమేణా అతనిలోని అంతర్ వెలుగు ప్రసరించింది. పరుగు ప్రారంభించాడు.
మీరు ఆలోచన అక్కడే ఆపితే, అక్కడే వుండిపోతారు. ఆలోచన ఆపి లోపలికి చూడండి. అంతరంగంలోని అంతరాత్మ తెరుచుకుంటుంది. అంతా సవ్యంగా సాగుతుందని మీరు ఆలోచించకపోతే, అంతరాత్మ నడిపిస్తుందని భావించకపోతే, మీ తర్కం లేదా అనవసర అనుమానాలు మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తాయి. అన్నిటికంటే పెద్ద తప్పు దోవ అంటే, మీ అంతరాత్మను మీరు నమ్మకపోవటమే. కనుక అంతరాత్మను నమ్ముకోండి. అదే మిమ్మల్ని సవ్యమైన మార్గంలో నడిపిస్తుంది.



Click it and Unblock the Notifications