Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
చాణక్య నీతి ప్రకారం ఈ లక్షణాలు ఎవరి జీవితాన్నైనా ఇట్టే మార్చేస్తాయి, అవేంటంటే..
ఎవరైనా విజయం సాధించాలంటే కొన్ని లక్షణాలు ఉండాలని చాణక్యుడు చెప్పాడు. ఆ లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆచార్య చాణక్యుడు అపర మేధావి. గొప్ప జ్ఞాని. ప్రస్తుత కాలంలో అలాంటి మేధావిని కనుక్కోవడం దాదాపు అసాధ్యం. భారతదేశ చరిత్రలో చాణక్యుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఆయన చెప్పిన సూక్తులు, నియమాలు, వ్యూహాలు పాటిస్తే ఏ వ్యక్తి అయినా విజయవంతం కాగలరు. చాణక్యుడు అర్థశాస్త్రాన్ని, చాణక్య నీతి వంటి పుస్తకాలు రాశాడు.

తన రచనల్లో పేర్కొన్న చాలా అంశాలు ఇప్పటికీ వర్తిస్తున్నాయంటే చాణక్యుడి ముందుచూపు ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా విజయం సాధించాలంటే కొన్ని లక్షణాలు ఉండాలని చాణక్యుడు చెప్పాడు. ఆ లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

పశ్చాత్తాపం:
విజయవంతమైన వ్యక్తిని ఇతరుల నుండి వేరు చేసేది పశ్చాత్తాపం పడకపోవడం. తాము తీసుకున్న నిర్ణయాలకు ఏమాత్రం పశ్చాత్తాపం చెందకుండా ముందుకు సాగేవాడే జీవితంలో విజయం సాధిస్తాడు. తప్పు చేశాం అంటూ అదే ఆలోచనల్లో మునిగిపోయే వాడు ఎప్పటికీ విజయం సాధించలేడు.
గతంలో తప్పులు చేసి ఉంటే దాని గురించి ఆలోచించడం వల్ల వచ్చేది ఏమీ లేదు. మానసిక ప్రశాంతత దూరమవుతుంది. దానికి బదులు ఆ తప్పుల నుండి ఏదైనా నేర్చుకుంటే అవి జీవితానికి ఉపయోగపడతాయి.

తప్పుడు మార్గంలో డబ్బు సంపాదన :
మోసం చేసిన సంపాదించిన డబ్బు లేదంటే విలువలను, జీవిత సూత్రాలను త్యాగం చేసి సంపాదించిన డబ్బు ఎప్పటికైనా విషంతో సమానమని చాణక్యుడు చెబుతాడు. ఇలా సంపాదించిన డబ్బు మొదట్లో రుచిగా ఉన్నప్పటికీ చివరికి పాతాళానికి తొక్కేస్తుంది. కాబట్టి తప్పుడు మార్గాల ద్వారా సంపాదించిన అధికారాన్ని, డబ్బులు ఆశించకూడదు.

3 ప్రశ్నలు వేసుకోవాలి:
ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు, మనసులో మాట చెప్పే ముందు వాటి గురించి లోతుగా ఆలోచించడం చాలా ముఖ్యం. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, ఏ మాట మాట్లాడాలన్నా దాని గురించి 3 ప్రశ్నలు వేసుకోవాలని అంటాడు చాణక్యుడు. నేనం చేయాలి? ఫలితం ఎలా ఉంటుంది? దాని విలువ ఎంత? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి.
మనం మాట్లాడే ప్రతి మాట, తీసుకున్న ప్రతి నిర్ణయం మన జీవితంపై ప్రభావం చూపిస్తుంది. కొన్ని నిర్ణయాలు ఇతరులపై కూడా ప్రభావం చూపిస్తాయిం. అందుకే ఏదైనా చేసే ముందు ఆలోచించాలి.

మనసులో మాట ముఖంలో కనిపించకూడదు:
మనసులో ఏమనుకుంటున్నామో ఎదుటివారికి తెలియకుండా జాగ్రత్త పడాలి. మనలోని ఆలోచనలు బయటి వ్యక్తులకు తెలియకూడదు. ముఖ కవలికలను, భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి.
ఎంత అప్పుల్లో కూరుకుపోయినా ముఖంలో చిరునవ్వు చెదరకుండా చూసుకోవాలి. అది మీకు, మీ కుటుంబసభ్యులకు, మీకు అప్పు ఇచ్చిన వారిని ఆందోళన చెందకుండా ఉంచుతుంది.

పొగడ్తలకు పడొద్దు:
ఎదుటివారిని ప్రశంసించాలి కానీ వారి ప్రశంసలకు, పొగడ్తలకు మనం పడిపోకూడదు. విజయవంతమైన వ్యక్తులు ఎవరూ పొగడ్తలకు పొంగిపోరు, విమర్శలకు కుంగిపోరు. నదిలా పారుతూ పోతారు.
ఒక విషయం గురించి బలంగా విశ్వసిస్తే దానిపై నిలబడానికి ప్రయత్నించాలి. ఎదుటివారు ఏదో అనుకుంటారని, అనుకుంటున్నారని వెనక్కి తగ్గొద్దు.

బలహీనులను తక్కువ అంచనా వేయొద్దు:
స్నేహితులను సన్నిహితంగా ఉంచుకోవడం ఎప్పుడూ మంచిదే. అలాగే మీ శత్రువులకు దగ్గరగా ఉండటం మరింత మంచిది. బలహీనమైన వ్యక్తితో శత్రుత్వం తేలు కుట్టడం కంటే ప్రమాదకరమైనది. బలహీనమైన వ్యక్తిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయవద్దు. వారిని ఎట్టిపరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయవద్దు. వారు బలహీనంగానే కనిపిస్తారు. కానీ అవకాశం వచ్చినప్పుడు ప్రతీకారం తీర్చుకుంటారు.
బలహీనమైన వ్యక్తులు మీతో కలిసి సమానంగా పరిగెత్తలేరు. కానీ వారు మీ వెనక ఉండి గోతులు తవ్వుతారు. మంచి సమయం కోసం ఎప్పుడూ ఓపికగా ఎదురుచూస్తారు.



Click it and Unblock the Notifications