Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
క్రీం, బంగారు రంగు సొగసైన దుస్తులలో తళుక్కుమన్న ఐశ్వర్యారాయ్ బచ్చన్
తన దుస్తులకు నప్పేలా ధరించిన చెప్పులు కూడా క్రీమ్ మరియు బంగారు రంగుతో చేయబడి ఉన్న కారణంగా మరింత అదనపు ఆకర్షణను జోడించినట్లుగా కనిపిస్తుంది. నిజానికి ఐశ్వర్యా రాయ్ అంటేనే అందానికి బ్రాండ్ అంబాసిడర్, తా
కొన్ని రంగుల కలయిక, మిమ్ములను అందరిలో ప్రత్యేకంగా కనిపించేలా చేయవచ్చు. అటువంటి రంగుల కలయికలో ఒకటిగా క్రీమ్ మరియు బంగారు రంగు ఉంటుంది. ఎక్కువగా సంప్రదాయక దుస్తులను ప్రతిబింబించేలా కనిపించే ఈ కలయిక, ఎందరిలో ఉన్నా మీకంటూ ఒక భిన్నమైన గుర్తింపు వచ్చేలా చేస్తుంది.
ఇటువంటి క్రీమ్ మరియు బంగారు రంగు కలయికలోని వస్త్రధారణ అనుసరించిన తారల్లో ఐశ్వర్యారాయ్ బచ్చన్ కూడా చేరింది. రాగ్ షాయారీ కార్యక్రమం సందర్భంగా హాజరైన ఐశ్వర్యారాయ్ బచ్చన్ పైన చెప్పినట్లుగానే సంప్రదాయక దుస్తులలో అందరి దృష్టిని ఆకర్షించి ప్రత్యేకంగా నిలబడింది.
అబూ జాని సందీప్ ఖోస్లా రూపకల్పన చేసిన ఈ దుస్తులు, చిన్న కుర్తాను కలిగి ఉండి, రౌండ్ నెక్లైన్ వద్ద సన్నని చీలిక(స్లిట్)తో, పలాజో ప్యాంటు జతచేసి దుస్తులకు నప్పేలా ఉంటుంది. తేలికపాటి రంగులతో, క్రీం రంగు దుస్తులకు బంగారు అంచు (బార్డర్ లైన్స్) కలిగి ఉన్న ఈ దుస్తులకు, అదనంగా జోడించిన దుప్పటా దుస్తులకు మరింత ఆకర్షణను జోడించినట్లు కనిపించింది.

తన దుస్తులకు నప్పేలా ధరించిన చెప్పులు కూడా క్రీమ్ మరియు బంగారు రంగుతో చేయబడి ఉన్న కారణంగా మరింత అదనపు ఆకర్షణను జోడించినట్లుగా కనిపిస్తుంది. నిజానికి ఐశ్వర్యా రాయ్ అంటేనే అందానికి బ్రాండ్ అంబాసిడర్, తాను ఎటువంటి దుస్తులు ధరించినా ఆ దుస్తులకే అందం వస్తుంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఆమె ధరించిన చిక్ వాచ్ మరియు సొగసైన బంగారు చెవి కమ్మలు కూడా దుస్తులకు సరిపోయేలా అలంకరించింది.

ఇక ఐశ్వర్యా రాయ్ మేకప్ విషయానికి వస్తే, డూయీ-టోన్డ్ మేకప్ ధరించి, ఎరుపు రంగు లిప్షేడ్, సాఫ్ట్ కోహ్ల్ (కంటి లైనర్) జోడించినట్లు కనిపించింది. భుజాల పక్కన సున్నితంగా జాలువారుతున్నట్లు కనిపించిన జుట్టు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఫాషన్, ఆరోగ్య, జీవన శైలి, శిశు సంబంధ, మాతృత్వ, ఆహార, ఆద్యాత్మిక, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.



Click it and Unblock the Notifications
