For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సి.సి.టి.వి. కెమరాలో చనిపోయిన కుమారుని ఆత్మను కనుగొన్న తల్లి

|

అనారోగ్యం కారణంగా బిడ్డను కోల్పోవడం అంతటి దారుణమైన నష్టం ఏ తల్లిదండ్రులకూ ఉండదు అన్నది జగమెరిగిన సత్యం. క్రమంగా ఆ బిడ్డ జ్ఞాపకాల నుండి బయటపడడానికి వారికి చాలా సమయమే పడుతుంది. ఒక ఔషధం యొక్క అధిక మోతాదు వలన చనిపోయిన ఒక యువకుడి ఆత్మ, ఆశ్చర్యకరంగా అదే ఇంట్లో తన ఉనికిని చూపింది.

mum spots her dead sons ghost on a kitchen cctv
 

ఇంట్లో ఉన్న సి.సి.టి.వి. కెమరాలో చనిపోయిన వారి కుమారుడు / సోదరుని వారి వంట గదిలో చూసినట్లు తల్లి / కుమార్తె తెలుపడం చర్చనీయాంశం అయింది. ఈ సంఘటన గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు చూడండి.

ఒక 'పారదర్శకమైన' ఛాయను కెమెరా సెన్సార్ కాప్చర్ చేసింది :

తల్లి జెన్నిఫర్ హాడ్జ్ మరియు ఆమె కూతురు లారెన్తో కలిసి మంచం మీద చేరి టీవీ చూస్తూ ఉన్నారు. ఆ సమయంలో జెన్నిఫర్ ఫోన్లో ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఒక వ్యక్తి ప్రవేశ మార్గంలో ఉన్నట్లుగా ఆ నోటిఫికేషన్ సారాంశం.

ఊహించని పరిణామం :

తన కుమార్తెతో కలిసి గదిలో టీవీని చూస్తున్నప్పుడు, తన మొబైల్లో వచ్చిన నోటిఫికేషన్ చూసి, కెమరా పరిశీలించగా వారి చనిపోయిన కొడుకు యొక్క ఆత్మ వంట గదిలో తిరుగుతూ ఉండడం చూసి ఆశ్చర్యపోవడం వారి వంతైంది !

mum spots her dead sons ghost on a kitchen cctv
 

ఆ చిత్రం వారు కోల్పోయిన తమ బిడ్డలా కనిపించింది..

ఈ ఇద్దరూ ఆ చిత్రాన్ని తెరిచి చూడగా, వారు ఒక గడ్డం కలిగి ఉన్న పురుషుడిని చూసి ఆశ్చర్యపోయాడు, మరియు ఆ చిత్రం వారి కుమారుడు / సోదరుడు అయిన రాబీ వలె కనిపించింది. స్పష్టంగా, అతను ఔషధాల అధిక మోతాదు కారణంగా రెండు సంవత్సరాల క్రితం మరణించాడు.

mum spots her dead sons ghost on a kitchen cctv

అతను తన కొడుకే అని ఆ తల్లి నమ్మకం ...

వారిద్దరూ ఆ చిత్రాన్ని చూసిన మరుక్షణమే, వంటగదికి వెళ్లి తేరిపారా పరిశీలించి చూశారు. కానీ ఎటువంటి స్పష్టమైన ఆధారాలు కూడా అక్కడ కనపడలేదు. క్రమంగా నిశ్చేష్టులైపోయారు. ఆ చిత్రంలో కనిపించిన యువకుడు, తెల్ల రంగు పైజామా ధరించి, వంటగదిలో తచ్చాడుతూ కనిపించాడు. దుఃఖంతో కూడుకున్న ఆ తల్లి హృదయం, తన కొడుకు ఆత్మ శాంతితోనే ఉన్నదని నమ్ముతూ ఉంది.

కానీ సోషల్ మీడియాలో ఫార్వార్డ్ అవుతున్న ఈ సి.సి.టీ.వీ కెమరా విజువల్స్ చూసిన వారిలో భిన్న భావాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇదంతా కావాలని చేస్తున్న కెమరా ట్రిక్స్ అంటూ కొందరు కొట్టిపడేస్తూ ఉంటే, తల్లి మీద ప్రేమతో కొడుకు ఆత్మ అక్కడే తిరుగుతూ ఉందని కొందరి భావనగా ఉంది. ఏదేమైనా కొడుకు పోయిన పుట్టెడు దుఃఖం ఉన్న ఆ తల్లి కొంత ఊరట పొందినట్లే కనిపిస్తూ ఉంది. కానీ ఇది ఎంత వరకు నిజం అనేది తెలియాల్సి ఉంది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Mom Spots Her Dead Son's Ghost On A Kitchen CCTV

Mum spots her dead sons ghost on a kitchen cctv. Check out the entire details about the mother and daughter who claim that they saw their dead son/brother in their kitchen as the whole incident was captured on the CCTV present inside the house.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more