Latest Updates
-
ఇడ్లీ, దోశల్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. 15 నిమిషాల్లో అదిరిపోయే ఇడ్లీ కుర్మా..నాలుగు ఇడ్లీలు ఎక్కువే తింటారు! -
గ్యాస్ సమస్యలు రాని ఆరోగ్యకరమైన పెసరపప్పు వడ.. సింపుల్ గా ఇలా చేయండి! -
40 దాటాక విటమిన్ D ఎందుకంత కీలకం? త్రిష మార్నింగ్ రొటీన్ వెనుక ఉన్న అసలు నిజాలివే.. -
Weight loss Soup Recipe: కొవ్వును కరిగించి, యవ్వనంగా మార్చే అద్భుతమైన సూప్ ఇదే.. -
Viral Video: 22 ఏళ్ల కుర్రాడితో 40 ఏళ్ల మహిళ ఎఫైర్.. లేచిపోతుండగా ఏమైందంటే? -
ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండానే పరమ రుచిగా.. టెంపుల్ స్టైల్ సాంబార్ అన్నం చేసుకోండిలా! -
అద్దెకు దిగిన ఆంటీతో ఎఫైర్.. హెచ్ఐవీ సోకి ఇద్దరు అన్నదమ్ముల మృతి!..ఆమెతో పరిచయం ఉన్నవాళ్లంతా.. -
Guru nakshatra gochar: అక్టోబర్ 8న ఆశ్లేష నక్షత్రం నాల్గవ పాదంలోకి గురువు..నక్క తోక తొక్కే రాశులివే! -
రెగ్యులర్ కుర్మాకి గుడ్ బై.. పూరీలోకి కొత్త రుచులతో 'తీపి గుమ్మడికాయ కుర్మా'! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ శనగల పరాటా..రోజంతా ఎనర్జీ,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్
రైలులో హనీమూన్ సెటప్.. ఏసీ కోచ్‌లో క్యాబిన్ అలంకరణ చూస్తే మతిపోవాల్సిందే.!
సాధారణంగా కొత్త జంటలు హనీమూన్ కోసం వెకేషన్ ప్లానింగ్ చేసుకోవవడం తెలిసిందే. ప్రైవేట్ స్పేస్ ఉండేలా హోటల్ రూమ్స్, కొత్త ప్రాంతాలు లేదంటే ఇంట్లోనే ప్రత్యేకంగా రూమ్‌ను డెకరేట్ చేసుకుంటారు. అయితే పబ్లిక్ రవాణాలో ఎప్పుడైనా హనీమూన్ సెటప్ చూశారా.? రైల్వే ఏసీ కోచ్‌లో మొదటి రాత్రి కోసం చేసిన డెకరేషన్ వీడియో వైరల్ అవుతోంది.

భారతీయ రైల్వేలోని ఫస్ట్ ఏసీ కోచ్‌లో హనీమూన్ సెటప్ వీడియో నెటిజన్ల మధ్య చర్చకు దారితీసింది. ఈ వీడియో రైల్వే నిబంధనలు, భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ట్రైన్‌లోని ఒక ఫస్ట్ ఏసీ కోచ్ కంపార్ట్‌మెంట్ విలాసవంతమైన హోటల్ గదిని తలపిస్తోంది. అందులోని ఒక క్యాబిన్‌లో బెడ్‌పై పూల డెకరేషన్, గులాబీ రేకులు, రంగురంగుల బెలూన్లతో మొదటి రాత్రి గదిని తలపించేలా డెకరేషన్ చేశారు. దీంతో గోడపై 'ఐ లవ్ యూ’ అంటూ ఇంగ్లీష్ రాయడం కొత్త జంటలకు మధురానుభూతిని ఇచ్చేలా ఉంది.
అయితే ఈ వీడియోను మొదటి నుంచి కాకుండా డెకరేట్ చేసిన క్యాబిన్‌ను డైరెక్ట్‌గా చూసినట్లయితే ఇది రైల్లోనే అస్సలు నమ్మలేరు. ఇలాంటి క్రియేటివ్ ఐడియా నెటిజన్లను ఆకట్టుకున్నప్పటికీ.. మరోవైపు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టులో ఇలాంటి చర్యలేంటని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీంతో ప్రయాణికుల భద్రత, పరిశుభ్రతకి సంబంధించి ప్రశ్నలు మొదలయ్యాయి.
రైల్వే వ్యవస్థపై ప్రభావం
భారతీయ రైల్వే వంటి పబ్లిక్ ట్రాన్స్‌పోర్టులో బెలూన్లు, కాగితం, పూలు, కొవ్వొత్తులు వంటివి ఉపయోగించడం భద్రతకు ముప్పు వాటిల్లినట్లు కాదా అని నెటిజన్స్ పేర్కొంటున్నారు. క్యాబిన్‌లో ఇవి ఉండటం వల్ల అగ్ని ప్రమాదం ఏర్పడే అవకాశం ఉండొచ్చని అంటున్నారు. వీరిని చూసి మరో ప్రయాణికుడు కూడా ఇదేవిధంగా ప్లాన్ చేస్తే అది రైల్వే వ్యవస్థపై ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాగా, ఈ వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నూతన భాగస్వామికి సర్‌ప్రైజ్ ఇవ్వడం మధుర జ్ఞాపకం, అద్భుతమైన బహుమతి అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రైల్వే కోచ్‌లను ఇలా అలకరించడం చట్టబద్ధమేనా అని మరికొందరు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇందుకోసం ముందుగా రైల్వే అనుమతి తీసుకున్నారా.. రైల్వే శాఖలో ఇలాంటి అనుమతులు ఉన్నాయా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఓ ప్రయాణికుడు తాను బుక్ చేసుకున్న క్యాబిన్‌ను ఇలా అలంకరించుకోవచ్చా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
రైల్వే శాఖ స్పందన
ఈ విషయం రైల్వే శాఖ దృష్టికి చేరడంతో అధికారులు దీనిపై స్పందించారు. ఈ సంఘటన దక్షిణ మధ్య రైల్వే పరిధిలో జరిగిందని.. అయితే ఈ కోచ్‌లోకి డెకరేటర్ అనుమతి లేకుండా ప్రవేశించడం అనధికారమని తెలిపారు. రైల్వే నియమాలను ఉల్లంఘించినట్లేనని పేర్కొన్నారు.
’జల్నా స్టేషన్‌లో కోచ్‌లోకి డెకరేటర్ ప్రవేశం అనధికారికం. ఇది తీవ్రమైన లోపం. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించిన సంబంధిత టీటీఈని సస్పెండ్ చేశాం. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించాం. విచారణ తర్వాత చర్యలు తీసుకుంటాం.’- అని అధికారులు తెలిపారు.
ఈ మేరకు క్యాబిన్‌లో అలంకరణలు చేపట్టిన కాంట్రాక్టర్‌పై.. ట్రైన్‌లోకి అనధికారికంగా ప్రవేశించడం, టికెట్ లేకుండా రావడం, రైల్వే నిబంధనలను అతిక్రమించడంపై కేసు నమోదు చేసినట్లు అధికారులు వివరించారు. కాగా, భద్రతా నిబంధనలను పాటించి, డెకరేట్ చేసుకోవడం, తర్వాత సరిగ్గా శుభ్రపరిస్తే ఎలాంటి తప్పు లేదని అధికారులు తెలిపారు. అప్పుడప్పుడూ ప్రత్యేక సందర్భాల కోసం ఫస్ట్ ఏసీ కోచ్‌లలో తేలికపాటి అలంకరణలు అప్పుడప్పుడు కనిపిస్తాయన్నారు. అయితే అనధికార వ్యక్తులకు లోపలికి ప్రవేశం లేదని స్పష్టం చేశారు.



Click it and Unblock the Notifications
