Latest Updates
-
Viral Video: 22 ఏళ్ల కుర్రాడితో 40 ఏళ్ల మహిళ ఎఫైర్.. లేచిపోతుండగా ఏమైందంటే? -
ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండానే పరమ రుచిగా.. టెంపుల్ స్టైల్ సాంబార్ అన్నం చేసుకోండిలా! -
అద్దెకు దిగిన ఆంటీతో ఎఫైర్.. హెచ్ఐవీ సోకి ఇద్దరు అన్నదమ్ముల మృతి!..ఆమెతో పరిచయం ఉన్నవాళ్లంతా.. -
Guru nakshatra gochar: అక్టోబర్ 8న ఆశ్లేష నక్షత్రం నాల్గవ పాదంలోకి గురువు..నక్క తోక తొక్కే రాశులివే! -
రెగ్యులర్ కుర్మాకి గుడ్ బై.. పూరీలోకి కొత్త రుచులతో 'తీపి గుమ్మడికాయ కుర్మా'! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ శనగల పరాటా..రోజంతా ఎనర్జీ,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ -
ముంబై స్ట్రీట్ స్టైల్ చీజ్ పావ్ భాజీ.. ఉల్లి, వెల్లుల్లి లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నిజంగా నేరమా.. మన భారతీయ చట్టాలు ఏం చెబుతున్నాయంటే.! -
పైన క్రిస్పీగా.. లోపల సాఫ్ట్ గా.. సాయంత్రం పూట వేడివేడి పనీర్ ఫింగర్స్ చేసుకోండిలా.. -
వంశాభివృద్ధికి, పితృదేవతల ఆశీస్సులకు మహాలయ అమావాస్య.. తర్పణం, శుభ సమయం వివరాలివే.!
పెళ్లి విషయంలో ఆలస్యం చేస్తున్న జెన్ జెడ్ యువత.. భాగస్వామి కంటే ముందు వాటికే ప్రాధాన్యత.!
నేటి జెన్ జెడ్ యువత పెళ్లి విషయంలో ఆచితూచీ వ్యవహరిస్తున్నారు. వివాహ జీవితం కంటే ముందు వృత్తి, ఆర్థికంగా స్థిరత్వం, వ్యక్తిగతంగా స్వేచ్ఛ, మానసికంగా ఆరోగ్యం వీటికి సిద్ధమైన తర్వాతే సరైన భాగస్వామిని ఎంచుకునే ఆలోచనలో ఉంటున్నారు. వారికి తల్లిదండ్రుల మద్దతు కూడా ఉండటంతో పెళ్లి కోసం సరైన సమయాన్ని ఎంచుకుంటున్నారు.

కాలం మారుతున్న కొద్దీ యువత ఆలోచనలు మారుతున్నాయి. ఒకప్పుడు వివాహ వయసు రాగానే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. తర్వాత చదువు అయిపోయాక వివాహానికి సిద్ధమవుతున్నారు. మరికొంతకాలం తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లికి సిద్ధమవుతున్నారు. అయితే ఇ్పపుడు పరిస్థితులు ఇంకా మారాయి. ఉద్యోగం వచ్చినా వివాహ జీవితం ప్రారంభించడానికి సమయం తీసుకుంటున్నారు. కెరీర్, వ్యక్తిగత స్వేచ్ఛకి ఇచ్చిన తర్వాత పెళ్లికి ప్రాధాన్యత ఇస్తున్నారని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు.
సోషల్ మీడియా ప్రభావం, మారుతున్న జీవనశైలి, ఉన్నత చదువులు, కెరీర్‌లో ప్రమోషన్లు, ఆర్థిక ఎదుగుదల, వ్యక్తిగత స్వేచ్ఛ.. నేటి యువత పెళ్లి కంటే ముందు వీటికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే రిలేషన్‌షిప్‌పై వీరికి ఆసక్తి లేదనడం కాదు. వివాహ జీవితంపై వారు మరింత అవగాహన ఏర్పరుచుకుని సన్నద్ధతతో ప్రారంభించాలని ఆశిస్తున్నారు. అందుకే సామాజిక ఒత్తిడి, పెళ్లి వయసు ప్రభావానికి గురి కాకుండా సరైన భాగస్వామిని ఎంచుకునేందుకు సమయం తీసుకుంటున్నారు. భాగస్వామితో బంధంలో ఆర్థిక స్వేచ్ఛ, గౌరవం, సమానత్వం, భావోద్వేగంంగా అనుబంధం, అవగాహన వంటివి ఆశిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కాలంలో వివాహ వయసు పెరుగుతోంది. మూడు పదులు దాటినా పెళ్లి చేసుకోవడానికి తొందరపడటం లేదు.

కెరీర్
నేటి యువత పెళ్లి కంటే ముందు కెరీర్ విషయంలో పటిష్ఠంగా ఉండాలని ఆశిస్తున్నారు. అందుకోసం ముందుగా చదువు అయిపోయాక మంచి ఉద్యోగం సాధించేందుకు దృష్టి సారిస్తున్నారు. అందుకనుగుణంగా కోర్సులు, ట్రైనింగ్‌కి ప్రాధాన్యత వహిస్తున్నారు. కెరీర్‌లో ఉండగానే ఉన్నత విద్య, స్కిల్స్‌కి ప్రాధాన్యత ఇస్తూ.. ఆర్థికంగా స్వేచ్ఛగా ఉండేందుకు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా పెళ్లి కంటే తమ కంటూ ఒక గుర్తింపును సాధించాలనే పట్టుదలతో ఉన్నారు.
ఆర్థిక స్థిరత్వం
ఆధునిక కాలంలో పెరుగుతున్న ఖర్చులు, ద్రవ్యోల్బణం యువత ఆలోచనా దృక్పథాన్ని పూర్తిగా మార్చేస్తున్నాయి. అందుకే ఆర్థిక విషయాలపై అవగాహన పెంచుకుని సంపాదనలో కొంత ఎంత పొదుపు చేసుకోవాలో ప్రణాళికతో ఉంటున్నారు. భవిష్యత్తులో ఆర్థిక భద్రతకు, ఇల్లు కొనుగోలు, పెళ్లి తర్వాత పెరిగే బాధ్యతలకు సిద్ధంగా ఉండేందుకు ఆర్థికంగా సిద్ధమవుతున్నారు.

వ్యక్తిగత స్వేచ్ఛ
ఇటీవలి కాలంలో చాలా మంది యువతీయువకులు వ్యక్తిగత స్వేచ్ఛ విషయంలో రాజీపడటం లేదు. నచ్చిన నిర్ణయాలు తీసుకోవడంలో మొహమాటపడటం లేదు. కొత్త ప్రాంతాలకు వెళ్లడం, అభిరుచులకు ప్రాధాన్యతలకి ఇచ్చిన నచ్చిన రంగాల్లో మల్టీ టాస్కింగ్ చేస్తూ దూసుకెళ్లడం, సామాజిక ఒత్తిడికి గురికాకుండా నచ్చిన జీవితాన్ని గడిపేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
మానసిక ఆరోగ్యం
పెళ్లి జీవితాన్ని ప్రారంభించేముందు మానసకింగా సన్నద్ధంగా ఉండేందుకు నేటి యువత ప్రయత్నిస్తున్నారు. టాక్సిక్ రిలేషన్‌షిప్స్‌కి దూరంగా ఉంటున్నారు. లవ్‌లో ఏదైనా మనస్పర్థలు వచ్చినా రాజీ పడకుండా తమకు నచ్చిన దారివైపు అడుగులు వేస్తున్నారు. భావోద్వేగంగా బలంగా ఉండేందుకు జీవనశైలిని మార్చుకుంటున్నారు.
సరైన భాగస్వామి
వివాహ జీవితంలోకి అడుగుపెట్టేముందు నేటి యువత కాబోయే భాగస్వామి ఎలా ఉండాలో కొన్ని అంచనాలు పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఆడామగా తేడా లేకుండా పరస్పర గౌరవం కోరుకుంటున్నారు. కుటుంబ బాధ్యతలు, ఆర్థిక విషయాల్లో ఇద్దరి ఆలోచనలు ఒకే విధంగా ఉండాలనుకుంటున్నారు. వ్యక్తిగత స్వేచ్ఛ, లక్ష్యాలకు ప్రాధాన్యత ఇచ్చే భాగస్వామిని కోరుకుంటున్నారు.



Click it and Unblock the Notifications
