Latest Updates
-
చుక్క నూనె, ఇసుక లేకుండానే రోస్టెడ్ పల్లీలు.. ఎలా చేసుకోవాలంటే -
వీటిని ఫ్రిజ్‌లో పెట్టి తింటే క్యాన్సర్ రావడం పక్కా.. పొరపాటున కూడా ఈ పని చేయకండి.! -
అల్లుడిపై ఐదుగురు పిల్లల అత్త వ్యామోహం..కన్న కూతురికే సవతిలా మారి..చివరికి ఏమైందంటే.. -
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్‌ఫాస్ట్.! -
ఎన్నడూ లేని విధంగా ప్రధాన గ్రహాల సంచారం, అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి సిరిసంపదల వరాలు.! -
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.!
అంబేడ్కర్ చదివిన డిగ్రీల లిస్ట్ పెద్దదే..!
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతిని ఈ రోజు ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్థంగా ఘనంగా జరుపుకుంటున్నారు. దళిత కుటుంబంలో పుట్టి విద్యతో ఎవ్వరికీ అందనంత ఎత్తుకు ఎదిగి స్వాతంత్య్ర పోరాట సమయంలో ఎన్నో సాధించారు. అంటరాని వాళ్లకు, మహిళలకు, వెనకబడిన తరగతుల భవిష్యత్తుకు బంగారు బాట వేశారు. అంబేడ్కర్ తన జీవితంలో ఎన్నో వేల గ్రంధాలు చదివివారని ఆయన సన్నిహితులనేకమంది స్పష్టం చేశారు. ఆయన చదువుకున్న డిగ్రీలు కూడా చాలా ఉన్నాయ్. ఈ ఆర్టికల్‌లో అంబేడ్కర్ చదువుకున్న డిగ్రీలు, యూనివర్సిటీలు గురించి అంబేడ్కర్ జయంతి సందర్భంగా మీకు అందిస్తున్నాం.

అంబేడ్కర్ చదువుకున్న డిగ్రీలు
బాబాసాహెబ్ అంబేడ్కర్ 1907లో పదవ తరగతి పూర్తి చేసిన తరువాత 1908లో ఎల్ఫిన్‌స్టోన్ కాలేజీలో చేరారు. 1912లో బాంబే యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ సబ్జెక్టులతో డిగ్రీని పూర్తి చేశారు. 1913లో 22 ఏళ్లకు అప్పటి బరోడా సంస్థాన రాజు శయాజీరావ్ గైక్వాడ్ అందజేసిన స్కాలర్‌షిప్‌ను పుచ్చుకున్నారు. అదే స్కాలర్‌షిప్‌తో అమెరికాలోని న్యూయార్క్‌లో కొలంబియా యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేశారు.
1915లో మొదటిసారిగా ఎకనామిక్స్, సోషియాాలజీ, హిస్టరీ, ఫిసాసఫీ, ఆంత్రాపాలజీ సబ్జెక్టులతో ఎమ్ఏ పూర్తి చేశారు. 1916 అక్టోబర్‌లో లండన్‌లోని గ్రేఇన్ లా కాలేజ్ నుంచి లా కోర్సును చదవడం ప్రారంభించారు. అప్పుడే అదే సంవత్సరం భారతదేశంలోని కులాలనే తన డాక్టోరల్ థీసిస్‌గా ఎంపిక చేసుకొని అధ్యయనం చేశారు. ఆ థీసిస్‌ను ప్రవేశపెట్టి మళ్లీ రెండవ థీసిస్‌గా భారతదేశంలోని రూపాయ్ సమస్యను ఎంచుకున్నారు.
1923లో లండన్ యూనివర్సిటీ నుంచి ఎకానమిక్స్‌లో డీఎస్సీ పూర్తి చేశారు. అదే సంవత్సరం ఆయన గ్రేఇన్‌లోని బార్ కౌన్సిల్ అంబేడ్కర్‌ను మర్యాదపూర్వకంగా ఆహ్వానించి లా డిగ్రీ పట్టాను అందించి న్యాయవాదిగా గుర్తింపునిచ్చారు. 1927లో కొలంబియా యూనివర్సిటీ నుంచి ఎకానమిక్స్‌లో పీహెచ్‌డీని పూర్తి చేశారు.
అంబేడ్కర్ చదివిన డిగ్రీలు
1902లో మహారాష్ట్రలోని సతారా నుంచి ప్రాథమిక విద్య
1907లో ముంబైలోని, ఎల్ఫిన్‌స్టన్ హైస్కూల్ నుంచి పదవ తరగతి పూర్తి
1907లో బాంబేలోని ఎల్ఫిన్‌స్టన్ కాలేజ్ నుంచి ఆంగ్లంలో ఇంటర్మీడియట్‌ను పూర్తి చేశారు.
1913లో బాంబే యూనివర్సిటి, ఎల్ఫిన్‌స్టన్ కాలేజ్ నుంచి ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీని పూర్తి చేశారు.
1915లో ఎకానమిక్స్, హిస్టరీ, ఫిలాసఫీ, ఆంత్రాపాలజీ, పాలిటిక్స్ సబ్జెక్టులతో ఎంఏ పూర్తి చేశారు.
1917లో కలంబియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పట్టాను పుచ్చుకున్నారు.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ చదివిన డిగ్రీలు, ప్రతిభ చూసి 2015లో కొలంబియా యూనివర్సిటీ ఆయనకు నంబర్ 1 స్కాలర్ ఇన్ వరల్డ్ అనే బిరుదును అందించింది.
1921లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ఎంఎస్సీని పూర్తి చేశారు. దీంతో పాటు ''ప్రొవిన్సియల్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఇంపీరియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటీష్ ఇండియా'' అనే థీసిస్‌ను ప్రవేశపెట్టారు.
1920లో లండన్‌లో గ్రేఇన్ నుంచి బారిస్టర్ లా పూర్తి చేశారు.
1923లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ద ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ అనే అంశంపై థీసిస్‌ను సమర్పించారు.
1952లో న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీ నుంచి ఎల్.ఎల్.డీ పూర్తి చేశారు.
1953లో హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డీ.లిటరేచర్‌ను పూర్తి చేశారు.



Click it and Unblock the Notifications
