రొమాంటిక్ మూడ్ చెడిపోకూడదంటే.. ఏకాంతంగా ఉన్నప్పుడు ఈ విషయాలు అస్సలు మాట్లాడకండి

Posted By:

మీ బెడ్‌ రూమ్‌ లో మీరిద్దరే ఉన్నారు. వాతావరణం ఎంతో ప్రశాంతంగా, రొమాంటిక్‌ గా ఉంది. ఒకరి చేతిలో మరొకరి చేయి వేసి కబుర్లు చెప్పుకుంటున్నారు. కానీ, ఆ క్షణంలో మీరు క్యాజువల్‌గా చేసిన ఓ చిన్న కామెంట్ లేదా సరదాకి వేసిన ఓ జోక్.. ఆ అందమైన వాతావరణాన్ని ఒక్కసారిగా మార్చేస్తుంది. శారీరకంగా మీరిద్దరూ పక్కపక్కనే ఉన్నా, మానసికంగా ఎంతో దూరం పెరిగిపోతుంది. ఏకాంతంలో ఉన్నప్పుడు కొన్ని మాటలు పెదవి దాటకూడదు. అవేంటో ఇక్కడ చూడండి.

మాజీల ప్రస్తావన వద్దు

మీ మాజీ ప్రేమికుల పేరును పొరపాటున కూడా ప్రస్తావించకండి. నా ఎక్స్ ఇలా చేసేది,చేసేవాడు అని మీరు అన్న మరుక్షణం.. ఆ గదిలో మీరిద్దరే ఉన్నారన్న ఫీలింగ్ పోతుంది. మీ ఏకాంతంలోకి మూడో వ్యక్తిని తీసుకొచ్చినట్లు అవుతుంది. మీరు నిజాయితీగానే ఆ మాట అన్నా, అది మీ భాగస్వామిలో అభద్రతాభావాన్ని పెంచుతుంది. ఆ తర్వాత మీరు ఎన్నిసార్లు సారీ చెప్పినా ఆ గాయం త్వరగా మానదు.

4 Things You Should Never Say to Your Partner in the Bedroom

కుటుంబ సభ్యులపై విమర్శలు

ప్రేమగా గడుపుతున్న సమయాన్ని క్షణాల్లో రణరంగంగా మార్చే శక్తి ఈ టాపిక్‌ కి ఉంది. మీరిద్దరూ ప్రశాంతంగా ఉన్నప్పుడు మీ పార్ట్‌ నర్ తల్లిదండ్రుల గురించో, అన్నాచెల్లెళ్ల గురించో చులకనగా లేదా కోపంగా మాట్లాడటం మానుకోండి. భార్యాభర్తలు ఎంత క్లోజ్‌గా ఉన్నా సరే, తమ ఫ్యామిలీని ఎవరైనా విమర్శిస్తే ఎవరూ తట్టుకోలేరు.

అందమైన అమ్మాయి పిలిచిందని వెళ్తే..యువకుడికి ఊహించని షాక్!, th

వ్యక్తిగత దూషణలు, రూపంపై సెటైర్లు

ఏకాంతం అనేది ఒకరినొకరు ఆరాధించుకోవాల్సిన సమయం. అంతేకానీ వారిలోని లోపాలను వెతికే సమయం కాదు. సరదాకైనా సరే నువ్వు ఈమధ్య లావయ్యావు, నీకు ఆ డ్రెస్ అస్సలు బాలేదు లేదా నువ్వు మునుపటిలా అందంగా లేవు లాంటి మాటలు అనకండి. ఇలాంటి మాటలు వారి ఆత్మవిశ్వాసాన్ని కుంగదీస్తాయి. మీ పట్ల ఉన్న ఆకర్షణను తగ్గిస్తాయి.

ఇతరుల భజన వద్దు

మీ పార్ట్‌ నర్‌ తో ఏకాంతంగా గడుపుతున్నప్పుడు, సడెన్‌ గా వారి స్నేహితుల గురించో, లేదా మీ స్నేహితుల గురించో గొప్పగా చెప్పడం మొదలుపెట్టకండి. నీ ఫ్రెండ్ చాలా అందంగా ఉంటుంది లేదా వాడు చాలా గ్రేట్ లాంటి మాటలు ఆ మూడ్‌ ని చెడగొడతాయి.

[ of 5 - Users]
Story first published: Tuesday, November 10, 2026, 23:00 [IST]
Desktop Bottom Promotion