Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
కొత్త సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మన తెలుగు రాష్ట్రాల్లోని బెస్ట్ ప్లేసెస్ ఇవే
మీరు కూడా ఈ కొత్త సంవత్సరానికి బడ్జెట్‌లో వేడుకలు జరుపుకోవాలని ఆలోచిస్తుంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్న ఈ ప్రాంతాలకు వెళ్లండి. ఆహ్లాదం, ఆనందం మిమ్మల్ని కుదురుగా ఉండనివ్వవు.
మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పబోతున్నాం. కొత్త సంవత్సరాన్ని సరికొత్తగా ఆహ్వానించడానికి అంతా ప్లాన్ రెడీ చేసుకునే పనిలో నిమగ్నం అయిపోయారు. ఇంట్లోనే కేక్ కోస్తే సరిపోతుందని కొంత మంది అనుకుంటారు, మరికొంత మంది ఫ్రెండ్స్‌తో గడపడానికి ఇష్టపడతారు, ఇంకొంత మంది ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లి అక్కడ కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించాలని అనుకుంటారు. చాలా కొద్ది మంది మాత్రమే దేశవిదేశాలకు వెళ్లి సెలబ్రేట్ చేసుకుంటారు. మిగతా వాళ్లంతా ఊర్లోనే ఉండి వేడుకలు జరుపుకుంటారు.

మీరు కూడా ఈ కొత్త సంవత్సరానికి బడ్జెట్‌లో వేడుకలు జరుపుకోవాలని ఆలోచిస్తుంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్న ఈ ప్రాంతాలకు వెళ్లండి. ఆహ్లాదం, ఆనందం మిమ్మల్ని కుదురుగా ఉండనివ్వవు.

1. లంబసింగి - విశాఖపట్నం
జిల్లాల పునర్విభజన తర్వాత లంబసింగి అల్లూరి సీతారామరాజు జిల్లా కిందకు వచ్చింది. లంబసింగి తుని రైల్వే స్టేషన్ నుండి 75 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. లంబసింగిని కశ్మీర్ ఆఫ్ సౌత్ అని అంటారు. ఇక్కడి దృశ్యాలు ఎంతో మధురమైన అనుభూతిని కలిగిస్తాయి.
దట్టమైన పొగమంచు చూస్తుంటే మేఘాల్లో తేలుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇక్కడ ట్రెక్కింగ్, క్లైంబింగ్ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్‌తో వెళ్తే ఫుల్ ఎంజాయ్ చేయవచ్చు.
లంబసింగికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాజంగి ప్రాంతం కూడా చాలా అందంగా ఉంటుంది. పచ్చదనం, పొగమంచుతో కప్పబడి ఉంటుంది. దారి వెంట రోడ్డు పక్కన వేడి వేడి, మెత్తని, మల్లెపూల లాంటి ఇడ్లీలు ఉంటాయి. చల్లని వాతావరణంలో వేడి వేడి ఇడ్లీలు తింటే ఆ అనుభూతి వేరే లెవల్ అంతే.
ఇక్కడికి వెళ్లే వారికి ఒకటే సూచన. ఫోటోలు, సెల్ఫీలతో సమయాన్ని వృథా చేయకుండా ప్రకృతి రమణీయతను ఆస్వాదించండి.

2. పాకాల సరస్సు - వరంగల్
పాకాల లేక్ అడవులు, కొండల మధ్య ఎంతో మనోహరమైన ప్రదేశం. ఈ సరస్సు ఒడ్డున 839 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న పాకాల అభయారణ్యం ఉంటుంది. ఇందులో అనేక జాతులకు చెందిన జంతువులు, సరీసృపాలు ఉంటాయి. క్షీరదాలు, చిరుతలు సహా అనేక జంతువులు ఉంటాయి.
ఈ ప్రాంతం చాలా కాలం నుండి ప్రకృతి ఆరాధకులను, పర్యాటక ప్రియులను ఆకర్షిస్తోంది. కాలుష్య రహిత సరస్సుల్లో భారతదేశంలో పాకాలా సరస్సు రెండో స్థానంలో ఉంది. ప్రపంచంలోనే ఎనిమిదో స్థానంలో ఉంది.
ఇక్కడ పాకాల గుట్ట చూడొచ్చు. ట్రెక్కింగ్ చేస్తూ గుట్టపైకి చేరుకోవడం మంచి అనుభూతిని ఇస్తుంది. ఈ మార్గంలో సరస్సు అందాలను ఆస్వాదించడానికి వ్యూ పాయింట్లు ఉంటాయి. ఈ సరస్సులో బోటింగ్ చేయవచ్చు. బోటులో సరస్సు మధ్యలో ఉన్న దీవికి వెళ్లొచ్చు. సరస్సుకు అవతలి వైపు చిలకలగుట్టపై కాకతీయ రాజుల కాలంలో నిర్మించిన విడిది మందిరాన్ని తిలకించవచ్చు.

3. గండికోట - కడప
ప్రకృతి సోయగాల కోట - గండికోట. గండికోటకు పర్యాటకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అలనాటి కోటలు, చారిత్రక వైభవం పర్యాటకులను కట్టిపడేస్తుంది. శత్రు దుర్భేధ్యమైన కోటకు మూడు వైపుల పెన్నానది ఉంటుంది. ఎత్తైన కొండలు మధ్యలో పారే నది చూడముచ్చటగా ఉంటుంది.
కొండలపై నుండి నీళ్లు జారువారుతుంటే ఆ దృశ్యం కన్నులవిందుగా ఉంటుంది. గండి కోట అందాలు తప్పకుండా ఆకట్టుకుంటాయి.

4. పోచారం అభయారణ్యం - మెదక్
మెదక్‌కు 15 కిలోమీటర్ల దూరంలో, హైదరాబాద్ నుండి 115 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పోచారం అభయారణ్యం. ఒకప్పుడు దీనిని నిజాం రాజులు వేట మైదానంగా ఉపయోగించేవారు. తర్వాతి కాలంలో దీనిని వన్య ప్రాణుల సంరక్షణ కేంద్రంగా మార్చారు.
ఈ అభయారణ్యంలో అపారమైన వృక్ష, జంతు సంపద ఉన్నాయి. అడవి కుక్కలు, తోడేళ్లు, చిరుతలు, పిల్లులు, జింకలు, లేళ్లు, ఎలుగుబంట్లు ఉంటాయి. నవంబర్ నుండి జనవరి వరకు పోచారం అభయారణ్యం సందర్శన ఎంతో మనోహరంగా ఉంటుంది.

5. పాపికొండలు - భద్రాచలం
ప్రశాంతమైన, సుందరమైన, రమణీయమైన, ఆహ్లాదకరమైన ప్రదేశం పాపికొండలు. ఇక్కడ కొండలు, కొండల మధ్య నుండి పారే గోదావరి, పక్కన ఇసుక తిన్నెలు, వెన్నెల వెలుగులో ఈ ఇసుక తిన్నెల్లో చలి మంటలు వేసుకుని గడిపితే ఆహా.. ఆలోచించుకుంటేనే ఎంత మనోహరంగా ఉందో కదా. ఇంకా అనుభవిస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి.
భద్రాచలం నుండి, రాజమండ్రి నుండి ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు టూరిజం బోట్లు నడుపుతున్నాయి.
ఇక్కడ టూరిజం ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయి. ఒక రోజు, ఒక రాత్రి ఇక్కడ ఉండేలా ప్యాకేజీ ఎంచుకోవచ్చు. మనకంటూ ప్రత్యేకంగా గుడారం ఇస్తారు. ఆహారం, నీళ్లు అన్నీ వాళ్లే సప్లై చేస్తుంటారు.



Click it and Unblock the Notifications