Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
మైసూర్ పాక్ పేరు మార్పు..ఈ ఫేమస్ స్వీట్ చరిత్ర ఏంటో తెలుసా
జమ్మూకశ్మీర్ లో పెహల్గాంలో ఈ ఏడాది ఏప్రిల్ 22న పర్యాటకులపై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. అమాయికులైన 26మంది పర్యాటకులను పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మతం అడిగి మరీ కాల్చి చంపారు. హిందువులే లక్ష్యంగా ఈ ఉగ్రదాడి జరిగింది. అయితే ఈ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ ని ఈసారి వదకుండా చావు దెబ్బ కొట్టాలని,ప్రపంచ పటంలో లేకుండా చేయాలని,పీఓకేని తిరిగి స్వాధీనం చేసుకోవాలని చాలామంది భారతీయులు కోరుకున్నారు. పలు సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలలో కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మే 7న ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్,పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలను భారత్ వైమానిక దాడులతో ధ్వంసం చేసింది. ఆ తర్వాత మే 10న రెండు దేశాల మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం జరిగింది.
మైసూర్ పాక్ పేరు మార్పు
ప్రస్తుతం పాకిస్తాన్ పేరు వినబడితే భారతీయులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఈ క్రమంలో ఇటీవల కరాచీ పేరుతో ఉన్న బేకరీలపై కూడా ఇటీవల కొందరు వ్యక్తులు దాడులు కూడా చేసిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఫేమస్ ఇండియన్ స్వీట్ అయిన మైసూర్ పాక్ లో నుంచి పాక్ పేరుని తీసేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మీమ్స్ చేశారు నెటిజన్లు. పాక్ ఉంటే ఈ స్వీట్ ని తినలేమంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే చాలామంది స్వీట్ షాపులోల్లు దీనిని పెద్దగా పట్టించుకోలేదు. అయితే రాజస్తాన్ రాష్ట్ర రాజధాని జైపూర్ లో ప్రముఖ త్యోహార్ స్వీట్స్ షాపు ఓనర్..ఈ మీమ్స్ ని సీరియస్ గా తీసుకున్నాడు. ఏకంగా తన సాపులోని మేసూర్ పాక్ పేరుని మార్చేశాడు. తన షాపులో మైసూర్ పాక్ పేరుని మైసూరు శ్రీ గా మార్చారు.
తన షాపులోని మోతీ పాక్ స్వీట్ పేరుని మోతీ శ్రీగా మార్చగా..ఆమ్ పాక్ స్వీట్ పేరుని ఆమ్ శ్రీ గా..గోండ్ పాక్ స్వీట్ పేరుని గోండ్ శ్రీగా పేర్లు మార్చేశారు. దేశభక్తి కేవలబ సరిహద్దుల్లోనే కాకుండా ప్రతి ఒక్క వ్యక్తిలో ఉండాలనే తాను ఈ నిర్ఱయం తీసుకున్నట్లు షాపు యజమాని తెలిపారు.

మైసూర్ పాక్ చరిత్ర
పేరులోనే మైసూరు ఉంది కాబట్టి,కర్ణాటక రాష్ట్రంలోని చారిత్రాత్మక మైసూరు నగరంతో దీనికి విడదీయరాని సంబంధం ఉందని అర్థమవుతుంది. ఇది కేవలం ఒక తీపి పదార్థం కాదు, ఒక పురాతన రాజ వంటగది నుండి వెలువడిన ఒక ఆశ్చర్యకరమైన సృష్టి. దీని పుట్టుక, చరిత్ర, భారతదేశంలోని తీపి ప్రియుల హృదయాల్లో దీనికున్న స్థానం గురించి తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోతారు.
మైసూర్ పాక్ పుట్టుక దాదాపు 1930ల నాటిది. మైసూరును పాలించిన నాల్గవ కృష్ణరాజ వడయార్ కాలంలో ఈ అద్భుతమైన తీపి పదార్థం సృష్టించబడింది. మహారాజులకు ఎప్పుడూ కొత్త రుచులను ఆస్వాదించాలనే తపన ఉండేది. మైసూరు ప్యాలెస్‌లోని ప్రధాన వంటవాడు కాకాసుర మాధప్ప ఈ మహారాజు రుచిని తీర్చడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉండేవాడు.
ఒక రోజు మాధప్ప నెయ్యి, శనగపిండి, చక్కెరలను ఉపయోగించి ఒక కొత్త వంటకాన్ని తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ రోజు మామూలుగా చేసే వంటకాలకు భిన్నంగా ఏదో కొత్తగా ప్రయత్నించాలని ఆయనకు అనిపించింది. అలా తను చేసిన మిశ్రమాన్ని ఒకసారి మహారాజుకు వడ్డించాడు. మహారాజు రుచి చూసి ఆశ్చర్యపోయారు. ఆ క్షణం వరకు అలాంటి రుచిని ఆయన ఎప్పుడూ ఆస్వాదించలేదు. ఇదేం స్వీట్? అని మాధప్పను అడిగారు. మాధప్ప కూడా దానికి పేరు పెట్టలేదు. తటపటాయిస్తూ మహారాజా నేను దీనికి ఇంకా పేరు పెట్టలేదు. ఇది ఒక కొత్త వంటకం అని బదులిచ్చాడు. మహారాజు ఇది మైసూరు ప్యాలెస్‌లో పుట్టింది కాబట్టి దీనికి మైసూర్ పాక్ అని పేరు పెట్టండి" అని ఆదేశించారు. పాక్ అంటే కన్నడలో తీపి పాకం అని అర్థం. అలా రాజభవనంలో జన్మించిన ఈ అద్భుతమైన తీపి పదార్థం మైసూర్ పాక్ గా ఖ్యాతిగాంచింది.
రాజభవనం నుండి ప్రజల మధ్యకు
మహారాజు ఈ మైసూర్ పాక్ ను ఎంతగానో ఇష్టపడ్డారు. దాని తయారీ విధానం చాలా సులభంగా అనిపించినా సరైన పాకంతో, నెయ్యి, శనగపిండి, చక్కెర నిష్పత్తితో దీన్ని తయారు చేయడం ఒక కళ. మహారాజు ఆదేశాల మేరకు,మాధప్ప రాజ వంటశాల నుండి బయట ప్రజలకు కూడా ఈ అద్భుతమైన తీపిని పరిచయం చేశాడు. రాజ కుటుంబం కోసం మాత్రమే తయారైన ఈ తీపి తర్వాత మైసూరు నగరమంతటా ఆపై భారతదేశమంతటా ప్రాచుర్యం పొందింది.
మాధప్ప మైసూరులో ఒక చిన్న దుకాణాన్ని కూడా తెరిచాడు అక్కడ ప్రజలు రాజ కుటుంబం రుచి చూసిన అదే మైసూర్ పాక్ ను కొనుగోలు చేయగలిగారు. ఇది త్వరలోనే చాలా ప్రజాదరణ పొందింది. కాలక్రమేణా మైసూర్ పాక్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారతీయ తీపి పదార్థాలను ఇష్టపడే వారిలో ప్రసిద్ధి చెందింది.
మైసూర్ పాక్ వైవిధ్యాలు
కాలంతో పాటు మైసూర్ పాక్ తయారీలో కొన్ని వైవిధ్యాలు కూడా వచ్చాయి. మొదట్లో కేవలం నెయ్యితో తయారయ్యే ఘీ మైసూర్ పాక్ మాత్రమే ఉండేది. ఇది నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మృదువుగా, తీయగా ఉంటుంది. ఆ తర్వాత తక్కువ నెయ్యితో కొంచెం గట్టిగా ఉండే రిఫైన్డ్ ఆయిల్ మైసూర్ పాక్ కూడా తయారవడం మొదలైంది. ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. అయితే నిజమైన మైసూర్ పాక్ రుచిని ఆస్వాదించాలంటే నెయ్యితో చేసిన మృదువైన మైసూర్ పాక్ మాత్రమే సరైన ఎంపిక అని చాలా మంది అభిప్రాయం.
ఈ తీపి పదార్థం కేవలం పండుగలలోనే కాదు రోజువారీ జీవితంలోనూ, ప్రత్యేక సందర్భాలలోనూ, బహుమతిగానూ విస్తృతంగా వినియోగించబడుతుంది. దీని సువాసన దాని మృదువైన ఆకృతి,దాని తీపి రుచి మనసును ఆహ్లాదపరుస్తాయి.
మైసూర్ పాక్ కేవలం ఒక తీపి పదార్థం కాదు, అది ఒక చరిత్ర, ఒక సంస్కృతి, ఒక అద్భుతమైన రుచి ప్రయాణం. మైసూరు రాజభవనంలో పుట్టి, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఈ తీపి చరిత్ర, దీనిని రుచి చూసిన ప్రతిసారి మనసులో మెదులుతూ ఉంటుంది.



Click it and Unblock the Notifications











