Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
బ్రహ్మ రాసిన తలరాతను ఎలా మార్చుకోవచ్చో తెలుసా?
బ్రహ్మ రాసిన రాతను ఎవరూ మార్చలేరు ఈ మాట మనం తరచుగా వింటూ ఉంటాం. జీవితంలో ఎదురైన ఓటమిలకు, కష్టాలకు మన తలరాతను నిందించడం సర్వసాధారణం. అయితే మన జీవితం కేవలం విధి ఆడిస్తున్న నాటకమా? మన చేతుల్లో ఏమీ లేదా? తలరాత మార్చలేనప్పుడు ఇన్ని పూజలు ఎందుకు అనే డౌటు కూడా చాలామందికి వస్తుంటది. తలరాత మార్చుకున్న విషయంపై మన పురాణాలు, చరిత్ర అద్భుతమైన సమాధానాలు ఇస్తున్నాయి. తలరాత అనేది ఒక ప్రారంభ స్థానం మాత్రమేనని, దాన్ని మార్చుకోవచ్చని అవి నిరూపిస్తున్నాయి.
మన తలరాతను బ్రహ్మ రాసేసి తల్లి గర్భంలోకి పంపే ముందు నా రాతను నేను కూడా మార్చలేను కేవలం ఉపాసన శక్తితోనే తలరాతను ఎవరికి వారు మార్చుకోగలరు అని బ్రహ్మ సృష్టంగా చెబుతారు. ఆ ఉపానస మార్గమే భగవన్ నామప్మరణ. నిరంతరం భక్తితో భగవంతుని ధ్యానిస్తూ జప దాన పుణ్య కర్మలను అనుసరిస్తే ఎవ్వరైనా తమ తలరాతను మార్చుకోవచ్చని పండితులు చెబుతుంటారు. మార్కండేయుడిని ఇందుకు ఉదాహరణగా చెబుతుంటారు.

పురాణాలు చెప్పే పాఠాలు
పదహారేళ్లకే మృత్యువు రాసిపెట్టి ఉన్న మార్కండేయుడు తన తలరాతకు తలవంచలేదు. శివుడిని ఏకాగ్రతతో ప్రార్థించాడు. యముడు తన పాశాన్ని విసిరినప్పుడు మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా పట్టుకున్నాడు. భక్తుడిని రక్షించడానికి సాక్షాత్తూ ఆ మహాశివుడే యముడిని ఎదిరించి, మార్కండేయుడికి చిరంజీవిగా వరం ప్రసాదించాడు. ఇక్కడ భక్తి, సంకల్పం..బ్రహ్మరాతను మార్చేశాయి.
మరో శక్తివంతమైన ఉదాహరణ సావిత్రి. ఆమె భర్త సత్యవంతుడికి అల్పాయుష్షు అని తెలిసినా, ఆమె వెనకడుగు వేయలేదు. యమధర్మరాజు సత్యవంతుడి ప్రాణాలను తీసుకెళ్తున్నప్పుడు, ఆమె తన పాతివ్రత్య మహిమతో వాక్చాతుర్యంతో యముడినే అనుసరించి, అద్భుతమైన వాదనలతో ఆయన మనసును గెలిచి, తన భర్త ప్రాణాలను తిరిగి పొందింది. ఇది స్త్రీ సంకల్ప బలానికి, పట్టుదలకు ప్రతీక.
చరిత్ర నేర్పిన సత్యాలు
పురాణాలే కాదు మన కళ్ల ముందున్న చరిత్ర కూడా ఇదే సత్యాన్ని ఘోషిస్తోంది. ఒక పేద కుటుంబంలో, చెక్క ఇంట్లో పుట్టిన అబ్రహం లింకన్ జీవితంలో ఎన్నో వైఫల్యాలను చవిచూశారు. అయినా పట్టువదలకుండా ప్రయత్నించి అమెరికా అధ్యక్షుడిగా చరిత్రలో నిలిచిపోయారు. ఆయన తలరాతలో పేదరికం రాసి ఉండవచ్చు, కానీ ఆయన కృషితో దాన్ని తిరగరాసుకున్నారు.
మన దేశంలో పేపర్ బాయ్ స్థాయి నుండి భారత రాష్ట్రపతిగా, మిసైల్ మ్యాన్"గా ఎదిగిన డా. ఏ.పి.జె. అబ్దుల్ కలాం జీవితం మనందరికీ ఒక గొప్ప పాఠం. పరిస్థితులు, తలరాత అనేవి కేవలం సాకులేనని అకుంఠిత దీక్ష, కఠోర శ్రమ ఉంటే ఎంతటి ఉన్నత శిఖరాలనైనా అధిరోహించవచ్చని ఆయన జీవితం నిరూపించింది.
తలరాత అనేది విధి మన చేతికిచ్చిన ముడిసరుకు లాంటిది. కర్మ సిద్ధాంతం ప్రకారం మన గత కర్మల ఫలం మన ప్రస్తుత పరిస్థితికి కారణం కావచ్చు. కానీ మన ప్రస్తుత సంకల్పం, ప్రయత్నం, సత్కర్మలు మన భవిష్యత్తును నిర్దేశిస్తాయి.



Click it and Unblock the Notifications
