Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
Viral Video: విమానం మొత్తం బూడిదైనా భగవద్గీత మాత్రం చెక్కు చెదరలేదు..వీడియో చూస్తే షాక్!
మన దేశ చరిత్రలో అత్యంత ఘోరమైన విమాన ప్రమాదం గురువారం(జూన్ 12,2025)న గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగింది. గురువాం మధ్యాహ్నాం ప్రయణికులు,సిబ్బంది కలిపి మొత్తం 242 మందితో అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి లండన్ కు బయల్దేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన సెకన్ల వ్యవధిలోనే ఎయిర్ పోర్ట్ సమీపంలో కూలిపోయింది. ఓ మెడికల్ కాలేజీ హాస్టల్ మీదకు విమానం దూసుకెళ్లడంతో ఆ సమయంలో హాస్టల్ మెస్ లో భోజనం చేస్తున్న 25మందికి పైగా మెడికల్ విద్యార్థులు చనిపోయారు, చాలామంది తీవ్రగాయాలతో హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు.
విమానంలోని ఒకే ఒక్క ప్రయాణికుడు ఈ ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే విమాన ప్రమాదానికి సంబంధించి, ఘటనా స్థలానికి సంబంధించిన పలు వీడియోలు,ఫొటోలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే విమానం క్రాష్ అయి మంటలు చెలరేగి ప్రయాణికులు అందరూ సజీవ దహనం అయినా కూడా విమానంలో ఓ ప్యాసింజర్ క్యారీ చేస్తున్న భగవద్గీత బుక్ మాత్రం కాలిపోకుండా అలాగే ఉంది.

విమానం కూలిపోయిన ప్రాంతం చుట్టుపక్కల అంతా మంటలు వ్యాపించి అన్ని తగలబడ్డా కూడా భగవద్గీత బుక్ మాత్రం కాలిపోకుండా అలాగే ఉంది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న సమయంలో శిధిలాల కింద కాలిపోకుండా ఉన్న భగవద్గీత గ్రంధం బయటపడింది. ఇంత ఘోర ప్రమాదంలో కూడా భగవద్గీత పుస్తకం చెక్కు చెదరకుండా ఉండటం చూసి అందరూ ఆశ్చర్చానికి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది.
ఈ వీడియోను నెటిజన్లు ఇన్ స్టా,ట్విట్టర్,ఫేస్ బుక్ లలో షేర్ చేశారు. వైరల్ గా మారిన ఈ వీడియోలో ఓ వ్యక్తి ఆ భగవద్గీత బుక్ ని చూపిస్తూ ఒక్కో పేజీని కూడా తిప్పుతూ చూపించగా..బుక్ అసలు కాలిపోకుండా, చిరిగిపోకుండా కూడా ఉండటం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.



Click it and Unblock the Notifications