Chanakya Niti in Telugu: ఎప్పుడు మాట్లాడాలి? ఎప్పుడు మౌనంగా ఉండాలి?

మనలో చాలామందికి ఏదైనా సమస్య రాగానే వెంటనే స్పందించి మాట్లాడే అలవాటు ఉంటది. కొన్నిసార్లు మనం చెప్పే సరైన మాటలు కూడా అపార్థాలకు దారితీసి, పరిస్థితిని మరింత దిగజార్చుతాయి.

ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో ఒక అద్భుతమైన మాట చెప్పారు.. ఎప్పుడు మాట్లాడాలో తెలిసినవాడు బుద్ధిమంతుడు, కానీ ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలిసినవాడే నిజమైన జ్ఞాని. ఆలోచించకుండా మాట్లాడితే మీకే నష్టం కలిగించే ఆరు ముఖ్యమైన సందర్భాలు ఏమిటో ఇక్కడ చూడండి.

chanakya niti 6 situations to stay silent to avoid problems Know When to Speak When to stay silent

ఇద్దరి మధ్య వాదన జరుగుతున్నప్పుడు

ఇద్దరు వ్యక్తులు వాదించుకుంటున్నప్పుడు వాళ్లు అడగకుండానే మధ్యలో దూరిపోకండి. మీరు ఏ ఒక్కరి వైపు మాట్లాడినా, చివరకు ఆ వివాదంలో మీరే నిందలు పడాల్సి వస్తుంది. వాతావరణం చల్లబడేవరకు లేదా వారే మీ సహాయం కోరేవరకు మౌనంగా ఉండటమే బెటర్.

ఎదుటివాళ్లు వినే స్థితిలో లేనప్పుడు

మనం ఎంత మంచి సలహా ఇచ్చినా, స్వీకరించే మనస్తత్వం ఎదుటివారికి లేనప్పుడు మాట్లాడటం వృథా. కొందరు అప్పటికే తమ మనసులో ఒక నిర్ణయానికి వచ్చేసి ఉంటారు. అలాంటి వారికి పదే పదే వివరించాలని ప్రయత్నిస్తే అది పెద్ద వాదనకు దారితీస్తుంది.

Operation Firewall 2026: పాక్ ISI ని వణికించిన ఏపీ పోలీస్..దేశవ్యాప్తంగా ప్రశంసలు..వైజాగ్ లో ఏమైందంటే?Operation Firewall 2026: పాక్ ISI ని వణికించిన ఏపీ పోలీస్..దేశవ్యాప్తంగా ప్రశంసలు..వైజాగ్ లో ఏమైందంటే?

మీ మాటలకు గౌరవం లేని చోట

నలుగురు ఉన్న చోట మీ అభిప్రాయాన్ని పదేపదే విస్మరిస్తున్నా లేదా ఎగతాళి చేస్తున్నా.. వెంటనే మౌనం వహించడం ఉత్తమం. మన మాటలకు విలువ లేని చోట గొంతు చించుకోవడం తెలివైన పని కాదు. వారితో వాదనకు దిగి సమయం వృథా చేసుకునే కంటే హుందాగా మౌనంగా ఉండటమే బెటర్.

విషయంపై పూర్తి అవగాహన లేనప్పుడు

సగం సగం తెలిసిన విషయాల గురించి మాట్లాడటం చాలా ప్రమాదకరం. విషయం గురించి పూర్తిగా తెలియకుండా వాదనకు దిగితే మీ పరువును మీరే తీసుకున్నట్లు అవుతుంది. తెలియని విషయం గురించి చర్చ వచ్చినప్పుడు మౌనంగా ఉండి, ఇతరుల నుంచి నేర్చుకోవాలని చాణక్యుడు చెబుతున్నారు.

ఇతరుల వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాల్లో

కుటుంబ కలహాలు చాలా సున్నితమైనవి. వారి గతం, వారి మధ్య ఉన్న బంధం బయటి వ్యక్తులకు పూర్తిగా అర్థం కావు. కుటుంబ సభ్యులు ఆవేశంలో గొడవపడినా, కాలక్రమేణా వాటంతట అవే సర్దుకుంటాయి. కానీ మధ్యలో మీరు మాట్లాడే మాటలు వారి బంధాన్ని శాశ్వతంగా దెబ్బతీయవచ్చు. అందుకే పరాయి వాళ్ల ఇళ్ల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడమే మంచిది.

వాతావరణం తీవ్రమైన కోపంతో ఉన్నప్పుడు

మనిషికి కోపం ఉన్నప్పుడు విచక్షణ నశిస్తుంది. ఆ సమయంలో మీరు ఎంత తెలివిగా, న్యాయబద్ధంగా మాట్లాడినా.. అది వారికి ఒక విమర్శలాగే అనిపిస్తుంది. కోపాన్ని కోపంతో కాకుండా మౌనంతోనే జయించాలి. వాతావరణం సద్దుమణిగే వరకు వేచి చూడటమే అత్యంత సురక్షితమైన, తెలివైన మార్గం.

Story first published: Wednesday, October 7, 2026, 15:00 [IST]
Desktop Bottom Promotion