Latest Updates
-
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా?
Viral Video : చైనాలో క్రూరమైన తండ్రి..కన్నీళ్లతో బౌల్‌ను నింపమని చిన్నారి కూతురుకు చెప్పిన తండ్రి..!
చైనాలో ఒక చిన్నారి తండ్రి చేసిన పని అందరినీ ఆగ్రహానికి తెప్పిస్తుంది. పిల్లలు తప్పులు చేయడం సహజమే. అయితే అలాంటి తప్పులకు చిన్న పిల్లలని కూడా చూడకుండా కఠిన శిక్షలు వేయడం చాలా దారుణం. ఆ చిన్నారి ఎవరు, ఆ చిన్నారి చేసిన తప్పేంటి, ఆ తండ్రి చేసిన దారుణమైన అమానవీయమైన పనేంటో మనము తెలుసుకుందాం. చైనాలోని దక్షిణ ప్రాంతమైన యులిన్‌లో ఒక కుటుంబం వుంటుంది. వారి కుటుంబంలో తండ్రి తన చిన్నారి కూతురును డైనింగ్ టేబుల్ దగ్గర వచ్చి కూర్చోమన్నాడు. ఆ చిన్నారి పేరు జియాజియా. ఆ చిన్నారికి టీవీ అంటే చాలా ఆసక్తి. టీవీని ఎక్కువగా చూడ్డం తండ్రికి నచ్చలేదు. ఆ తండ్రి వెంటనే టీవీని స్విచ్ఛాఫ్ చేశాడు. దీంతో ఆ చిన్నారి గట్టిగా ఏడవడం స్టార్ట్ చేసింది.

చిన్నారి ఏడుస్తూ వుండగానే తండ్రి ఒక బౌల్‌ను తీసుకొని వచ్చి చిన్నారి ముందు పెట్టాడు. ఆ బౌల్‌లో కన్నీళ్లు మొత్తం నిండేటట్టు ఆ చిన్నారిని ఏడవమన్నాడు. ఆ చిన్నారి చెప్పిన విధంగానే ఏడుస్తూ కన్నీళ్లు మొత్తం బౌల్‌లో పడేట్టుగా ఏడుతూ వుంటే నెటిజెన్ల అందరి మనసు కలచి వేస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను ఆ చిన్నారి తల్లి రిలీజ్ చేసింది. ఆ చిన్నారి ఆ చిన్న బౌల్‌ను పట్టుకొని ఏడుస్తూ ఆ కన్నీళ్లు ఆ బౌల్‌లో పడుతూ వుంటే ఆ పరిస్థితి చాలా దారుణంగా వుంది. ఆ చిన్నారి తన చిన్ని చేతులతో ఆ బౌల్‌ను 10 సెకెండ్లు కూడా పట్టుకోలేక పోయింది. దీన్ని హ్యాండిల్ చేయడం నాకే చాలా కష్టంగా వుంది, నా బిడ్డకు ఎలా వుంటుందోనని ఆ తల్లి చాలా బాధపడింది.
అయితే తరువాత తన తండ్రి ఆ చిన్నారిని నవ్వమని కోరాడు. ఆ చిన్నారి ఏడుస్తున్న వీడియో చైనాకు చెందిన డోయున్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై బాగా వైరల్‌గా మారింది. కొన్ని నిమిశాల్లోనే లక్షల లైకులను సొంతం చేసుకుంది. ఈ వీడియోను చూసిన చాలా మంది ఆ చిన్నారి తండ్రిని విమర్శిస్తూ కామెంట్లు చేశారు. నువ్వు ముసలివాడివి అయినప్పుడు నువ్వు ఏడుస్తున్నప్పుడు నీ కూతురు కూడా నీకు ఇలాగే ఒక బౌల్ ఇచ్చి అందులో ఏడవమంటుంది. ఇలా నువ్వు ప్రతీ సారి తినే ముందు నీకు చేస్తే ఆ బాధనీకు తెలుస్తుంది అని మరో యూజర్ కామెంట్ చేశాడు.
పిల్లలను ఈ విధంగా పెంచడం వల్ల వారిలో నెగిటివ్ క్యారెక్టర్‌ను పెంచిన వాళ్లమౌతామని అంటున్నారు. ఎన్ని కష్టాలెదురైనా తమ సమస్యలను తాము పరిష్కరించుకోగలుగుతామనే విధంగా పిల్లలు ఎదుగుతారు. అయితే చైనాలో ఇలాంటి క్రూరమైన తల్లిదండ్రులు ఎక్కువగా వున్నారని పలు సర్వేలు బయటపెట్టాయ్. 2022లో ఇలాంటిదే మరో సంఘటన చోటుచేసుకుంది. చైనాలోని సెంట్రల్ హూబీలో తన 11 ఏళ్ల కూతురును ఎర్రటి ఎండలో తామర చెట్టు వేళ్ల కోసం తవ్వమన్నాడు. ఇలాంటి దారుణ సంఘటనలు చైనాలో విపరీతంగా పెరిగిపోతన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయ్. ఈ సంఘటనల పట్ల ప్రపంచ వ్యాప్తంగా నెటిజెన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.



Click it and Unblock the Notifications
