Latest Updates
-
హార్ట్ ఎటాక్ ముప్పును ముందుగానే పసిగట్టే కాలి బీపీ టెస్ట్.. ఎలా చేయాలంటే? -
నవరాత్రి స్పెషల్: ఉపవాసంలో తక్షణ శక్తినిచ్చే మఖానా లడ్డూ..ఈజీగా చేసుకోండిలా.. -
నవరాత్రుల్లో రెండుసార్లు గజకేసరి యోగం..ఈ 4 రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం, తిరుగులేని ధనలాభం! -
భారతదేశంలో బంగారం పారే నదులు ఇవే.. మీకు తెలుసా? -
నవరాత్రులు 3వ రోజు స్పెషల్..అన్నపూర్ణా దేవి నైవేద్యంగా కమ్మని కొబ్బరి పాయసం..ఇలా చేసుకోండి -
కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? యూరిక్ యాసిడ్ తగ్గాలంటే ఈ 3 ఫుడ్స్ తినకూడదు! -
అక్టోబర్ 12 నుంచి శుక్ర మౌఢ్యమి.. ఈ 5 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి! -
క్రిస్పీ చీజ్ పనీర్ సమోసా..సాయంత్రం వేళ పర్ఫెక్ట్ స్నాక్..ఇలా చేసుకోండి.. -
అందమైన అమ్మాయి పిలిచిందని అర్థరాత్రి రూమ్ కి వెళ్లిన బ్యాంక్ మేనేజర్..తర్వాత ఏమైందంటే..? -
జలుబు, దగ్గును తగ్గించే వెల్లుల్లి మిరియాల అన్నం..జస్ట్ 10 నిమిషాల్లోనే చేసుకోండిలా
Shocking: మెట్రో రైలులో సీటు కోసం గొడవ..ఒకరు మృతి..అసలేం జరిగిందంటే..?
ఇటీవల కాలంలో చిన్న చిన్న గొడవలు మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. తమ ఇంటి ఎదురు బైక్ పెట్టారంటూ గొడవల్లో, తమ ఇంటి దగ్గర కారు పార్కింగ్ చేశారంటూ, బస్సులో సీటు కోసం ఇలా చిన్న చిన్న విషయాలకు జరుగుతున్న గొడవల్లో చాలామంది ప్రాణాలే కోల్పోతున్నారు. తాజాగా మెట్రో రైలులో సీటు కోసం జరిగిన గొడవలో ఒక వ్యక్తి ప్రాణాలే కోల్పోయాడు.
అసలేం జరిగిందంటే...
అది అక్టోబర్ 8 సాయంత్రం. ఎప్పటిలాగే ఢిల్లీ మెట్రో రైలు పట్టాలపై పరుగలు పెడుతూ ప్రయాణికులను తమ తమ గమ్యస్థాలకు చేరవేస్తుంది. పవన్ శర్మ అనే 48 ఏళ్ల వ్యక్తి తన తల్లి దుర్గా శర్మాతో కలిసి యమున విహార్ ఏరియాకు వెళ్లేందుకు ద్వారకా మెట్రో స్టేషన్ లో ట్రైన్ ఎక్కాడు. ట్రైన్ లో సీనియర్ సిటిజన్స్ కోసం కేటాయించిన సీట్లో ఇద్దరూ కూర్చున్నారు.

సాయంత్రం 5: 30 గంటల సమయంలో 5: 30 గంటల సమయంలో సంజయ్ ప్రతాప్ సింగ్ అనే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, లాయర్ అయిన తన కొడుకు సిద్దార్ద్ సింగ్ తో కలిసి మండీ హౌస్ స్టేషన్ లో మెట్రో రైలు ఎక్కారు.
పవన్ శర్మ తల్లి చెప్పిన ప్రకారం..
అయితే ట్రైన్ లో సీనియర్ సిటిజన్స్ కి కేటాయించిన సీట్లో మీరెందుకు కూర్చున్నారు లేవాలి అని సంజయ్.. పవన్ శర్మని కొట్టాడు. తాము దూరం వెళ్లాల్సి ఉందని, అందుకే కూర్చున్నాం, అయినా సీటు ఇలా కొట్టి అడుగుతారా అంటూ పవన్ శర్మ అన్నాడు. దీంతో కోపంతో ఊగిపోయిన సంజయ్..పవన్ ని దూషించడం మొదలుపెట్టాడు. దీంతో తల్లి సూచనతో గొడవ వద్దులే అనుకొని పవన్ శర్మ తన తల్లితో కలిసి లేచి నిలబడాలని నిర్ణయించుకుని లేచి నిలబడే టైంలో ఏదో అన్నాడనే కారణంతో సంజయ్ కొడుకు సిద్దార్ద్ పవన్ ను మెడ పట్టుకుని లాగి ఛాతి మీద పిడిగుద్దులు గుద్దాడు. అయితే తన కొడుకుపై దాడిని అడ్డుకోవడదనికి ప్రయత్నించిన దుర్గా శర్మాని సంజయ్ చేతులు గట్టిగా పట్టుకుని కదలకుండా అడ్డుకున్నాడు.
ఒక్కరు కూడా స్పందించలేదు
అయితే ఇంత జరుగుతున్నా మెట్రో రైలులో ఆ కోచ్ లో ఉన్న ఏ ఒక్క ప్రయాణికుడు కూడా పట్టించుకోలేదు. తమకేం సంబంధం లేదు అన్నట్లుగా ఎవరికి వారు ఉండిపోయారు. రైలు సుప్రీంకోర్టు మెట్రో స్టేషన్ కి చేరుకోగానే పవన్ శర్మ సృహ కోల్పోయాడు. ఆ తర్వాత అతడిని లోక్ నాయక్ జయ ప్రకాష్(LNJP)హాస్పిటల్ కు తీసుకెళ్లగా మరణించినట్లు డాక్టర్లు కన్ఫర్మ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులైన మాజీ ఐఏఎస్ సంజయ్, అతని కొడుకు సిద్దార్ద్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. సీనియ్ సిటు విషయంలో జరిగిన వివాదం ప్రాణాంతక ఘటనగా ఎలా అయ్యిందో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



Click it and Unblock the Notifications
