ఇది కదా సక్సెస్..రెస్టారెంట్ లో పాత్రలు కడిగి బల్లలు తుడిచేవాడు..నేడు వందల కోట్లకు ఓనర్,దోశ కింగ్ గా పేరు

చదువు అబ్బలేదు..ఏం చేయాలో తోచలేదు..తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే..ఏం చేయాలో,ఎటు పోవాలో కూడా దిక్కుతోచని స్థితిలో తండ్రి జేబులో చేతులు పెట్టగా కొంత చిల్లర దొరికింది..అది తీసుకొని నేరుగా రైల్వే స్టేషన్ కి వెళ్లాడు..ముంబై వెళ్లే రైలు ఫ్లాట్ ఫాం మీదకు వచ్చింది. రైలు ఎక్కి కూర్చున్నాడు..చివరి స్టాప్ ముంబై కావడంతో రైలు దిగి స్టేషన్ బయటకు వెళ్లాడు..నెలకు 18 రూపాయల జీతంకి పాత్రలు కడిగాడు..కట్ చేస్తే ఇప్పుడు కోట్లకు అధిపతి అయ్యాడు. సామాన్యుల్లో అసామాన్యుడిగా మారిపోయాడు. నెలకు కేవలం 18 రూపాయల జీతానికి పనిచేస్తే వ్యక్తి కోట్లకు అధిపతి ఎలా అయ్యాడు..అసలు అతనెవరు..ఇది ఎప్పుడు జరిగింది వంటి అనేక ఆసక్తికర విషయాలను ఇప్పుడు చూద్దాం.

కర్ణాటక రాష్ట్రంలో ఉడుపి పట్టణంలో జయరామ్ బనన్ అనే వ్యక్తి మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు. అయితే చదువు మీద కంటే ఇతర వాటిమీదనే జయరామ్ కి ఆశక్తి ఉండేది. 13 ఏళ్ల వయస్సులో స్కూల్ ఎగ్జామ్ లో ఫెయిల్ అవడంతో.. ఎంత చదివినా ఇదంతా మనకు సెట్ అవ్వదు అని అనుకున్నాడు. వెంటనే తండ్రికి తెలియకుడా అతడి జేబులో ఉన్న చిల్లర తీసుకొని ఇంట్లో ఏం చెప్పకుండా సక్కగా రైల్వే స్టేషన్ కి వెళ్లాడు. అది 1967..తండ్రి జేబులో నుంచి తెచ్చుకున్న కొద్ది డబ్బుతో ముంబై రైలెక్కాడు. ముంబైలో దిగాక దిక్కుతోచలేదు..ఆ మనుషులు,ఆ హడావుడి చూసి జయరామ్ కి ఒకటి మాత్రం సృష్టంగా అర్థమైంది. నేను ఈ సిటీలో ఉండాలి అంటే ముందు నాకంటూ ఓ పని,ఉండటానికి స్థలం ఉండాలని ఆలోచించి ఓ రెస్టారెంట్ లో పాత్రలు కడగడటం,బల్లలు తుడిచే పనిలో చేరాడు. నెలకు 18 రూపాయలు జీతం.

Dishwasher to Dosa King Jayaram Banan s Inspiring Journey

అయితే ఒకరి పొట్ట కొట్టకుండా ఏ పని చేసినా తప్పు కాదు అని భావించేవాడు జయరాం. చేసేది పాత్రలు కడగటం,బల్లలు తుడిచే పని అయినా కూడా దాంట్లో కూడా సిన్సియర్ గా ఉండేవాడు. అలా ఆరేళ్లు పనిచేశాక జీతం రూ.18 నుంచి రూ.200కి పెరిగింది..మెల్లిగా అతడి అంతకితభావాన్ని గుర్తించిన రెస్టారెంట్ యాజమాన్యం జయరామ్ ని వెయిట్ ని ఆ తర్వాత మేనేజర్ ని కూడా చేసింది. ఏ రెస్టారెంట్లో అయితే పాత్రలు కడిగి బల్లలు తుడిచాడో అదే రెస్టారెంట్ కి మేనేజర్ అయ్యాను కదా నేను విజయం సాధించాను ఇక చాలు అని జయరామ్ ఎప్పుడూ అనుకోలేదు.

ఆ రోజుల్లో ముంబైలో..సౌత్ ఇండియా ఫుడ్ అంటే చాలు జనం ఎగబడి తినడం జయరామ్ బాగా గుర్తించాడు. దీనిని ఎలాగైనా తాను క్యాష్ చేసుకోవాలి అనుకున్నాడు. వెంటనే అతడి బ్రెయిన్ లో ఓ ఆలోచన వచ్చింది. దీంతో చేసే మేనేజర్ ఉద్యోగం మానేసి 1974లో ఢిల్లీ రైలెక్కాడు. ఢిల్లీ వెళ్లి అక్కడి క్యాంటీన్ ని ఎలా మేనేజ్ చేయాలి, వివిధ ఊర్లలో లేదా ప్లేస్ లలో ఫుడ్ బిజినెస్ ఎట్లా నడపాలి వంటి కిటుకులు అన్నీ తెలుసుకున్నాడు. ఇవన్నీ తెలుసుకున్నాక 1986లో ఢిల్లీలోని ఢిఫెన్స్ కాలనీలో సాగర్ అనే పేరుతో తన ఫస్ట్ రెస్టారెంట్ ని ప్రారంభించాడు. మొదటి రోజు రెస్టారెంట్ కి వచ్చిన ఆదాయం 408 రూపాయలు. దీంతో జయరామ్ కి ఇంకా బాగా అర్థమైన విషయం ఏంటంటే..నార్త్ ఇండియాలో సౌత్ ఇండియా ఫుడ్ కి చాలా క్రేజ్ ఉంది కాబట్టి కాస్ట్ ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ టేస్ట్ మాత్రం బాగుండాలి అని.

కొద్ది రోజుల్లో సాగర్ రెస్టారెంట్ కి బాగా పేరు వచ్చింది. దూరం నుంచి కూడా టేస్ట్ కోసం ఇక్కడికి వచ్చి తింటుండేవాళ్లు ఢిల్లీలో. దీంతో మంచి ఆదాయం కూడా రావడంతో ఢిల్లీలోని లోథి మార్కెట్ లో ఇంకో రెస్టారెంట్ ప్రారంభించాడు. కాస్ట్ ఎక్కువ ఉన్నా టేస్ట్ ఉండటంతో అంతా సాఫీగా సాగిపోయింది..ఆదాయం బాగా రావడంతో ఢిల్లీలోని అనేక చోట్ల అలాగే నార్త్ ఇండియాలోని చాలా ప్లేస్ లలో సాగర్ రత్న పేరుతో రెస్టారెంట్లు ప్రారంభిచాడు. ప్రస్తుతం దేశ,విదేశాల్లో కలిపి 90 రెస్టారెంట్లు నడుపుతున్నాడు. కెనడా,బ్యాంకాక్, సింగపూర్ దేశాల్లో కూడా రెస్టారెంట్లు పెట్టాడు.

Dishwasher to Dosa King Jayaram Banan s Inspiring Journey

అంతా సాఫీగా సాగిపోవడంతో 2001లో స్వాగత్ పేరుతో మరో రెస్టారెంట్ చైన్ ప్రారంభించాడు. దీంతో అతడి దశ మరో రేంజ్ కి వెళ్లిపోయింది. ఈయన రెస్టారెంట్ లో దోశ,సాంబార్ కోసం జనం కిలోమీటర్ల మేర జనం క్యూ కట్టేవాళ్లు. జయరామ్ కి దోశ కింగ్ ఆఫ్ నార్త్ అనే పేరు కూడా వచ్చింది. ఓ రిపోర్ట్ ప్రకారం జయరామ్ ఆస్తుల విలువ రూ.300 కోట్ల పైమాటే. విజయం ఓవర్ నైట్ లో రాదు అనడానికి,కష్టపడితే ఎప్పటికైనా విజయం తథ్యం అనే మాటలకు జయరామ్ బెస్ట్ ఉదాహరణగా నిలిచాడు.

Desktop Bottom Promotion